E-Paper
Advertisement

వేడి వేడి పన్నీర్ పకోడి..ఇంట్లోనే ఇలా చేయండి,టేస్ట్ అద్దిరిపోతుంది!

వేడి వేడి పన్నీర్ పకోడి..ఇంట్లోనే ఇలా చేయండి,టేస్ట్ అద్దిరిపోతుంది!
Advertisement

Paneer Pakoda Recipe: ప్రస్తుత వర్షాకాలం లేదా చలికాలం చల్లటి వాతావరణంలో.. వేడి వేడి టీతో పాటు వేయించిన స్నాక్స్ తినడం అందరికీ ఇష్టం. సాధారణంగా ఉల్లి పాయ పకోడీ, మిర్చి బజ్జీలు తిని బోర్ కొట్టిందా? అయితే.. ఈసారి ట్రెండింగ్‌లో ఉన్న ‘పన్నీర్ పకోడి’ని ట్రై చేయండి. పిల్లల నుంచి.. పెద్దల వరకు అందరూ దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు.ఈ ఈజీ అండ్ క్విక్ స్నాక్స్ రెసిపీలకు ప్రస్తుతం విపరీతమైన క్రేజ్ ఉంది. పన్నీర్‌లోని పోషకాలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి ఈ రుచికరమైన పకోడీని ఎలా తయారు చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు :

పన్నీర్ : 200 గ్రాములు

Advertisement

శనగపిండి : 1 కప్పు

బియ్యం పిండి లేదా కార్న్‌ఫ్లోర్: 2 టేబుల్ స్పూన్లు (క్రిస్పీగా రావడానికి)

Advertisement

అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్

కారం: 1 టీస్పూన్ (రుచికి సరిపడా)

పసుపు, గరం మసాలా: చిటికెడు

వాము : అర టీస్పూన్

ఉప్పు: రుచికి సరిపడా

నిమ్మరసం: కొద్దిగా

నూనె: వేయించడానికి సరిపడా

తయారీ విధానం:

1. ముందుగా పన్నీర్‌ను చిన్న చిన్న చతురస్రాకారపు ముక్కలుగా లేదా మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసి ఒక గిన్నెలో తీసుకోవాలి. ఆ పన్నీర్ ముక్కల్లో కొద్దిగా కారం, అల్లం-వెల్లుల్లి పేస్ట్, చిటికెడు ఉప్పు, నిమ్మరసం వేసి మెత్తగా కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాలి. దీని వల్ల మసాలాలు పన్నీర్‌కి బాగా పడతాయి. ఒక పెద్ద గిన్నెలో శనగపిండి, బియ్యం పిండి, వాము, పసుపు, గరం మసాలా, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ బజ్జీల పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి.

Also Read: బియ్యంతో..రెడీ చేసే ఈ పాయసం రుచి అద్భుతంగా ఉంటుంది

2. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత, మసాలా పట్టించిన పన్నీర్ ముక్కలను శనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో .. ఉంచి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. పన్నీర్ వేయించేటప్పుడు పిండిలో చిటికెడు వేడి నూనె కలిపితే పకోడీలు మరింత కరకరలాడతాయి. పిండిలో కొద్దిగా వాము వేయడం వల్ల రుచితో .. పాటు జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. తయారైన పన్నీర్ పకోడీలను టమాటో సాప్ లేదా గ్రీన్ చట్నీతో వేడివేడిగా సర్వ్ చేస్తే .. టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటుంది.

ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా..అతి తక్కువ టైంలో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే ఈ ‘పన్నీర్ పకోడి’ ప్రతి ఒక్కరూ ఇష్ట పడే అద్భుతమైన స్నాక్. ఈ రెసిపీని ఈరోజే మీ ఇంట్లో ట్రై చేసి మీ కుటుంబ సభ్యులతో కలిసి టేస్ట్ చేయండి.

Related News

బేకరీ కేక్‌లను మరిపించేలా.. ఇంట్లోనే సూపర్ సాఫ్ట్‌గా చాక్లెట్ మగ్ కేక్ తయారీ!

ఆరోగ్యానికి ఆరోగ్యం,రుచికి రుచి..పర్ఫెక్ట్ సొర పిట్టు రెసిపీ!

కోపంలో నోరుజారి మీ పార్ట్‌నర్‌తో ఈ 4 మాటలు అన్నారో.. మీ ప్రేమ కథ అక్కడితో క్లోజ్!

డిప్రెషన్, ఆందోళనకు దూరంగా ఉండాలా? బామ్మల కాలం నాటి ఈ 6 హాబీలు మళ్లీ పాటించండి

సెలబ్రిటీలు చెప్పే 3 లీటర్ల నీళ్ల సూత్రం నిజంగా పనిచేస్తుందా? మీరు కూడా ఇలాగే చేస్తున్నారా?

పిల్లల్లోనూ గుండె జబ్బుల ముప్పు.. 10 ఏళ్ల వయసులోనే కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించాలి

దీపావళికి స్వీట్స్ తింటూనే ఆరోగ్యం కాపాడుకోవాలా? ఈ 5 హెల్తీ లడ్డూలు ట్రై చేయండి!

Big Stories

Advertisement
×