lychee Fruit: ఎక్కువ పోషకాలున్న పండ్లు కేవలం సమ్మర్‌లో వస్తాయి. దాని వ్యవధి కొద్దిరోజులు మాత్రమే. వాటి ద్వారా ఆరోగ్యానికి లభించే బెనిఫిట్స్ అన్నీఇన్నీకావు. కాకపోతే వాటి గురించి మనకు తెలియక పట్టించుకోము. మరికొందరైతే టేస్ట్ చూస్తారు. అలాంటి వాటిలో లిచీ పండు ఒకటి. ఈ మధ్య హైదరాబాద్ శివారు, గ్రీనరీ ఎక్కువగా ఉన్న చోట సైకిల్, తోపుడు బళ్లుపై గుత్తులు గుత్తులుగా ఎర్రగా మనకు కనిపిస్తున్నాయి. అవే లచీ ఫ్రూట్. ఇంతకీ మన ఆరోగ్యానికి ఎంత మేరా మేలు చేస్తాయో వాటిపై ఓ లుక్కేద్దాం.
లిచీ రుచికరమైన పండు. పోషక విలువలతో నిండిన సమ్మర్ ఫ్రూట్. వేసవిలో ఎక్కువగా లభిస్తుంది. అప్పుడే తెలిసిన వాళ్లు వీటిని కోనుగోలు చేస్తారు. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. లిచీలో నీరు అధికంగా ఉండటం వలన వేసవిలో డీహైడ్రేషన్‌ను నివారించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో మెగ్నీషియం, భాస్వరం, ఇనుము, మాంగనీస్, రాగి వంటి ముఖ్యమైన పోషకాలకు కేరాఫ్‌గా చెబుతారు.
హైడ్రేషన్-శీతలీకరణ- లిచీ వేసవిలో ముఖ్యమైన పండ్లలో ఇది కూడా ఒకటి. ఇందులో అధిక నీటి శాతం ఉంటుంది. దాదాపు దాదాపు 82 శాతం ఉంటుంది. ఎండ నుంచి ఉపశమనం కూడా. శరీర వేడి ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. జీవక్రియ విధులకు మద్దతుగా ఉంటుంది. తలనొప్పి, అలసట, పొడి చర్మం వంటి సమస్యలను నివారించడానికి సరైన ఫ్రూట్. విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేసి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
హృదయ ఆరోగ్యం-లిచీలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు కణాల నష్టాన్ని నివారించడంలో కీలకమైనది. రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. వాపును తగ్గించడం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాలను తగ్గించడానికి తన వంతు పాత్ర పోషిస్తుంది.
ALSO READ: వేయించిన లేదా పచ్చి వేరు శనగ.. రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది?
చర్మ ఆరోగ్యం- లిచీలో అధిక నీటి శాతం, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు యూవీ కిరణాలు, పర్యావరణ కాలుష్య కారకాల హానికరమైన ప్రభావాలను ఎదుర్కొంటుంది. వృద్ధాప్య చాయలను తగ్గించడానికి ఇదొక పండుగా చెబుతారు కొందరు నిపుణులు.
జీర్ణాశయ ఆరోగ్యం- లిచీ ఆహార ఫైబర్‌కు మంచి మూలం. జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే మల బద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులో నీరు-సహజ చక్కెరలు ఉంటాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సున్నితమైన, ప్రభావవంతమైన మార్గంగా మారుతుంది. పొట్ట నొప్పులు, అజీర్ణం వంటి సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది.
బరువు- బరువు గురించి అశ్రద్ధ వహించేవారికి కీలకమైన ఫ్రూట్. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. సహజ చక్కెరలు ఉండడం వల్ల త్వరగా శక్తిని పెంచుతుంది. ఫైబర్ కంటెంట్ ఉండడంతో కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. అనారోగ్యకరమైన ఆహారాన్ని తినే ధోరణిని నెమ్మదిగా తగ్గిస్తుంది లిచీ.
గుండె- లీచీలో పొటాషియం ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. పొటాషియం సరైన గుండె పనితీరును నిర్వహించడానికి, రక్తపోటును నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యం చేస్తుంది. హృదయ సంబంధ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి సహాయ పడుతుంది. ఐరన్ కొంతమేర ఉండడంతో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయ పడుతుంది.
ఎముకలు-లిచీలో మెగ్నీషియం, భాస్వరం, ఇనుము, మాంగనీస్, రాగి వంటి పోషకాలు ఉంటాయి. ఎముకలను బలంగా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.వేసవిలో శారీరక శ్రమ పెరగడం వల్ల ఎముకలు, కీళ్లపై అదనంగా ఒత్తిడి పెరుగుతుంది.
లిచీలో బి-కాంప్లెక్స్ విటమిన్లు, థయామిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్, ఫోలేట్లు జీవక్రియ ప్రక్రియలకు చాలా ముఖ్యమైనవి. ఈ విటమిన్లు ఆహారాన్ని శక్తిగా మార్చడానికి ఉపయోగపడతాయి. జీవక్రియ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయ పడుతుంది.