Sora Chepa Pittu: చేపలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలుసు. కానీ గొంతులో ముళ్ళు ఇరుక్కుంటుదన్న భయంతో చాలా మంది పిల్లలు, పెద్దలు చేపలు తినడానికి వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారందరికీ ‘సొర చేప’ ఒక చక్కటి వంటకం. ఈ చేపలో చిన్న ముళ్ళు అనేవే ఉండవు, కేవలం మధ్యలో ఒక మెత్తని వెన్నెముక లాంటి భాగం మాత్రమే ఉంటుంది. అందుకే దీన్ని చిన్న పిల్లలకు కూడా ఈజీగా తినిపించొచ్చు. ఇంతకీ ఈ రెసిపీ ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా..
సొర చేప : అర కేజీ
ఉల్లిపాయలు: 3 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి: 4 (చీల్చినవి)
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1.5 టేబుల్ స్పూన్లు
కారం మరియు పసుపు: రుచికి సరిపడా
ధనియాల పొడి & గరం మసాలా: 1 టీస్పూన్ చొప్పున
ఉప్పు: తగినంత
నూనె: 3 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర తరుగు: గుప్పెడు
1.ముందుగా సొర చేపను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో నీళ్లు పోసి, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. చేప బాగా ఉడికిన తర్వాత, దాన్ని బయటకు తీసి చల్లారబెట్టాలి. తర్వాత చేప చల్లారిన తర్వాత దాని చర్మం, మధ్యలో ఉన్న ముళ్ళ భాగాన్ని పూర్తిగా తొలగించాలి. కేవలం తెల్లటి చేప గుజ్జును మాత్రమే చేతితో లేదా స్పూన్‌తో పొడి పొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేడి చేయాలి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చి,కరివేపాకు వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ రాగానే అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి.
2. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న సొర చేప పొడిని ఆ మసాలా మిశ్రమంలో వేయాలి. తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి , గరం మసాలా వేసి బాగా కలపాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో.. ఉంచి నీరంతా ఇనికిపోయే వరకు సుమారు 5 నుంచి 8 నిమిషాల పాటు బాగా వేయించాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేస్తే గుమగుమలాడే అచ్చమైన ‘సొర చేప పిట్టు’రెడీ.
Also Read: వేడి వేడి పన్నీర్ పకోడి..ఇంట్లోనే ఇలా చేయండి,టేస్ట్ అద్దిరిపోతుంది!
వేడి వేడి అన్నం, రసం: పొగలు కారే అన్నంలో ఈ సొర చేప పిట్టును నంజుకుని తింటే ఆ మజానే వేరు. పక్కన టమాటో రసం లేదా చారు ఉంటే.. అమృతంలా ఉంటుంది.
చపాతీ, జొన్న రొట్టె: రాత్రి పూట చపాతీలు లేదా జొన్న రొట్టెలతో.. ఈ పిట్టును సైడ్ డిష్‌గా తింటే రుచి నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది.
ఎలాంటి ముళ్ళ టెన్షన్ లేకుండా..ఎంతో రుచికరంగా,తక్కువ సమయంలో.. ప్రిపేర్ చేసుకునే ఈ ‘సొర చేప పిట్టు’ ప్రతి ఒక్కరూ ట్రై చేయదగ్గ అద్భుతమైన రెసిపీ. ఈ ట్రెండింగ్ వంటకాన్ని ఈ రోజే మీ ఇంట్లో తయారు చేసి మీ కుటుంబ సభ్యులతో కలిసి టేస్ట్ చేయండి!