జుట్టును కత్తిరించకుండా కాల్చే విధానాన్ని వెలాటెరాపియా అంటారు. క్యాండిల్ కటింగ్ లేదంటే హెయిర్ బర్నింగ్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఇది ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అవుతోంది. ఈ పద్ధతిలో హెయిర్ స్టైలిస్ట్ జుట్టును చిన్న భాగాలుగా తిప్పి, చీలిక చివరలను కాల్చడానికి కొవ్వొత్తి మంటను ఉపయోగిస్తారు. జుట్టును పొడవుగా, ఆరోగ్యంగా ఉంచడమే లక్ష్యంగా ఈ పద్దతిని ఉపయోగిస్తారు.
ఈ ట్రెండ్ 1960లలో బ్రెజిల్ లో ప్రారంభమైంది. అలెస్సాంద్రా అంబ్రోసియో, బార్బరా ఫియాల్హో లాంటి ప్రముఖులు ఈ ట్రెండ్ ను ప్రయత్నించడంతో, 2015లో బాగా పాపులర్ అయ్యింది. అప్పటి నుంచి ఈ విధానం పలు దేశాలకు విస్తరించింది. ఈ ట్రెండ్ కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ విధానం త్వారా జుట్టు చివరలను కాల్చి తొలగించడం ద్వారా పొడవుగు, ఆరోగ్యంగా ఉంచుతారు.
వెలాటెరాపియాలో భాగంగా జుట్టును చిన్న చిన్న భాగాలుగా విభజించి, వాటిని ట్విస్ట్ చేస్తారు. ఆ తర్వాత, ఒక ప్రత్యేక మెటల్ క్యాండిల్ లేదంటే ఫ్లేమ్ ను ఉపయోగించి జుట్టు చివర్లను కొన్ని సెకన్ల పాటు కాల్చుతారు. ఇది డెడ్ ఎండ్స్ ను తొలగించి, కటికల్స్ ను సీల్ చేస్తుంది. ఈ ప్రక్రియకు కనీసం రెండు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. ఈ పద్దతి ద్వారా జుట్టు మెరవడంతో పాటు మందంగా కనిపిస్తుంది. బ్రేకేజ్, డ్రైనెస్ ను తగ్గిస్తుంది. కెమికల్స్ లేకుండా సహజంగా జుట్టును కాల్చడం వల్ల రసాయన ప్రభావం ఉండదు. ఎక్కువ హీట్ టూల్స్, కలరింగ్ వల్ల దెబ్బతిన్న జుట్టుకు ఈ విధానం మంచిది. 30-45 రోజులకు ఒకసారి చేయవచ్చు. కానీ, 3 నుంచి 4 నెలలకు ఒకసారి మాత్రమే నిపుణులు సిఫార్సు చేస్తారు.
Read Also: సెటిరిజిన్ మాత్ర తీసుకుంటే నిద్ర ఎందుకు వస్తుంది? ఇది సేఫేనా? సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?
వెలాటెరాపియా అనేది ప్రొఫెషనల్ స్పెషలిస్ట్ తో మాత్రమే చేయాలి. ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నంచకూడదు. జుట్టు కాలిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఫ్లేమబుల్ ప్రొడక్ట్స్ వల్ల జట్టు మరింత దెబ్బతినే అవకాశం ఉంటుంది. తప్పుగా జుట్టును కాల్చడం వల్ల జుట్టు బలహీనపడుతుంది. లేదంటే స్కారింగ్ ఎలోపీషియా అంటే పర్మినెంట్ హెయిర్ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే, అనుభవజ్ఞుడైన స్పెషలిస్ట్ ను ఎంచుకోవడం మంచిది. ట్రిమ్మింగ్ తో పోల్చితే, ఇది జుట్టు పొడవును కోల్పోకుండా మెరుగుపరుస్తుంది. కానీ రెగ్యులర్ ట్రిమ్స్ 6 నుంచి 8 వారాలకు ఒకసారి తప్పని సరిగి చేయించుకోవాలి. ఈ చికిత్స గురించి మరిన్ని వివరాలు కావాలంటే, హెయిర్ స్పెషలిస్ట్ ను సంప్రదించాలి. జుట్టు రకానికి తగినట్టు సలహా తీసుకోవడం మంచిది!
Read Also: ఆ దేశంలో కేవలం 8 సెకన్లలోనే పాస్ పోర్ట్ చెకింగ్ కంప్లీట్.. అదెలా సాధ్యం?