BigTV English

Toothbrush: టూత్ బ్రష్ ఎక్కువ రోజులు వాడుతున్నారా..? ఈ సమస్యలు కొని తెచ్చుకున్నట్లే..

Toothbrush: బట్టలైనా, బ్రష్‌లైనా కొన్ని రోజుల వరకే వాడాలి. అవి పూర్తిగా పాడయ్యే వరకు వాడితే అనారోగ్య సమస్యలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. నోటిని శుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్యం బావుంటుంది. అందులో రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం వల్ల దంతాల లైఫ్ టైమ్ పెరుగుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. అందులోనూ నోరు శుభ్రంగా ఉంటే అనారోగ్య సమస్యల ప్రమాదం తప్పుతుందని నిపుణులు చెబుతున్నారు

Toothbrush: టూత్ బ్రష్ ఎక్కువ రోజులు వాడుతున్నారా..? ఈ సమస్యలు కొని తెచ్చుకున్నట్లే..

Toothbrush: బట్టలైనా, బ్రష్‌లైనా కొన్ని రోజుల వరకే వాడాలి. అవి పూర్తిగా పాడయ్యే వరకు వాడితే అనారోగ్య సమస్యలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. నోటిని శుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్యం బావుంటుంది. అందులో రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం వల్ల దంతాల లైఫ్ టైమ్ పెరుగుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. అందులోనూ నోరు శుభ్రంగా ఉంటే అనారోగ్య సమస్యల ప్రమాదం తప్పుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఇంతకీ బ్రష్‌ను ఎన్నిరోజులకోసారి మార్చాలి. కొందరు రెగ్యూలర్‌గా టూత్ బ్రష్ మార్చుకుంటారు. మరికొందరు ఏమి పాడైందని మార్చాలి. బాగానే ఉంది కదా అని దానిని మార్చకుండా నిర్లక్ష్యం చేస్తారు. ఎక్కువ రోజులు ఒకే బ్రష్ వాడితే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం.


టూత్ బ్రష్‌లు రెండు రకాలు. ఒకటి చేత్తో పట్టుకుని దంతాలు తోమేవి. రెండోది ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌. కంఫర్ట్‌ని బట్టి ఎవరికి నచ్చిందానిని వారు వాడుతుంటారు. అయితే ఎలక్ట్రిక్ బ్రష్‌కు ఛార్జింగ్ అవసరం. ఇది పంటిపై చేసే ఒత్తిడిని మనం నియంత్రించలేం. దంతాలు దెబ్బతినే అవకాశం ఉంది. అదే మన చేతులతో తోమే బ్రష్ అయితే చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. చిగుళ్లపై ఒత్తిడి పూర్తిగా మన నియంత్రణలోనే ఉంటుంది.

మీరు ఏ రకమైన బ్రష్‌ను ఉపయోగించినా.. దానిని శుభ్రంగా ఉంచుకోవాలి. బ్రష్‌ను ఉపయోగించిన తరువాత దాన్ని బాగా శుభ్రం చేయాలి. ఆ తర్వాత బ్రష్‌ని నిటారుగా పెట్టాలి. ఇలా ఉంచడం వల్ల బ్రష్ త్వరగా ఆరుతుంది. బ్రష్‌లు క్లోజ్డ్ కంటైనర్‌లో పెడితే.. వాటిపై సూక్ష్మజీవులు చేరుతాయి. బ్రష్‌లు ఫ్యామిలీ మొత్తానివి ఒకే చోట స్టోర్ చేయకూడదు. అలా చేస్తే ఒకరి బ్రిష్టల్స్ మరొకరి బ్రష్‌కు తాకుతాయి. దీని వల్ల వ్యాధులు సోకే ప్రమాదం ఉంది.


టూత్ బ్రష్‌లను 3 నుంచి 4 నెలలకోసారి ఖచ్చితంగా మార్చాలని నిపుణులు చెబుతున్నారు. మీరు జ్వరం లేదా ఇతర అనారోగ్య సమస్యల నుంచి కోలుకున్న తర్వాత బ్రష్‌లను ఖచ్చితంగా మార్చాలని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఎందుకంటే జ్వరంతో ఉన్నప్పుడు పళ్లు శభ్రం చేసినప్పుడు బ్యాక్టీరియా బ్రష్‌కు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల అనారోగ్యం బారిన పడొచ్చు.

ఒకే టూత్ బ్రష్‌ను ఎక్కువకాలం ఉపయోగించడం వల్ల బ్రష్‌లో బాక్టీరియా పెరిగిపోతుంది. దీని వల్ల దంతక్షయం వస్తుంది. అందులోనూ ఒకే బ్రష్‌తో ఎక్కువ కాలం దంతాలను తోమడం వల్ల దంతాలు పూర్తిగా క్లీన్ కావు. ముఖ్యంగా మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారి బ్రష్‌లు తరచుగా మార్చాలి. ఎందుకంటే వారు బ్రష్‌ను కొరికేస్తారు. దీనివల్ల అవి త్వరగా పాడైపోతాయి.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×