BigTV English

After 7 PM Things : ఈవినింగ్ 7 తర్వాత ఇవి చేయండి..!

After 7 PM Things : ఈవినింగ్ 7 తర్వాత ఇవి చేయండి..!

Relax Your Brian : మన శరీరాన్ని ఆరోగ్యంగా, ధృడంగా ఉంచుకోవడానికి ఎన్నో నియమాలు పెట్టుకుంటాం. వాటిలో క్రమంగా తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటివి ముఖ్యంగా ఉంటాయి. ఈ జాబితాలో ధుమపానం, మద్యపానికి దూరంగా ఉండటం చేర్చుకుంటే ఇంకా మంచిది. ఇటివల్ల మీరు శారీరంకంగానే కాదు.. మానసికంగా కూడా స్ట్రాంగ్‌గా ఉంటారు. అప్పుడే మీ ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కాపడుకోవచ్చు. అయితే 7 గంటల తర్వాత కొన్ని అలవాట్లు మీ జీవితాన్నే మార్చేస్తాయట. మీరు శరీరకంగాకి, మనసుకు రక్షణ కల్పిస్తాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


రోజంతా చాలా మంది మొబైల్ స్క్రీన్, ల్యాప్‌టాప్ తదితర వాటితో గడుపుతుంటారు.ఇలా స్క్రీన్‌తో గంటల పాటు గడపడం వల్ల కంటిపై ఒత్తిడి పడుతుంది. ఇది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం కూడా చూపుతుంది. రాత్రి 7 గంటలు తర్వాత ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండండి. పుస్తకాలు చదవండి. యోగా చేయండి. ఇంకా మీకు ఇష్టమైన పనులను చేయండి. ఇది మీ మెదడును, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

కళ్లు మూసికొని రోజంతా ఎలా గడిపారు. ఏం చేశారో అలా సరదాగా ఆలోచించండి. ప్రతి క్షణాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మీ తప్పులు కనిపిస్తాయి. ఫలితంగా మరుసటి రోజు ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడతారు.


రేపు ఏం చేయాలో రాత్రి 7 గంటలను ప్లాన్ చేసుకోండి. ఉదయం నుంచి రాత్రి వరకు ఏం చేయాలో ప్లాన్ చేసుకోండి. ఇందుకోసం ఓ జాబితా సిద్ధం చేయండి. ఇలా చేయడం వల్ల ఏం చేయాలో పరుగులు పెట్టాల్సిన అవసరం ఉండదు. హడావుడిగా పనులు చేయాల్సిన అవసరం ఉండదు.

రోజంతా పనుల్లో ఫుల్ బిజీగా ఉంటారు. దీని కారణంగా శరీరం ఒత్తిడిని గురవుతుంది. ఆందోళన చెందుతారు. పనులు ముగించుకొని ఇంటికి వచ్చాక.. గాఢంగా ఊపిరి పీల్చుకోండి. సాయంత్రం 7 తర్వాత ధ్యానం చేయండి. ధ్యానం అనేది మానసిక అలసటను తొలగిస్తుంది. దీనివల్ల నాడీవ్యవస్ధ ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానం చేయడం వల్ల మంచి ఆలోచనలు వస్తాయి.

మీతో మీరు గడిపేందుకు సమయాన్ని పెట్టుకోండి. సాయంత్రం 7 గంటలు ఇందుకు చాలా మంచి సమయం. ఈ సమయంలో మీ గురించి మీరు ఆలోచించండి. మీ శరీరం,అందం, ఆహారం, మీ కుటుంబం, రిలేషన్ తదితర వాటిపై ఫోకస్ చేయండి.

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×