Face Yoga: మారుతున్న జీవనశైలి, కలుషిత వాతావరణం కారణంగా.. మహిళలు తమ చర్మం , జుట్టుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా చాలా మంది మహిళలు మధ్య వయసులో లేదా అంతకు ముందు కూడా కళ్ల కింద నల్లటి వలయాల సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. మీ జీవనశైలి సరిగ్గా లేనప్పుడు, మీకు తగినంత నిద్ర లేనప్పుడు లేదా మీరు ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు ఈ సమస్య సాధారణంగా వస్తుంది.
డార్క్ సర్కిల్‌లను తగ్గించుకోవడానికి మీరు అనేక రకాల ఉత్పత్తులను వాడవచ్చు. వీటి వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం లేకుంటే, కాస్త ఫేస్ యోగాను ట్రై చేయండి. ఫేస్ యోగా చేయడం వల్ల మీ చర్మం బిగుతుగా ఉంటుంది. కళ్ల కింద నల్లటి వలయాలు తొలగిపోతాయి. మీరు ఇంట్లో, ఆఫీసులో లేదా ప్రయాణంలో ఎక్కడైనా చేయగలిగే కొన్ని సులభమైన ఫేస్ యోగా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఐ ట్యాపింగ్ యోగా:
ఈ వ్యాయామం కళ్ల ఉబ్బరాన్ని తొలగిస్తుంది. కళ్ల కింద నల్లటి వలయాలను కూడా తగ్గిస్తుంది. మీరు ఈ వ్యాయామం రోజుకు మూడు సార్లు చేయవచ్చు. మీరు ఆఫీసులో ఉన్నా లేదా ఇంట్లో ఉన్నా లేదా ప్రయాణాల్లో ఉన్నా, మీ కళ్ల కింద రెండు వేళ్లతో నొక్కాలి. అదేవిధంగా, మీరు రెండు కళ్లను మూసివేసి వాటిపై కూడా నొక్కాలి.
అండర్ ఐ బ్యాలెన్స్ యోగా:
అండర్ ఐ బ్యాలెన్స్ వ్యాయామం, కళ్ళు లోపలికి మునిగిపోయి, నల్లటి వలయాల సమస్య ఎక్కువగా ఉన్న వారికి సరిపోతుంది. ఈ వ్యాయామం చేయడం వల్ల కళ్ల కింద రక్త ప్రసరణ పెరిగి కండరాలు దృఢంగా ఉంటాయి. మీ చేతి చూపుడు, మధ్య వేళ్లతో కళ్ల కింద మసాజ్ చేయండి. రెండు కళ్ల కింద ఈ వ్యాయామం చేయండి. ఈ వ్యాయామం కనీసం 10 నిమిషాలు చేయండి.
ఐ లిఫ్ట్ యోగా:
ఈ ఫేస్ యోగా చేయడం వల్ల కళ్ల కింద కండరాలు దృఢంగా ఉండి చర్మం టోన్‌గా ఉంటుంది. అలాగే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఈ వ్యాయామం చేయడానికి, మొదట మీ చేతితో ప్రతి కన్ను కవర్ చేయండి. కళ్ళు పైకి చూస్తు.. ఆపై 30 సెకన్లపాటు వేచి ఉండండి. ఇలా 5 నుండి 10 సార్లు చేయండి.
Also Read: చిన్న వయస్సులోనే.. తెల్ల జుట్టు రావడానికి కారణాలేంటో తెలుసా ?
స్లాపింగ్ పియానో యోగా:
స్లాప్పింగ్ పియానో యోగా చేయడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గుతాయి. ఈ యోగా చేయడం వల్ల మొటిమల సమస్య కూడా తొలగిపోతుంది. దీన్ని చేయడానికి, మీ నాలుగు వేళ్లను పియానో లాగా ముఖం మీదుగా కదిలించండి. కళ్ల చుట్టూ కూడా ఈ వ్యాయామం చేయండి. మీరు దీన్ని రోజుకు ఐదు సార్లు చేయవచ్చు. ఈ సులభమైన వ్యాయామాలతో, మీ కళ్ల కింద నల్లటి వలయాలు గణనీయంగా తగ్గుతాయి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.