Thyroid Symptoms: ఈ రోజుల్లో జుట్టు రాలడం ఒక సాధారణ సమస్యగా మారింది. కానీ జుట్టు వేగంగా రాలడం, ప్రారంభమైనప్పుడు అది ఆందోళన కలిగించే విషయమే కావచ్చు. కొన్నిసార్లు ఇది వాతావరణం, ఒత్తిడి లేదా కెమికల్ షాంపూ ఫలితంగా మాత్రమే కాదు, థైరాయిడ్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యకు కూడా సంకేతం కావచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఇండియాలో దాదాపు 42 మిలియన్ల మంది థైరాయిడ్‌తో బాధపడుతుంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. థైరాయిడ్ సమస్యలు జుట్టు రాలడానికి ప్రధాన కారణం కావచ్చు. థైరాయిడ్‌కు జుట్టు రాలడానికి గల సంబంధం ఏంటో ఎలా నివారించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం ?
థైరాయిడ్ కు, జుట్టు రాలడానికి సంబంధం ఏమిటి ?
మెడ భాగంగా సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి శరీర జీవక్రియ, శక్తి స్థాయిలు, హార్మోన్ల సమతుల్యతను నియంత్రిస్తుంది. ఈ గ్రంథి సరిగ్గా పనిచేయనప్పుడు.. హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రెండు పరిస్థితులలోనూ.. వేగంగా జుట్టు రాలడం ఒక సాధారణ లక్షణం. హైపోథైరాయిడిజంలో.. జుట్టు బలహీనంగా మారుతుంది. అయితే హైపర్ థైరాయిడిజంలో.. అధిక జీవక్రియ కారణంగా వెంట్రుకల కుదుళ్లు బలహీనంగా మారుతాయి.
థైరాయిడ్ సమస్య :
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ‘థైరాయిడ్ హార్మోన్ అసమతుల్యత జుట్టు పెరుగుదలకు అంతరాయం కలిగిస్తుంది. దీనివల్ల జుట్టు రాలిపోతుంది. ప్రతిరోజూ 100 కంటే ఎక్కువ వెంట్రుకలు రాలిపోతుంటే.. అది థైరాయిడ్ లక్షణం కావచ్చు. అలాంటి పరిస్థితిలో ఖచ్చితంగా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి.
థైరాయిడ్ యొక్క ఇతర లక్షణాలు:
జుట్టు రాలడంతో పాటు.. థైరాయిడ్ యొక్క కొన్ని ఇతర లక్షణాలపై కూడా శ్రద్ధ చూపడం ముఖ్యం. హైపోథైరాయిడిజం వల్ల అలసట, బరువు పెరగడం, చర్మం పొడిబారడం, చలిని తట్టుకోలేకపోవడం , మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. అయితే.. హైపర్ థైరాయిడిజంలో.. బరువు తగ్గడం, చిరాకు, వేగవంతమైన హృదయ స్పందన రేటు, అధిక చెమట , నిద్ర లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా గర్భధారణ సమయంలో లేదా పీరియడ్స్ సమయంలో మహిళల్లో థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి.
కారణాలు ఏమిటి ?
థైరాయిడ్ సమస్యకు జన్యుపరమైన కారణాలు, ఒత్తిడి, సరైన ఆహారం లేకపోవడం, అయోడిన్ లోపం లేదా సోయా ఉత్పత్తులను అధికంగా తీసుకోవడం వంటి అనేక కారణాలు ఉండవచ్చు. గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పులు కూడా థైరాయిడ్‌ను ప్రేరేపిస్తాయి.