E-Paper
Advertisement

శివాజీ బిగ్ బాస్ హౌస్ లో ఆ పని చేసి ఉంటే విన్నర్ అయ్యేవారు: కౌశల్ మండా

శివాజీ బిగ్ బాస్ హౌస్ లో ఆ పని చేసి ఉంటే విన్నర్ అయ్యేవారు: కౌశల్ మండా
Advertisement

Kaushal On Shivaji: కౌశల్ మండా పరిచయం అవసరం లేని పేరు. బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ (Bigg Boss 2 winner) గా నిలిచిన ఈయన ప్రస్తుతం సినిమాలో పరంగా అలాగే పలు వ్యాపారాలను నిర్వహిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే కౌశల్ మండా (Kaushal Manda)ఇటీవల బిగ్ బాస్ సీజన్ 10(Bigg Boss 10) కార్యక్రమం గురించి నిత్యం సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను తెలియజేస్తూ కంటెస్టెంట్ల వ్యవహార శైలి గురించి కూడా తన అభిప్రాయాలను తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న నటుడు శివాజీ (Shivaji)గురించి కౌశల్ మండా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

శివాజీ గారు చాలా డిఫరెంట్ పర్సనాలిటీ..

తాజాగా ఈయన ఇంస్టాగ్రామ్ వేదికగా బిగ్ బాస్ బజ్ కార్యక్రమంలో శాలిని పాల్గొన్నటువంటి ఒక చిన్న క్లిప్ షేర్ చేశారు ఇందులో శివాజీ ఆమెపై చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కనిపించారు. ఈ వీడియో గురించి కౌశల్ మాట్లాడుతూ.. నిజంగానే శివాజీ గారు బజ్ కార్యక్రమంలో చూపించిన నవరసాలు బిగ్ బాస్ హౌస్ లో కనుక చూపించి ఉంటే కచ్చితంగా విన్నర్ అయ్యేవారని తెలిపారు. నాకు తెలిసిన శివాజీ గారు ఇది కాదు.. ఎందుకంటే నేను ఆయనతో కలిసి చాలా సినిమాలు చేశాను. ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ ఎక్స్పీరియన్స్, సినిమా ఎక్స్పీరియన్స్ ,నాలెడ్జ్ చూస్తే ఈయన చాలా డిఫరెంట్ అని అనిపిస్తుంది.

కప్పు గెలవాలనుకుంటే చిటికెలోనే సాధ్యం..

Advertisement

నిజంగానే శివాజీ గారు బిగ్ బాస్ కప్పు గెలవాలి అనుకుంటే చిటికెలో జరిగే పని. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత ఆయనలో వేరే కోణం చూసాము. నిజంగానే బిగ్ బాస్ కప్ నీట్ గా శుభ్రం చేసి ఎవరు ఊహించని విధంగా పల్లవి ప్రశాంత్ చేతిలో పెట్టారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత హీరోలు కాస్త జీరోలు అవుతారు జీరోలు కాస్త హీరోలు అవుతారు అక్కడికి వెళ్లిన తర్వాత మనం ఎలా ఉన్నామో మనకి తెలియదని కౌశల్ తెలిపారు. ఒకసారి హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఏదైనా జరగొచ్చు అందుకు ఉదాహరణ శివాజీ గారు. నేను బయట చూసిన శివాజీ గారు వేరు హౌస్ లో చూసిన శివాజీ గారు వేరు. ఇప్పుడు బిగ్ బాస్ బజ్ లో ఉన్న శివాజీ గారు అసలైన శివాజీ అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

?cplk=czBrazlsZHoyd212

Advertisement

శివాజీ గురించి కౌశల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 10 కార్యక్రమంలో విన్నర్ ఎవరవుతారనే విషయంపై కూడా పలు సందర్భాలలో కౌశల్ స్పందించిన సంగతి తెలిసిందే. అయితే ఎక్కువగా రోహిత్ త్రిగుణ్ మధ్య పోటాపోటీ కొనసాగుతుంది మరి వీరిద్దరిలో బిగ్ బాస్ 10 టైటిల్ ఎవరు సొంతం చేసుకుంటారనేది తెలియాల్సి ఉంది.

Also Read: విడాకుల బాటలో టాలీవుడ్ స్టార్ డాటర్… ఫోటోలతో క్లారిటీ ఇచ్చారా?

Related News

బాయిలోనే బల్లిపలికే పాటతో సెన్సేషన్.. నాగవ్వ ఒక్కో పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

బిగ్ బాస్ 10పై ‘స్నో అక్క ‘ ఊహించని కామెంట్స్.. ఇంట్రెస్ట్ కాస్త భయంగా మారిందంటూ!

ఘనంగా జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ కూతురి అన్నప్రాసన వేడుక..ఫోటోలు వైరల్!

బిగ్ బాస్ హౌస్ లో సడన్ ఎలిమినేషన్.. కానీ ఈ ట్విస్ట్ ఏంటి గురూ!

ముద్దమందారం పేరుతో బిజినెస్ మొదలుపెట్టిన హరిత జాకీ.. నెలవారీ ఆదాయం ఏంటంటే?

Intinti Ramayanam Shriya : పాప చాలా హాటు గురు..ఇది అస్సలు ఊహించలేదు భయ్యా..

శోభశెట్టి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Big Stories

Advertisement
×