IND VS NZ: ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ఫైనల్ లో ( Champions Trophy 2025 ) టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. అందరూ ఊహించినట్లుగానే 2025 ఛాంపియన్ గా అవతరించింది టీమిండియా ( Team India ). ఫైనల్ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టిన టీమిండియా.. దుబాయ్ గడ్డపై జెండా ఎగరవేసింది. 49 ఓవర్లలో… ఆరు వికెట్లు నష్టపోయిన టీమిండియా…. గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో 2025 ఛాంపియన్ గా అవతరించింది. చివర్ లో రవీంద్ర జడేజా అలాగే కేఎల్ రాహుల్ ఇద్దరు జట్టును నడిపించారు. ఫోర్ కొట్టి రవీంద్ర జడేజా… టీమిండియాను గెలిపించాడు. టీమిండియా చాంపియన్ గా నిలిస్తే.. న్యూజిలాండ్ రన్నరప్ గా నిలవడం జరిగింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ), శ్రేయస్ అయ్యర్, కె ఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా అందరూ బ్యాటర్లు రాణించడంతో టీమిండియా సులభంగా విజయాన్ని అందుకుంది.
Also Read: Yuzvendra Chahal: దుబాయ్ లో కొత్త ప్రియురాలితో చాహల్ ఎంజాయ్.. షాక్ లో ధనశ్రీ ?
ఇక అంతకుముందు… టాస్ గెలిచిన న్యూజిలాండ్… మొదట బ్యాటింగ్ చేయడం జరిగింది. ఈ తరుణంలోని నిర్ణీత 50 ఓవర్లలో… 7 వికెట్లు నష్టపోయి 251 పరుగులు చేసింది న్యూజిలాండ్. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో… 251 పరుగులకే పరిమితమైంది న్యూజిలాండ్. టీమిండియా బౌలర్లు కట్టడి చేయకపోతే… 300 దాటేది న్యూజిలాండ్ స్కోర్. ముఖ్యంగా టీమిండియా స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అలాగే రవీంద్ర జడేజా అద్భుతంగా బౌలింగ్ చేసి న్యూజిలాండ్ కు చుక్కలు చూపించారు. అయితే న్యూజిలాండ్ విధించిన 252 పరుగుల లక్ష్యాన్ని… టీమిండియా సమిష్టిగా రాణించి… చేదించగలిగింది. ఈ తరుణంలోనే టీమిండియా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలవడం జరిగింది.
ఇక టీమిండియా బ్యాటింగ్ విషయానికి వస్తే… కెప్టెన్ రోహిత్ శర్మ 83 బంతుల్లో 76 పరుగులు చేసి దుమ్ము లేపాడు. మరో ఓపెనర్ గిల్ 50 బంతుల్లో 31 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. వీళ్ళిద్దరి వికెట్లు పడకపోతే టీమిండియా ఎప్పుడో గెలిచేది. ఆ తర్వాత మొదటి వికెట్ కు వచ్చిన విరాట్ కోహ్లీ ఒకే ఒక పరుగు చేసి ఎల్బిడబ్ల్యు అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మిడిల్ ఆర్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ మరోసారి రెచ్చిపోయాడు. 62 బంతుల్లో 48 పరుగులు చేసి.. టీమిండియా కు ఊపిరి పోసాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ 29 పరుగులు చేయగా… కె ఎల్ రాహుల్ ( KL Rahul ) 34 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 18 పరుగులు చేయగా రవీంద్ర జడేజా 9 పరుగులు చేశాడు.
ప్రైజ్ మనీ ఎంతంటే ?
2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా నిలిచింది. ఈ నేపథ్యంలోనే… టీమిండియా కు భారీ ప్రైజ్ మనీ రాబోతుంది. ఛాంపియన్గా నిలిచినందుకు 2.24 మిలియన్ డాలర్స్ అందుకోనుంది టీమిండియా. అలాగే రన్నరప్ గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు 1.12 మిలియన్ డాలర్స్ రానున్నాయి. అలాగే సెమీఫైనల్ లో ఓడిపోయిన జట్లకు 560,000 డాలర్స్ రానున్నాయి.
Also Read: Champions Trophy 2025: ఫైనల్స్ లో టీమిండియా గెలిస్తే బట్టలిప్పి తిరుగుతా… హాట్ బ్యూటీ సంచలన పోస్ట్ !
JADEJA FINISHES OFF IN STYLE! 🇮🇳
TEAM INDIA WIN THE CHAMPIONS TROPHY 2025 🏆#ChampionsTrophyOnJioStar #INDvNZ #ChampionsTrophy pic.twitter.com/ismVCQQndD
— Star Sports (@StarSportsIndia) March 9, 2025
WE WON , INDIA WON , ALL INDIANS WON
WE DID IT Congratulations Team India 😭🇮🇳pic.twitter.com/Pk52solEoo
— Pikachu (@11eleven_4us) March 9, 2025