E-Paper
Advertisement

రోహిత్ ఎలిమినేషన్.. నాగార్జున పై బెదిరింపులకు దిగిన రోహిత్ ఫ్యాన్స్!

రోహిత్ ఎలిమినేషన్.. నాగార్జున పై బెదిరింపులకు దిగిన రోహిత్ ఫ్యాన్స్!
Advertisement

Rohit Fans On Nagarjuna: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కార్యక్రమం నేటితో ఎనిమిది వారాలను పూర్తి చేసుకోబోతోంది. ఇక ఎనిమిదవ వారంలో భాగంగా ఈ కార్యక్రమంలో డబుల్ ఎలిమినేషన్ ఉండబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శనివారం ఎపిసోడ్ ల భాగంగా రైతుబిడ్డ ఝాన్సీ(Jhansi) హౌస్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆదివారం ఎపిసోడ్ భాగంగా మరొక కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు రాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి ఇప్పటికే ఈ కార్యక్రమం నుంచి విడుదల చేసిన ప్రోమోలు చూస్తుంటే మాత్రం రోహిత్ నాయుడు(Rohit Naidu) ఎలిమినేట్ అవ్వబోతున్నారని తెలుస్తుంది.

అన్నపూర్ణ స్టూడియోని లేపేస్తాం..

కామన్ మాన్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన రోహిత్ ఈ కార్యక్రమం మొదటి రోజు నుంచి కూడా అద్భుతమైన ఆట తీరును కనబరుస్తూ ఓటింగ్ లో కూడా టాప్ లో దూసుకుపోతున్నారు. ఈ వారం నామినేషన్ లో ఉన్న రోహిత్ ఊహించని విధంగా ఎనిమిదవ వారం హౌస్ నుంచి బయటకు రాబోతున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి దీంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు రావడం అనేది అన్ ఫైర్ ఎలిమినేషన్ అని , ఒకవేళ నిజంగానే రోహిత్ బయటకు వస్తే బిగ్ బాస్ హౌస్, అన్నపూర్ణ స్టూడియోని లేపేస్తాం అంటూ నాగార్జునకు వార్నింగ్ ఇస్తున్నారు.

నాగార్జున పై రోహిత్ ఫ్యాన్స్ ఫైర్..

Advertisement

రోహిత్ ఎలిమినేట్ కాబోతున్నారంటూ వార్తలు రావడంతో ఇప్పటికే ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హంగామా చేస్తున్నారు. అయితే రోహిత్ ఎలిమినేషన్ విషయంలో బిగ్ బాస్ టీం పై నాగార్జున(Nagarjuna) ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఆయనకున్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని తిరిగి హౌస్ లో కొనసాగే విధంగా రిక్వెస్ట్ చేసినప్పటికీ రోహిత్ మాత్రం అందుకు ఒప్పుకోలేదని సమాచారం. మరి నిజంగానే రోహిత్ హౌస్ నుంచి బయటకు రాబోతున్నారా లేదంటే టీఆర్పీ స్టంట్ లో భాగంగా తనని సీక్రెట్ రూమ్ కి పంపించారా అనేది తెలియాల్సి ఉంది.

సీక్రెట్ రూమ్ లో రోహిత్?

బిగ్ బాస్ ఒక వేళ రోహిత్ ను సీక్రెట్ రూమ్ కి పంపించినట్లయితే బిగ్ బాస్ చరిత్రలోనే ఇలా రెండోసారి కంటెస్టెంట్ ను సీక్రెట్ రూమ్ లోకి పంపించడం జరుగుతుందని చెప్పాలి. మరి రోహిత్ విషయంలో బిగ్ బాస్ ఎలాంటి డెసిషన్ తీసుకున్నారనేది తెలియాల్సి ఉంది. ఇక రోహిత్ నిజంగానే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తే బిగ్ బాస్ వ్యూహం ఫలించినట్లేనని మరికొందరు భావిస్తున్నారు. మొదటినుంచి ఓటింగ్లో టాప్ లో ఉన్న రోహిత్ ను ఉద్దేశపూర్వకంగానే తప్పించి త్రిగుణ్ ను విజేతగా నిలబెట్టే దిశగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు రోహిత్ ఎలిమినేషన్ తో త్రిగుణ్ విన్నర్ అని మరి కొంతమంది రోహిత్ ఎలిమినేషన్ పై వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు.

Advertisement

Also Read: పుట్టబోయే బిడ్డ కోసం సమంత భర్త రాజ్ కష్టాలు… క్యూట్ ఫోటో షేర్ చేసిన సామ్!

Related News

బులెట్ బండి సెన్సేషన్ …మోహన భోగరాజు ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

ఆ ఒక్క నిర్ణయం నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది: యాంకర్ సుమ

ముఖేష్ స్లో పాయిజన్.. నిజాలు కక్కేసిన దేబ్జానీ!

రోహిత్ ఎలిమినేట్ అంటూ వార్తలు.. నెట్టింట రచ్చపై కౌశిక్ స్ట్రాంగ్ కౌంటర్!

మాది ఆరేళ్ల ప్రేమ.. బ్రేకప్ జరగడానికి కారణం అదే – బిగ్ బాస్ షాలిని!

ఆ ఐదుగురే టార్గెట్.. ఝాన్సీ వ్యాఖ్యలతో వారిలో మార్పు వస్తుందా?

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ టాక్ ఏది..?

Big Stories

Advertisement
×