India vs Pakistan : వరుస మీటింగ్స్ జరుగుతున్నాయి. రోజూ అప్‌డేట్స్ వస్తున్నాయి. కానీ, యుద్ధం మాత్రం జరగట్లే. కనీసం సర్జికల్ స్ట్రైక్స్ కూడా జరగలే. ఇక పీవోకే స్వాధీనం, పాక్‌తో వార్.. చాలా దూరం మాట. దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ కూడా చేస్తోంది. ప్రధాని మోదీ దాదాపు ప్రతీరోజూ రివ్వ్యూలు చేస్తున్నారు. అసలు నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు? అసలు తీసుకుంటారా లేదా? పాక్‌పై ఇండియా అటాక్ చేస్తుందా? టెర్రరిస్ట్ క్యాంపులనైనా స్మాష్ చేస్తుందా? 140 కోట్ల భారతీయులు ఎదురు చూస్తున్న సందర్భం ఇది.
కంటికి కనిపించని యుద్ధం
రెండూ అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న దేశాలే కావడంతో యుద్ధం అంత తేలికైన నిర్ణయం కాదు. మనం పాకిస్తాన్ మీద 100 బాంబులు వేసినా.. పాక్ తిరిగి మన మీద ఒక్క బాంబు వేసినా.. మనకే ఎక్కువ డ్యామేజ్. ఆ దేశం ఆల్రెడీ నాశనమైంది. యుద్ధంతో మరింత అధ్వాన్నంగా మారుతుంది. అందులో నో డౌట్. ఇండియా పరిస్థితి అలా కాదు. దాయాదితో పోలిస్తే మనది సుసంపన్న దేశం. అందుకే, చిన్న బాంబే అయినా మనకు అది తీరని నష్టం చేస్తుంది. ఈ విషయం మనకంటే కేంద్ర పెద్దలకే బాగా తెలుసు. అందుకే, వార్ సైరన్ మోగించడానికి బాగా ఆలోచిస్తున్నట్టున్నారు. ఈలోగా పాకిస్తాన్‌ను వివిధ రూపాల్లో దెబ్బ కొడుతూ.. కంటికి కనిపించని యుద్ధం చేస్తోంది ఇండియా.
ఇజ్రాయెల్ లానే ఇండియా?
డైరెక్ట్‌గా పాకిస్తాన్‌తో కాకుండా, ఏ ఉగ్రవాద సంస్థతోనో వార్ అంటే చిటికెలో ఫినిష్ చేసి పారేస్తుంది ఇండియన్ ఆర్మీ. పీవోకేలో సర్జికల్ స్ట్రైక్స్‌తో మన ఆర్మీ సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి బాగా తెలిసొచ్చింది. ఇలాంటి గెరిల్లా అటాక్స్, డైరెక్ట్ వార్ చేయడంలో ఇజ్రాయెల్ తర్వాతే ఎవరైనా. లేటెస్ట్‌గా ఇజ్రాయెల్ హౌతీలపై విరుచుకుపడిన తీరు ఇండియాకు ఇన్స్పిరేషన్‌గా నిలుస్తోంది. మనం కూడా ఇజ్రాయెల్ మాదిరి.. ఉగ్రవాదులపై దాడులు చేయాలనే వాదన వినిపిస్తోంది. ఇలాంటివి జరిగినప్పుడల్లా పాక్ ఉలిక్కిపడుతుండొచ్చు. ఎక్కడ ఇండియా సైతం ఇజ్రాయెల్ మాదిరిగా తమపై అటాక్ చేస్తుందోనని అక్కడి పాలకులు దడుసుకుంటారేమో. ఇంతకీ ఇజ్రాయెల్ ఏం చేసిందంటే…
హౌతీలపై అటాక్
జస్ట్ 24 గంటల్లో తామెంటో హౌతీలకు చూపించింది ఇజ్రాయెల్. తమ దేశంపై దాడి చేసింది ఎవరైనా.. వారు ఎక్కడున్నా వదిలేది లేదని ఇప్పటికే అనేక సార్లు చెప్పిన ఇజ్రాయెల్.. ఇప్పుడు మరోసారి చేతల్లో ఆ మాటలను నిజం చేసింది. ఇజ్రాయెల్‌లో అత్యంత రద్దీగా ఉండే బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్‌పై హౌతీలు దాడి చేశారు. ఈ దాడి జరిగింది యెమెన్ నుంచే అని గుర్తించిన ఇజ్రాయెల్.. వెంటనే ఆ దేశ పోర్ట్ సిటీ హోడైడాపై బాంబుల వర్షం కురిపించింది. హౌతీలకు ఆదాయ వనరుగా ఉన్న చమురు నిల్వలను నాశనం చేసింది. పోర్టులో కార్యకలాపాలు జరగకుండా అడ్డుకుంది.
24 గంటల్లో కౌంటర్ అటాక్స్
ఎయిర్‌పోర్ట్‌పై మిసైల్ అటాక్ జరగగానే అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు ఆ దేశ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు. వెంటనే కౌంటర్ అటాక్స్ చేయాలని ఆదేశించారు. చెప్పినట్టుగానే 24 గంటలు గడవకముందే దాడులు చేసింది ఇజ్రాయెల్ ఎయిర్‌ఫోర్స్. దాడుల్లో 20 ఫైటర్ జెట్స్.. 50 బాంబులను ప్రయోగించాయి. ఒకరు మృతి చెందగా.. 35 మందికి గాయాలైనట్టు తెలుస్తోంది.
పీవోకేపై అటాక్స్ ఉంటాయా?
హౌతీలపై ఇజ్రాయెల్ చేసిన ఇలాంటి అటాక్.. ఇండియా నుంచి ఎక్స్‌పెక్ట్ చేయగలమా? హౌతీలు పాక్ ఉగ్రవాదుల్లాంటి వాళ్లే. కాకపోతే యెమెన్ చిన్న దేశం. ఆయుధ సంపత్తిలో ఇజ్రాయెల్‌తో సరితూగలేదు. అందుకే, గెరిల్లా దాడులు చేస్తూ ఉనికి చాటుకుంటోంది. బలమైన ఇజ్రాయెల్ గట్టిగా గుణపాఠం చెబుతోంది. అయితే, ఇజ్రాయెల్ అటాక్ చేసినట్టు మనం కనీసం పీవోకే ఉగ్రవాద స్థావరాలపైనైనా దాడి చేయగలమా? ఆ విధంగానైనా పహల్గాం మృతులకు నివాళులు అర్పించగలమా? చూడాలి కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో.
Also Read : హైదరాబాద్, వైజాగ్‌లో హైఅలర్ట్.. వార్ డ్రిల్