BigTV English

Kidney Cancer Symptoms: కిడ్నీ క్యాన్సర్ ఉన్నప్పుడు మీ శరీరంలో కనిపించే ప్రధాన లక్షణాలు ఇవే

Kidney Cancer Symptoms: కిడ్నీ క్యాన్సర్ ఉన్నప్పుడు మీ శరీరంలో కనిపించే ప్రధాన లక్షణాలు ఇవే

శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. ఇవి రక్తాన్ని ఫిల్టర్ చేసి శరీరంలోని వ్యర్ధాలను బయటికి పంపిస్తాయి. మూత్రపిండాలు శరీరంలోని విషాలను తొలగిస్తేనే మనం ఆరోగ్యంగా జీవించగలుగుతాము. కిడ్నీలకు ఏదైనా సమస్య వస్తే ఆ ప్రభావం శరీరం మొత్తం మీద పడుతుంది.


ఇప్పుడు మూత్రపిండాల క్యాన్సర్ అత్యధికంగా వ్యాపిస్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరు కిడ్నీ క్యాన్సర్ లక్షణాలను తెలుసుకోవాలి. దీనిని నిశ్శబ్ద కిల్లర్ గా పిలుస్తారు. ఎందుకంటే మూత్ర పిండాల క్యాన్సర్ వచ్చినా కూడా ఆ లక్షణాలపై ఎంతో మందికి అవగాహన లేదు. దీనివల్ల అది ముదిరిపోయేదాకా బయటికి తెలియడం లేదు.

మూత్రపిండాల క్యాన్సర్ లక్షణాలు
మూత్రంలో రక్తం కనిపించడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇది మూత్రపిండాల సంబంధిత సమస్యకు కారణం కావచ్చు. మూత్రంలో నిరంతరం రక్తం కనిపిస్తూ ఉంటే అది కిడ్నీ క్యాన్సర్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఈ సంకేతాన్ని ఎవరో తేలిగ్గా తీసుకోకండి. మీకు మూత్రంలో రక్తం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి.


పొత్తి కడుపు నొప్పి
పొత్తికడుపులో నొప్పి వచ్చి పోతూ ఉన్నా కూడా తేలిగ్గా తీసుకోవద్దు. ఇది కూడా కిడ్నీ క్యాన్సర్ సంకేతంగానే భావించాలి. ఈ లక్షణాన్ని ఎంతోమంది తేలిగ్గా తీసుకుంటారు. పొత్తికడుపు నొప్పి కొన్ని రోజులపాటు కొనసాగుతూ ఉన్నా లేదా ప్రతిరోజు వచ్చి పోతూ ఉంటే వెంటనే వైద్యుడు వద్దకు వెళ్లి తగిన పరీక్షలు చేసి దానికి కారణాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

పొట్టలో ముద్ద
పొట్ట దగ్గర చెయ్యి పెట్టి నొక్కి చూస్తూ ఉండండి. ఏదైనా మీకు చేతికి గట్టిగా ముద్దలాగా తగిలితే తేలికగా తీసుకోకండి. అది మూత్రపిండాల క్యాన్సర్ కావచ్చు. పొట్టలో ఏదైనా గట్టి పదార్థం ఉన్నట్టు అనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించి తగిన పరీక్షను చేయించుకోండి. అలాగే ఆకస్మాత్తుగా బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం కూడా కిడ్నీ క్యాన్సర్ కు సంకేతం కావచ్చు. మీరు ఎలాంటి వ్యాయామాలు, డైటింగ్ చేయకుండా బరువు త్వరగా తగ్గుతున్నారంటే మీకు ఏదో అనారోగ్య సమస్య ఉందని అర్థం. దానికి కారణం కిడ్నీ క్యాన్సర్ కూడా అయి ఉండొచ్చని అనుమానించాల్సిందే.

తీవ్రమైన అలసట కారణంగా కూడా శరీరం నీరసపడుతుంది. చాలామంది అలసిపోయామని విశ్రాంతి తీసుకుంటారు. అలా విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా అలసటగా అనిపిస్తున్నా, తగినంత నిద్ర పట్టకపోయినా కూడా కిడ్నీ క్యాన్సర్ కు ఉందేమోనని అనుమానించాలి. అలసట, తీవ్రమైన బలహీనత అనేవి కిడ్నీ క్యాన్సర్ లక్షణాలు గానే చెప్పుకుంటారు.

జ్వరం వచ్చి పోతున్నా…
ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదా వైరస్ ప్రభావాలు లేకుండా జ్వరం ప్రతిసారీ వచ్చిపోతూ ఉన్నా కూడా అది కిడ్నీ క్యాన్సర్ సంకేతంగా భావించాలి. జ్వరం పదే పదే వస్తుందంటే మీకు పెద్ద వ్యాధి ఏదో అంతర్లీనంగా ఉందని అర్థం చేసుకోవాలి. తరచుగా జ్వరం వస్తుంటే టాబ్లెట్లు వేసుకొని ఇంట్లోనే ఉండకండి. వైద్యుడు వద్దకు వెళ్లి తగిన పరీక్షలు చేయించుకోండి. ఇలా జ్వరం వచ్చిపోతూ ఉండడానికి కారణం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే పరిస్థితి ఓసారి చేయి దాటిపోవచ్చు.

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×