Raw Vs Roasted Peanuts: వేరు శనగలో అనేక పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. దాదాపు అందరూ వేరుశనగలను ఏదో ఒక రూపంలో తింటూనే ఉంటారు. అప్పుడప్పుడు వేరుశనగ తినడం ఒక సాధారణ అలవాటు. కానీ ఏడాది పొడవునా వీటిని తినే వారు కూడా చాలా మందే ఉన్నారు. కానీ ఆరోగ్యం విషయానికి వస్తే.. ఒక ప్రశ్న తరచుగా ప్రజలను గందరగోళానికి గురిచేస్తుంది. పచ్చి వేరు శనగలు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయా లేదా కాల్చినవి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయా ? అని రెండింటికీ వాటి స్వంత ప్రయోజనాలు ఉన్నాయి. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం. .మీకు ఏ వేరు శనగ మంచిదో మీ అవసరం , ఆరోగ్య పరిస్థితిని బట్టి నిర్ణయించుకోవాలి.
వేరుశనగలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్ ఇ , మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల వీటిని ‘పేదల జీడిపప్పు’ అని కూడా పిలుస్తారు. ఇది గుండె ఆరోగ్యం నుండి రక్తంలో చక్కెర నియంత్రణ వరకు అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. కానీ వీటిని ఎలా తినాలి ? పచ్చిగా లేదా కాల్చిన తర్వాతా ? ఈ ప్రశ్న సాధారణమే కానీ సమాధానం మాత్రం మీ శరీర అవసరాలపై ఆధారపడి ఉంటుంది.
ముడి వేరు శనగలు:
మొత్తం పోషకాల విషయానికి వస్తే.. వేరుశనగలను ఉడికించడం లేదా వేడి చేయడం వంటివి చేయకపోతే వాటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ , ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి ఎటువంటి హాని కలిగించవు.
ప్రత్యేకత ఏమిటంటే.. ఇది గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు. వేరు శనగ జీర్ణం కావడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. గ్యాస్‌తో బాధపడేవారు దీనిని తక్కువగా తీసుకోవడం మంచిది.
కాల్చిన వేరు శనగలు- రుచి, జీర్ణ క్రియ:
కాల్చిన వేరుశనగలు తినడానికి మరింత రుచికరంగా ఉంటాయి. ఇవి జీర్ణం కావడం కూడా చాలా సులభం. వీటిని వేయించడం వల్ల ఆహారంలోని తేమ శాతం తగ్గుతుంది. తద్వారా బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
మార్కెట్లో తరచుగా ఉప్పు లేదా వేయించిన వేరుశనగలు రెట్టింపు రుచిని కలిగి ఉంటాయి. కానీ అధిక ఉప్పు , నూనె వాటిలో.. ఆరోగ్య ప్రయోజనాలను తగ్గిస్తాయి. అందుకే.. ఉప్పు లేకుండా కాల్చిన వేరుశనగలను తినడం చాలా మంచిది.
Also Read: ఫేస్ క్రీములు అవసరమే లేదు, కాఫీ ఇలా వాడితే.. మెరిసే చర్మం
మీ ప్రాధాన్యత ఎక్కువ పోషకాహారం, సహజ రూపం అయితే.. పచ్చి వేరుశనగలు సరైన ఎంపిక. మీరు తేలికైన, సులభంగా జీర్ణమయ్యే , రుచికరమైన చిరుతిండిని కోరుకుంటే.. ఉప్పు లేకుండా కాల్చిన వేరు శనగలను తినండి. మధుమేహం, గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు ఉన్న రోగులకు, వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే వేరు శనగ రకాన్ని ఎంచుకోవడం ముఖ్యం.