BigTV English

Kid Locked Leopard in Room: చిరుతపులిని బంధించిన బుడ్డోడు.. వీడి ధైర్యానికి నెటిజన్లు ఫిదా

Kid Locked Leopard in Room: చిరుతపులిని బంధించిన బుడ్డోడు.. వీడి ధైర్యానికి నెటిజన్లు ఫిదా

Kid who trapped a leopard in the room, netizens are shocked by his intelligence.


Kid locked Leopard in Room: మనకు ఏదైనా అడవి జంతువు కనిపిస్తే ఏం చేస్తాం. వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుండి తుర్రుమని పారిపోతాం కదా. కానీ ఇక్కడ కనిపిస్తున్న ఈ పిల్లాడు మాత్రం అలా చేయలేదు. తాను ఇంట్లో సెల్‌ఫోన్‌లో గేమ్‌ ఆడుకుంటున్న సమయంలో అడవిలో నుండి వచ్చిన ఓ చిరుతపులి తమ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంకేముంది దాన్ని గమనించిన ఆ బుడ్డోడు సైలెంట్‌గా ఫోన్‌ని పక్కనపెట్టి ఇంటి బయటకు వెళ్లి డోర్‌ పెట్టేశాడు. ఈ వీడియోలన్ని ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతూ హల్‌చల్‌ చేస్తున్నాయి.

తాజాగా.. మహారాష్ట్ర మాలేగావ్‌లోని ఒక కల్యాణమండపం గదిలోకి చిరుతపులి వచ్చింది. అదే టైంలో గదిలో మొబైల్ ఫోన్‌లో మునిగిపోయాడు. సమయస్పూర్తితో వ్యవహరించిన బాలుడి తీరును ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతూ ఆ బాలుడిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక ఈ బాలుడి తండ్రి కల్యాణమండపానికి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.


Read More: భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో.. ప్రారంభించిన ప్రధాని మోదీ..

ఈ మధ్యకాలంలో అడవుల నుంచి పులులు, ఏనుగులు, పాములు, జింకలు, ఇలా రకరకాల అడవి జంతువులు జనావాసాల్లోకి వచ్చి బెంబేలెత్తిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం..విచ్చలవిడిగా అడవుల నరికివేతనే చెప్పాలి. అడవులను నరికివేతతో అడవుల్లో ఉండాల్సిన జంతువులన్ని రోడ్డపైకి, ఇండ్లలోకి చొరబడుతున్నాయి. దీంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు.

ఇక కనిపిస్తున్న బుడ్డోడు చిరుతపులి కనిపించగానే భయపడి అరవలేదు. పరుగెత్తడానికి ట్రై చేయలేదు. చాలా సమయస్పూర్తితో వ్యవహరించి బయటకు వెళ్లి తలుపును దగ్గరికి వేశాడు. గదిలోపలున్న సీసీ టీవీలో ఈ దృశ్యాలు రికార్డు అవడంతో అసలు మ్యాటర్ వెలుగులోకి వచ్చింది.

Read More: ఢిల్లీలో దారుణం.. భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త..

ఆ చిరుతను ఆ గదిలోనే బంధించడంతో స్థానికులు అక్కడికి భారీగా చేరుకున్నారు. స్థానికులు, పోలీసులు అక్కడికి చేరుకొని అటవిశాఖ అధికారులకు సమాచారం అందించగా.. అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి దానిని బంధించి దగ్గరలో ఉన్నటువంటి అడవిలో విడిచిపెట్టారు.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×