Anchor Suma: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యాంకర్ అంటే టక్కున అందరికీ సుమ కనకాల (Suma Kanakala)గుర్తుకు వస్తారు. గత పాతిక సంవత్సరాలుగా ఇండస్ట్రీలో యాంకర్ గా దూసుకుపోతూ మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఒకానొక సమయంలో ఏ టీవీ ఛానల్ పెట్టిన అందులో సుమ యాంకర్ గా నిర్వహించే కార్యక్రమాలు మాత్రమే కనిపించేవి కానీ ఇటీవల కాలంలో ఈమె బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనప్పటికీ సినిమా ఈవెంట్లతో బిజీ అయ్యారు.
ఇలా ఒక సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభించినప్పటి నుంచి సక్సెస్ మీట్ వరకు సుమ దగ్గరుండి ఆ సినిమా వేడుకలను పూర్తి చేస్తుంటారు. ఇటీవల ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన ఇండస్ట్రీ జర్నీ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంటర్వ్యూ సందర్భంగా సుమకు కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి కెరియర్ మొదట్లో పలు సినిమాలు సీరియల్స్ లో నటించిన ఈమె హీరోయిన్ గా ఎందుకు సినిమాలు చేయలేదు అనే ప్రశ్న ఎదురయింది.
ఈ ప్రశ్నకు సుమ సమాధానం చెబుతూ తాను హీరోయిన్ గా సినిమాలు చేసి ఉంటే కచ్చితంగా ఈపాటికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఏదో ఒక సినిమాలలో నటిస్తూ ఉండేదాన్ని కానీ తాను మాత్రం హీరోయిన్ గా కాకుండా బుల్లితెరను ఎంపిక చేసుకున్నానని అలా ఆరోజు నేను తీసుకున్న ఈ నిర్ణయం ఇండస్ట్రీలో 25 సంవత్సరాలుగా యాంకర్ గా కొనసాగుతూ నేడు ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. యాంకరింగ్ వైపు రావడం వల్ల నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ఈ కోణం నుంచి చూస్తే నా నిర్ణయం సరైనదేనని సుమా కనకాల ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా హీరోయిన్ గా వెళ్లాలా, బుల్లితెరవైపు వెళ్ళాల అనే సమయంలో తాను సరైన నిర్ణయం తీసుకున్నానని సుమా తెలిపారు.
ఈ పాతికేళ్ల ప్రయాణంలో విజయం అంత సులభంగా రాలేదని తన కెరియర్ పరంగా ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని తెలిపారు. ఒకవైపు తన పిల్లలను ఇంటి బాధ్యతలను చూసుకుంటూనే మరోవైపు యాంకర్ గా ఎన్నో ఇబ్బందులు పడ్డానని తెలిపారు. పిల్లలకు ఆరోగ్యం బాగాలేక వారు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నేను యాంకర్ గా చేశానని ఈమె తెలిపారు. రాత్రంతా బాధపడిన ఉదయమే ఒక సరికొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్లేదాన్ని. అనారోగ్యం బాగా లేకపోయినా స్టేజ్ మీద నిలబడలేకపోయిన రోజులలో కూడా కమిట్ అయిన ప్రోగ్రామ్ విజయవంతంగా చేశానని, ఇదే నా వృత్తిపరమైన జీవితంలో విజయాన్ని తీసుకువచ్చిందని సుమా ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.