ఒత్తిడి నిండిన జీవితం నుండి బయట పడేందుకు అప్పుడప్పుడు ప్రశాంతమైన పచ్చని ప్రాంతాలకు పర్యటనకు వెళ్లేవారు ఎంతోమంది. వర్షాకాలంలో మాత్రం ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉంటారు. దానికి వర్షాకాలంలో కూడా అందంగా మారే ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.
ఎర్రని ఎండలకు మలమల మాడిపోయిన జనాలు వర్షాకాలం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వర్షాకాలం తొలకరి జల్లులు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. ప్రకృతి ప్రేమికులకు ఈ సీజన్ ఎంతో నచ్చుతుంది. వర్షం వల్ల చెట్లు, మొక్కలు పచ్చగా ఎదుగుతాయి. ఆ పచ్చదనం, మేఘాలు కప్పిన ఆకాశము, చల్లని గాలి మనలో ఒక నూతన ఉత్సాహాన్ని నింపుతాయి. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక అందమైన ప్రదేశానికి ప్రయాణం చేస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది.
భారతదేశంలో కచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలోనే వాటిని చూడాలి. అందుకే వీటిని మాన్సూన్ ట్రావెల్ డెస్టినేషన్స్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. వర్షాకాలంలో వీటిని చేస్తే స్వర్గాన్ని తలపిస్తాయి. కాబట్టి ఈ వర్షాకాలంలో మీరు ఈ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు.
అలెప్పి
కేరళలోని అందమైన ప్రాంతం అలెప్పి. దీన్ని వెనిస్ ఆఫ్ కేరళ అని కూడా పిలుస్తారు. వర్షాకాలంలో ఎంతో అందంగా, మనోహరంగా మారిపోతుంది. జలపాతాలు, హౌస్ బోట్లు పచ్చదనం నిండిన ప్రాంతాలు మనసులో నూతనోత్సాహాన్ని నింపుతాయి. మీ పర్యటనను అందంగా మారుస్తాయి. కొబ్బరి చెట్లతో నిండిన గ్రామాలు నిండుగా ఉంటాయి. అక్కడ కొన్ని రోజులు ఉంటే చాలు. ఎంతో ప్రశాంతత దక్కుతుంది.
కూర్గ్
కర్ణాటకలో కచ్చితంగా చూడాల్సిన మరొక ప్రాంతం కూర్గ్. వర్షాకాలంలో అత్యద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఉండే కాఫీ తోటలు, అందమైన పర్వతాలు, జాలువారే జలపాతాలు మన కంటికి ఇంపుగా మారుతాయి. ఎన్ని పర్యాటక ప్రదేశాలను చూసినా మీరు కూర్గ్ చూడకుండా మాత్రం ప్రయాణాన్ని విరమించుకోకండి. ముఖ్యంగా వర్షాకాలంలో కూర్గ్ అందాలన్నీ రెట్టింపు అవుతాయి .
మున్నార్
కేరళలో కచ్చితంగా పర్యటించాల్సిన ప్రాంతం ఉన్నారు. ఇప్పటికీ ఎంతోమంది హనీమూన్ కోసం మున్నార్ ప్రాంతానికే వెళతారు. ఇక్కడ ఉన్న తేయాకు తోటలు, అందమైన పర్వతాలు, చల్లని గాలి మనసుకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక్కడ వర్షం పడిందంటే పచ్చదనం తొణికిసలాడుతుంది. పర్వతాలపై దిగిన మేఘాలు కంటికి ఆహ్లాదాన్ని అందిస్తాయి. వర్షాకాలంలో మున్నార్ ను చూశారంటే ఆ అనుభూతే వేరు.
చిరపుంజి
మేఘాలయలోని అత్యంత తేమగా ఉండే ప్రదేశం చిరపుంజి. ఇది ప్రపంచంలోనే అత్యంత తేమగా ఉండే ప్రాంతంగా పేరు పొందింది. ఇక వర్షాకాలంలో చిరపుంజి మరింత అద్భుతంగా ఉంటుంది. జలపాతాలు, గుహలు, లివింగ్ రూట్ బ్రిడ్జిలు కంటికి ఎంతో ఆనందనిస్తాయి. కాబట్టి వర్షాకాలంలో ఒకసారి చిరపుంజిని సందర్శించి చూడండి. మీకు కచ్చితంగా అది నచ్చితే తీరుతుంది.
షిల్లాంగ్
మేఘాలయ రాజధాని షిల్లాంగ్ ఇది వర్షాకాలంలో చూడదగ్గ ప్రాంతం. దీన్ని స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ జలపాతాలు, కొండలు… చూస్తున్న కొద్ది మరింత చూడాలనిపిస్తుంది. వర్షాకాలంలో మీరు షిల్లాంగ్ వెళ్లడానికి ప్లాన్ చేస్తే ఆ ప్రయాణం కచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. సహజ సౌందర్యంతో నిండి ఉన్న ప్రతి ప్రాంతం సహజ సౌందర్యంతో నిండిపోయి ఉంటుంది.