Aeroplane Accident:అహ్మదాబాద్ (Ahmadabad) లో జరిగిన ఘోర విమాన ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని కలిచివేసింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు మరణించగా.. బీజీ మెడికల్ కాలేజ్ పై ఈ విమానం కూలడంతో మెడికోలు 24 మంది మరణించారు. అలా దేశ చరిత్రలోనే ఇది అతి పెద్ద విమాన ప్రమాదంగా చెబుతున్నారు. అయితే ఇప్పటికే మన దేశంలో ఎన్నో విమాన ప్రమాదాలు జరిగాయి. కానీ వాటన్నింట్లో ఇదే పెద్దది. అయితే గతంలో కూడా అచ్చం ఇదే సీన్ ఓసారి రిపీట్ అయింది. అయితే అందులో ప్రయాణం చేసే వాళ్ళలో ఎక్కువమంది టాలీవుడ్ (Tollywood) సెలబ్రిటీలే. కోట్లాదిమంది ఆరాధిస్తున్న ఈ సెలబ్రిటీలు ఒకే విమానంలో ప్రయాణం చేస్తున్నారు. సడన్ గా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. కానీ ఆ సమయంలో విమానం కూలిపోయి అందులో ఉన్న వాళ్ళందరూ మరణిస్తారని అనుకున్నారు.అయితే పైలెట్ చాకచక్యంగా వ్యవహరించి, విమానాన్ని చాలా అద్భుతంగా ల్యాండింగ్ చేశారు. మరి ఇంతకీ ఆ విమాన ప్రమాదం నుండి బయట పడ్డ సెలబ్రిటీలు ఎవరు? ఆ విమాన ప్రమాదం ఎప్పుడు జరిగింది? టాలీవుడ్ సెలబ్రిటీలే కాదు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పలు విమాన ప్రమాదాల నుండి తప్పించుకున్నారు. మరి వారెవరు? అనేది ఇప్పుడు చూద్దాం.
విమాన ప్రమాదం నుండి బయటపడ్డ 60 మంది టాలీవుడ్ సెలబ్రిటీస్..
సరిగ్గా 32 ఏళ్ల క్రితం అనగా 1993 నవంబర్ 15న మద్రాస్ ఎయిర్ పోర్ట్ నుండి ఇండియన్ ఎయిర్ లైన్స్ 440 ఎయిర్ బస్ లో దాదాపు 272 మంది ప్రయాణికులు ఉన్నారు.ఇందులో దాదాపు 60 మంది టాలీవుడ్ కి చెందిన సెలబ్రిటీలే ఉన్నారు. వారిలో అల్లు రామలింగయ్య
(Allu Ramalingaiah)దంపతులు, విజయశాంతి(VijayaShanti), చిరంజీవి (Chiranjeevi), సుస్మిత(Susmita), బాలకృష్ణ(Balakrishna), ఎస్వీ కృష్ణారెడ్డి(SV Krishna Reddy), కమెడియన్ సుధాకర్(Comedian sudhakar), ఉప్పలపాటి నారాయణరావు (Uppalapati Narayanarao) ,వెంకటేష్ (venkatesh), మాలాశ్రీ (Mala Sri), కోడి రామకృష్ణ(Kodi Ramakrishna), కాట్రగడ్డ ప్రసాద్ (Katragadda Prasad), బాపు(Bapu), , సూపర్ సుబ్బరాయన్ (Super Subbarayan), పరుచూరి వెంకటేశ్వరరావు(Paruchuri Venkateswara Rao), హరి అనుమోలు (Hari Anumolu), కేసి శేఖర్ బాబు (KC Sekharbabu), సుచిత్ర (Suchitra) , ఎండి సుందరం (MD Sundaram), నరసింహారావు(Narasimha Rao)వంటి టాలీవుడ్ కి చెందిన దాదాపు 60 మంది సెలబ్రిటీలు వారి కుటుంబాలతో ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. అయితే అందరూ టాలీవుడ్ సెలబ్రిటీలే కావడంతో చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉన్నారు.
అసలు ప్రమాదానికి కారణం..
కానీ అదే సమయంలో హైదరాబాదు(Hyderabad) లోని బేగంపేట్ రన్ వే మీద దట్టమైన పొగ మంచు ఉండటంతో ఫ్లైట్ ల్యాండింగ్ కష్టమైంది. దాంతో అందులో ఉన్న ప్రయాణికులకు తిరిగి మద్రాస్ వెళ్తున్నట్టు ఎయిర్ హోస్టెస్ చెప్పడంతో అందులో ఉన్న సెలబ్రిటీలందరూ భయాందోళనకు గురయ్యారు.ఆ తర్వాత ఫ్లైట్ మద్రాస్ కాదు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం చూస్తుందని అందులో ఉన్న ప్రయాణికులందరికీ భయం పట్టుకుంది.దాంతో అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నారు.కానీ అదే సమయంలో పైలట్ సమయస్ఫూర్తిగా వ్యవహరించి నెల్లూరు (Nellore) జిల్లా వెంకటగిరి సమీపంలోని బాలాజీ పల్లె లో ఉన్న పొలాల మధ్య ఈ విమానాన్ని ల్యాండ్ చేశారు. అలా పైలెట్ చాకచక్యంతో ఆరోజు దాదాపు టాలీవుడ్ కు చెందిన 60 మంది సెలబ్రిటీల కుటుంబాలు బతికి బయటపడ్డాయి. అయితే ఈ విమాన ప్రమాదం గురించి తాజాగా తలుచుకొని నాగబాబు(Nagababu) ఎమోషనల్ అయ్యారు.
టాలీవుడ్ సెలబ్రిటీస్ మాత్రమే కాదు బాలీవుడ్ నటుడు కూడా..
అయితే టాలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ నటుడు సునీల్ దత్(Sunil Dutt) కూడా 2001లో జరిగిన విమాన ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. ఆరోజు ఆయన భుజానికి, కాలికి తీవ్ర గాయమైనా కూడా తన తోటి ప్రయాణికులను ఎంతోమందిని కాపాడి చివరికి ఆయన కూడా ప్రాణాలతో బయట పడ్డారు.