BigTV English

Summer Health Tips : మండుతున్న ఎండలు.. వేడిని ఇలా నివారించండి!

Summer Health Tips : మండుతున్న ఎండలు.. వేడిని ఇలా నివారించండి!

Summer Health Tips


Summer Health Tips : ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సూర్యుని ప్రభావాన్ని తట్టుకోలేక చిన్నపిల్లలు, పెద్దలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. కాబడ్డి ఎండాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారపు అలావాట్లను పాటించాలి. మండే ఎండనుంచి రక్షించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..

ఎండలు మండుతున్న కారణంగా బయటకు తిరగకండి. అత్యవసరమయితేనే వెళ్లిండి. బయటకు వెళ్లాల్సి వస్తే పూర్తి ప్రిపరేషన్‌తో వెళ్లండి. నీటిని ఎక్కువగా తాగండి. సులభంగా జీర్ణం అయ్యే ఆహారాన్ని తీసుకోండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నావారు ఎండలో తిరగొద్దు. మీకు ఏమైనా పనులు ఉంటే ఉదయం 10 లోపు పూర్తి చేయండి.


READ MORE : పెయిన్ కిల్లర్స్ ఎలా పని చేస్తాయో తెలుసా?.. సైడ్ ఎఫెక్ట్స్ ఇవే!

వేసవిలో వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉంది. ఇది వచ్చే ముందు అధిక చెమట, తలనొప్పి, జ్వరం, వాంతులు, మూర్ఛ, శరీరం శక్తి కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. మీలో ఈ లక్షణాలు గనుక ఉంటే.. నీడగా ఉన్న ప్రదేశంలో కొంత సమయం రెస్ట్ తీసుకోండి. ద్రవరూపంలో ఉన్న ఆహారాన్ని తీసుకోండి. పండ్ల రసాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి తాగండి.

వేసవిలో ఊబకాయం, డయాబెటిస్ బాధితులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు బార్లీ నీళ్లను తీసుకోవాలి. దీనివల్ల రోజంతా యాక్టివ్‌‌గా ఉంటారు. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌ చేసే ముందుగా దోసకాయ, పుచ్చకాయ వంటివి తీసుకోండి. అరగంట గ్యాప్ తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోండి. మరో అరగంట గ్యాప్ తర్వాత నీరు తాగండి. ఈ పద్ధతని కచ్చితంగా ఫాలో అవండి.

వేసవిలో ఖాళీ కడుపుతో ఎప్పుడూ కూడా బయటకు వెళ్లొద్దు. ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాతనే ఇంటినుంచి బయటకు వెళ్లండి. ఒక వాటర్ బాటిల్‌ని మీ వెంట తీసుకెళ్లండి. బయట ఆహారాన్ని తీసుకోవద్దు. మసాలా, కారంగా ఉండే ఆహారాన్ని తినకండి. ఇంట్లో తయారు చేసిన పండ్ల రసాలను మాత్రమే తీసుకోండి.

మీరు ఎయిర్ కండిషనర్ వినియోగిస్తుంటే.. రూమ్ నుంచి నేరుగా ఎండలోకి వెళ్లవద్దు. ఎండ నుంచి కూడా డైరెక్ట్‌గా ఏసీ రూమ్‌లోకి రావద్దు. ఇంటి నుంచి బయటకు వెళ్లే మందు మీ శరీరానికి తగ్గట్టుగా నీరు తాగండి. కాటన్ దుస్తులు, సౌకర్యవంతమైన వదులుగా ఉండే దుస్తులను మాత్రమే ధరించండి.

READ MORE : డీహైడ్రేషన్‌కు గురైతే.. మన శరీరంలో కనిపించే లక్షణాలు!

ఎండలో బయటకు వెళ్లేప్పుడు టోపీ, గొడుకు, తెల్లని క్లాత్‌ వంటి వాటితో మీ తలను కప్పి ఉంచండి. నీరు మజ్జిగ, నిమ్మరసం వంటివి తరచూ తీసుకుంటూ ఉండండి. రోడ్డు పక్కన విక్రయించే కట్ చేసిన పండ్లు, పానియాలు, స్వీట్లను తినకండి. శరీరం అధిక వేడికి గురైనట్లే గుర్తిస్తే నీరు తాగండి. మీ ఆహారంలో తాజా కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూడండి.

Disclaimer : ఈ సమాచారాన్ని వైద్య నిపుణుల సలహా మేరకు పలు అధ్యయనాల ఆధారంగా మీ అవగాహన కోసం అందిస్తున్నాం. దీనిని కేవలం సమాచారంగా భావించండి.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×