E-Paper
Advertisement

మరోసారి రంగస్థలం మ్యాజిక్ రిపీట్ అవుతుందా? చరణ్ – సుకుమార్ మూవీ స్టార్ట్!

మరోసారి రంగస్థలం మ్యాజిక్ రిపీట్ అవుతుందా? చరణ్ – సుకుమార్ మూవీ స్టార్ట్!
Advertisement

Ram Charan RC17:ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో మరో భారీ సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కింది.ఇప్పటికే ఈ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉండగా, తాజాగా హైదరాబాద్‌లో జరిగిన పూజా కార్యక్రమాలతో మూవీ టీమ్ సినిమా ని ఘనంగా మొదలెట్టింది.ఇక ఈ ప్రారంభోత్సవం మెగాస్టార్ చిరంజీవి క్లాప్ తో మొదలవడం విశేషం.

ఇక మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, టీ-సిరీస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని తొలి షాట్‌కు క్లాప్ కొట్టగా,. నిర్మాత దిల్ రాజుతో కలిసి సినిమా స్క్రిప్ట్‌ను మూవీ టీమ్ కి అందించారు. మరోవైపు టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేయగ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.

Advertisement

నిజానికి రామ్ చరణ్, సుకుమార్ కాంబో అనగానే ముందుగా గుర్తొచ్చేది ‘రంగస్థలం సినిమానే . 2018లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.అంతేకాకుండా చరణ్ క్రేజ్ మరింత పెంచేసింది. చిట్టిబాబు పాత్రలో చరణ్ ఇచ్చిన ఫెర్ఫామెన్స్ కి ఫిదా అయిపోయారు మెగా ఫ్యాన్స్.దీంతో వీరి కాంబోలో సినిమా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూశారంతా.
ఇప్పుడు దాదాపు మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తామంటూ ఈ క్రేజీ కాంబో రెడీ అయిపొయింది.

అయితే ఈసారి కథ ఎలా ఉండబోతోంది? రామ్ చరణ్ పాత్రలో ఎలాంటి ప్రత్యేకతలు ఉండబోతున్నాయి? సుకుమార్ ఎలాంటి ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

Advertisement

ఇక ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్ కూడా ప్రేక్షకుల్లో సరికొత్త డిబేట్ కి తెరతీసింది.నీలం, ఆకుపచ్చ, బంగారు రంగులతో రూపొందించిన నెమలి ఈక పోస్టర్‌లో మెయిన్ ఎసెట్ గా నిలిచింది. ఆ ఈకలో రామ్ చరణ్ ముఖాన్ని క్రియేటివ్ గా బ్లెండ్ చేయడం చూస్తుంటే సుక్కు ఈ సారి కూడా ఎదో గట్టిగానే ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది.పోస్టర్‌తో పాటు విడుదల చేసిన ‘యు కెన్ ఇమాజిన్’ అనే క్యాప్షన్ కూడా అభిమానుల్లో ఆసక్తిని పెంచేస్తుంది. అయితే కథకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం అనౌన్స్ చేయలేదు చిత్ర యూనిట్.

ఇక ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, విజయ ప్రసాద్ బండ్రెడ్డి, భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. మైత్రీ మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ తో పాటు టీ-సిరీస్ కూడా భాగం అవ్వడం చూస్తుంటే సినిమా నేషనల్ వైడ్ గా మంచి మార్కెట్ సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది.చూడాలి మరి పెద్దితో డివైడ్ టాక్ మూటగట్టుకున్న చరణ్ ఈ సారి ఎలాంటి ఫలితాన్ని రాబడతాడో !

ALSO READ :గాజులు గలగల దివ్య రీల్ చూసి ఊరుకోలేకపోయా.. అసలు విషయం చెప్పిన కళ్యాణి అమ్మ!

Tags

Related News

స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్న రన్యారావుకి రాజ మర్యాదలు..అసలేం జరుగుతోంది?

మైసా ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్.. విశ్వరూపం చూపించిన రష్మిక!

పుట్టబోయే బిడ్డ కోసం సమంత భర్త రాజ్ కష్టాలు… క్యూట్ ఫోటో షేర్ చేసిన సామ్!

రాప్తాడు ఘటనపై మంచు మనోజ్ ఎమోషనల్..పోస్ట్ వైరల్!

సమంతకు కవల పిల్లలా? హింట్ ఇచ్చిన స్టార్ హీరోయిన్!

చిరు చేతుల మీదుగా ఆర్‌సీ17 గ్రాండ్ ప్రారంభం.. సుకుమార్ భార్య ఎమోషనల్ పోస్ట్!

ఆకట్టుకుంటున్న సూర్య ‘ సీన్’ తెలుగు ట్రైలర్..ఎలా ఉందంటే?

Big Stories

Advertisement
×