BigTV English

Kidney Cancer Symptoms: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా ? జాగ్రత్త !

Kidney Cancer Symptoms: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా ? జాగ్రత్త !

Kidney Cancer Symptoms: మన శరీరంలో కిడ్నీలు అత్యంత ముఖ్యమైన అవయవాలు. కిడ్నీలు నిరంతరం రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. కిడ్నీల్లో చిన్న సమస్య వచ్చినా అది తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా కిడ్నీ క్యాన్సర్ అనేది చాలా మంది ప్రస్తుతం ఎదుర్కుంటున్న సమస్య. కొన్ని లక్షణాలు కనక మీలో కనిపిసస్తే అది కిడ్నీ క్యాన్సర్ కావొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి కిడ్నీ క్యాన్సర్ లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


కిడ్నీ క్యాన్సర్ లక్షణాలు:

కిడ్నీ క్యాన్సర్‌కు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వెంటనే వైద్యులను సంప్రదించాలని అంటున్నారు.


లో బ్యాక్ పెయిన్
పొత్తి కడుపు పై భాగంలో నొప్పి
మూత్రంలో రక్తం రావడం
బరువు తగ్గడం
అధిక రక్తపోటు
ఎముక నొప్పి
జ్వరం
ఆకలి లేకపోవడం

Also Read: మీ పిల్లలు బరువు పెరగడం లేదా ? ఈ ఫుడ్స్ తినిపించండి

పైవన్నీ కిడ్నీ క్యాన్సర్ సాధారణ లక్షణాలు. కానీ కొందరిలో పెద్దగా లక్షణాలు కూడా కనిపించవు. అందుకే 50 ఏళ్లు పైబడిన వారు ధూమపానం అలవాటు ఉన్న వారు రెగ్యులర్‌గా హెల్త్ చెకప్‌లు చేయించుకోవడం అవసరం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వ్యాధి నిర్థారణ: అబ్డామినల్, సీబీసీ, కిడ్నీ అల్ట్రా సౌండ్ , యూరిన్ ఎగ్జామినేషన్ , బయాప్సీ వంటి పరీక్షల ద్వారా కిడ్నీ క్యార్సర్‌ను నిర్ధారించవచ్చు.

చికిత్స ఎంపికలు : మూత్ర పిండాల సమస్యలకు చికిత్స వ్యాధి దశపైన ఆధారపడి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ట్యూమర్ దశ, గ్రేడ్, పేషెంట్ వయస్సు , వారి సాధారణ ఆరోగ్యం.. కిడ్నీ క్యాన్సర్ చికిత్స లో ప్రధాన పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. అందుకే ఈ వ్యాధిని ముందుగానే గుర్తించడం అవసరం. కిడ్నీ క్యాన్సర్ తీవ్రతను బట్టి శస్త్ర చికిత్స నుంచి కెమోథెరపీ వరకు అనేక రకాలు ఉంటాయి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Big Stories

×