Skin Care Tips: ప్రతి ఒక్కరూ మెరిసే చర్మాన్ని పొందడానికి, మచ్చలను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తారు. దీని కోసం రకరకాల హోం రెమెడీస్ వాడుతుంటారు. కానీ ఇవి నిజంగా మీ చర్మాన్ని ఆరోగ్యంగా , ప్రకాశవంతంగా మారుస్తాయా ? కొన్ని రకాల హోం రెమెడీస్ కూడా చర్మానికి హాని కలిగిస్తాయి. ఈ నివారణలు మీ చర్మాన్ని మెరుగుపరచడానికి బదులుగా చెడగొడతాయి. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే చాల మందికి దీని గురించి పూర్తి అవగాహన లేదు. ఇంతకీ ఏ పదార్థాలను ముఖంపై అప్లై చేయకూడదు అనే విషయాలను గురించిన పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. మొటిమల మీద వెల్లుల్లి రసం:
మొటిమలపై వెల్లుల్లి రసాన్ని అప్లై చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయని నమ్ముతారు. ఎందుకంటే వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు రెండూ ఉన్నాయి. కానీ నిజానికి ఇది సరైన పద్దతి కాదు. వెల్లుల్లిని నేరుగా మొటిమలపై చాలా మందే అప్లై చేస్తుంటారు. ఇలా వాడటం వల్ల సైడ్ ఎపెక్ట్స్ వాస్తుంటాయి. అంతే కాకుండా మచ్చలు కూడా ఏర్పడతాయి.
2. జుట్టుకు నిమ్మరసం:
జుట్టు రాలడం లేదా జుట్టు చివర్లు చిట్లడం అనేది ఒక సాధారణ సమస్య. చాలా మంది దీనిని నివారించడానికి నిమ్మరసం వాడుతుంటారు. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుందని నమ్ముతారు. కానీ ఈ ఆలోచన కూడా తప్పు. దీనిలో శరీర రోగనిరోధక శక్తి ప్రభావితమవుతుంది. అంతే కాకుండా జుట్టు వేగంగా రాలడం ప్రారంభమవుతుంది. చాలా సార్లు.. దీనివల్ల తలపై వివిధ ప్రదేశాలలో మచ్చలు ఏర్పడతాయి.
Also Read: గంధంతో ఫేషియల్.. నిగనిగలాడే చర్మం మీ సొంతం
3. బేకింగ్ సోడా:
సోషల్ మీడియా బేకింగ్ సోడాను కొత్త స్క్రబ్‌గా గుర్తించింది. దీనివల్ల చర్మం వెంటనే క్లియర్ అవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ ఈ ఆలోచన తప్పు. బేకింగ్ సోడా చర్మంపై అప్లై చేయడం వల్ల అనేక నష్టాలు ఉంటాయి. ముఖంపై మచ్చలను తగ్గించడం పోగా ఇది తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది.
4. నిమ్మరసం టోనర్:
నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి మంచిదే. కానీ మీరు దాని రసాన్ని చర్మంపై టోనర్‌గా అప్లై ,చేసుకుంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి. తరచుగా ముఖానికి నిమ్మరసం వాడటం వల్ల ఎర్రటి మచ్చలు వస్తాయి. ఇది చర్మాన్ని కూడా దెబ్బతీసింది. నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది.