BigTV English

HYDRA: హైడ్రా యాక్షన్.. భవనాలు, షెడ్ల కూల్చివేత.. సింగిల్ డేలో ఇన్ని ఎకరాలు స్వాధీనం చేసుకుందా?

HYDRA: హైడ్రా యాక్షన్.. భవనాలు, షెడ్ల కూల్చివేత.. సింగిల్ డేలో ఇన్ని ఎకరాలు స్వాధీనం చేసుకుందా?

Demolitions: హైడ్రా.. జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నది. అక్రమార్కుల భరతం పడుతున్నది. చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను శరవేగంగా కూల్చివేస్తూ వెళ్లుతున్నది. హైదరాబాద్ ట్రైసిటీలోని పలు చెరువుల సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను, షెడ్లను, లే ఔట్లను హైడ్రా ఆదివారం తొలగించింది. హైడ్రా విభాగం అధికారులు, స్థానిక రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, పోలీసుల ఆధ్వర్యంలో ఈ తొలగింపులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే అక్రమ కట్టడాలు, లే ఔట్లను తొలగించి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ కీలక వివరాలు పంచుకున్నారు.


అదే విధంగా ఆయన పౌరులకు కీలక సూచనలు చేశారు. నగరవాసులు తమ సొంతింటి కలను సాకారం చేసుకునే క్రమంలో జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. అపార్ట్‌మెంట్లు, వ్యక్తిగత ఇళ్లు, స్థలాలు కొనుగోలు చేసేటప్పుడు.. అవి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ పరిధిలో ఉన్నాయా? లేవా? అనేది కచ్చితంగా నిర్దారించుకోవాలని, అవి ఏ చెరువుకు చెందిన ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో లేనట్టయితేనే కొనుగోలు చేయాలని సూచించారు.


మాధాపూర్‌లోని సున్నం చెరువుకు సంబంధించిన ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ భూములను అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మిస్తున్న నాలుగు అంతస్తుల, రెండు అంతస్తుల భవనాలను కూల్చివేశారు. 30కి పైగా షెడ్లను తొలగించి సుమారు పది ఎకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, దుండిగల్ కొత్వాల్ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మిస్తున్న పదకొడు డూప్లెక్స్ భవనాలను తొలగించిన అధికారులు రెండు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు.

ఇదే సందర్భంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కొన్ని అంశాలపై స్పష్టత ఇచ్చారు. ప్రజలు నివాసముంటున్న కట్టడాలను తాము తొలగించబోమని, ఆ నివాసాలు చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ పరిధిలో ఉన్నప్పటికీ వాటిని కూల్చివేయబోమని స్పష్టం చేశారు. నివాసముంటున్న ఇళ్లను ఎట్టిపరిస్థితుల్లో కూల్చివేయబోమని హైదరాబాద్ ప్రజలకు తెలియజేస్తున్నామని, గందరగోళ పడొద్దని, భయాందోళనలు అక్కర్లేదని తెలిపారు. కొత్తగా చేపట్టే నిర్మాణాలను అడ్డుకుంటామని, ఇప్పటికే శాశ్వత నివాసాలుగా ఉన్న వాటికి సంబంధించి ప్రభుత్వం తెచ్చే పాలసీ ఆధారంగా నడుచుకుంటామని వివరించారు. ఈ రోజు మాధాపూర్ సున్నం చెరువు, దుండిగల్‌లోని మల్లంపేట్ చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో అనుమతులు లేని.. నిర్మాణంలో ఉన్న కట్టడాలను తొలగించామని వివరించారు. ఇక అమీన్‌పూర్‌లో అక్రమంగా నిర్మించిన కాంపౌండ్ వాల్స్, గదులు, షెడ్లు ఉన్నాయని, వాటిని తొలగించామని తెలిపారు. ఇవి ఏపీకి చెందిన పన్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డికి చెందినవని పేర్కొన్నారు. సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన కొన్ని షెడ్లు, హోటల్‌లు వ్యాపారానికి ఉపయోగిస్తున్నారని, వాటిని కూల్చేశామని చెప్పారు.

అదే విధంగా, అమీన్ పూర్ పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని 51 ఎకరాల్లోని ఎలాంటి అనుమతులు లేకుండా చేపడుతున్న నిర్మాణాలను తొలగించారు. రోడ్లను సైతం ఆక్రమిస్తూ పద్మావతి నగర్‌లో ఏర్పాటు చేసిన అక్రమ లే అవుట్‌కు చెందిన ప్రహరీ గోడ, రెండు సెక్యూరిటీ గదులను తొలగించినట్టు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు.

Also Read: RTC Bus: తీవ్ర విషాదం.. వాగు-రోడ్డు మధ్య వేలాడుతున్న ఆర్టీసీ బస్సు.. ఆర్తనాదాలు చేస్తున్న ప్రయాణికులు

మల్లంపేట చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన ఏడు విల్లాలను(అందులో ఎవరూ నివాసంలో లేరు) తొలగించామని, వీటికి నిర్మాణ అనుమతులు లేవని కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. వీటిని విజయలక్ష్మీ అనే బిల్డర్ నిర్మించారని, ఆమెపై అనేక నేరపూరిత కేసులు ఉన్నాయని, స్థానికంగా ఆమెను లేడీ డాన్ అని పిలుస్తారని, స్థానిక నాయకులతోనూ ఆమెకు సంబంధాలు ఉన్నాయని వివరించారు.

Related News

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Hyderabad Cloudburst: డేంజర్.. హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్.. ఆకస్మిక వరద ముప్పు.. జాగ్రత్త!

Hyderabad Rain Alert: నగర ప్రజలు అలర్ట్.. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు

KTR on Police: మా సబితమ్మ మీదే మాటలా.. పోలీసులకు కేటీఆర్ మాస్ వార్నింగ్

Big Stories

×