E-Paper
Advertisement

బిగుతుగా ఉన్న బ్రా వేసుకుంటే రొమ్ము క్యాన్సర్ వస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..

బిగుతుగా ఉన్న బ్రా వేసుకుంటే రొమ్ము క్యాన్సర్ వస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..
Advertisement

Breast Cancer Awareness: రోజూ ధరించే బ్రా గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు, సందేహాలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బిగుతుగా ఉండే బ్రా వేసుకోవడం లేదా రోజంతా బ్రా ధరించడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందనే ప్రచారం చాలామంది మహిళల్లో ఆందోళన కలిగిస్తోంది. నిజంగానే బ్రా ధరించే విధానానికి బ్రెస్ట్ క్యాన్సర్‌కు ఏమైనా సంబంధం ఉందా? లేక ఇది కేవలం ఒక అపోహ మాత్రమేనా? ఈ విషయంపై వైద్యులు, శాస్త్రీయ ఆధారాలు ఏం చెబుతున్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అసలు నిజం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అపోహల వెనుక నిజం ఎంత?

టైట్‌గా ఉండే బ్రా వేసుకోవడం వల్ల రొమ్ము భాగంలో ఉండే శోషరస వ్యవస్థ (లింఫాటిక్ డ్రైనేజ్) దెబ్బతిని, విషపదార్థాలు పేరుకుపోయి క్యాన్సర్‌కు దారితీస్తుందని చాలామంది భావిస్తుంటారు. కానీ ఈ వాదనకు ఎలాంటి శాస్త్రీయ ప్రామాణికత లేదు. బ్రా బిగుతుగా ఉండటం వల్ల క్యాన్సర్ వస్తుందనే దానికి ఆధారం లేదని క్యాన్సర్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ కూడా వివిధ పరిశోధనల ఆధారంగా ఈ విషయాన్ని తేల్చిచెప్పింది. కాబట్టి.. బ్రాల వల్ల క్యాన్సర్ వస్తుందనే వార్తలు కేవలం అపోహలు మాత్రమే.

Advertisement

Also Read: ఒంటరితనం మీ తలరాత కాదు.. మీ అలవాటే, సైకాలజీ చెప్పే చేదు నిజాలివే!

శరీరంపై ప్రభావం ఎంత?

బ్రా క్యాన్సర్‌కు దారితీయకపోయినా.. సరైన సైజ్ ఎంచుకోకపోతే కొన్ని రోజువారీ ఇబ్బందులు తప్పవు. మరీ టైట్‌గా ఉండే బ్రాలు వేసుకోవడం వల్ల చర్మంపై ఎర్రటి మచ్చలు పడటం, దురద, చికాకు, నొప్పులు రావచ్చు. ముఖ్యంగా గర్భధారణ, పాలిచ్చే సమయంలో లేదా హార్మోన్ల మార్పుల వల్ల రొమ్ము పరిమాణంలో మార్పులు వస్తుంటాయి. ఇలాంటి సమయంలో శరీరానికి సరిపోయే, ప్రశాంతంగా ఉండే బ్రా ఎంచుకోవడం వల్ల శారీరక అసౌకర్యం నుంచి ఉపశమనం లభిస్తుంది.

క్యాన్సర్‌కు అసలు కారణాలేంటి?

Advertisement

రొమ్ము క్యాన్సర్ రావడానికి బ్రాలు కారణం కాదు. వయసు పెరగడం, కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉన్న చరిత్ర ఉండటం, జెనెటిక్ మార్పులు ప్రధాన కారణాలుగా ఉంటాయి. అలాగే శరీర బరువు ఎక్కువగా ఉండటం, శారీరక శ్రమ లేకపోవడం, మద్యపానం, హార్మోన్ల వ్యత్యాసాలు కూడా ఈ ప్రమాదాన్ని పెంచుతాయి. మన దేశంలో 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి.. అనవసరమైన భయాలను పక్కనబెట్టి అసలైన కారణాలపై అవగాహన పెంచుకోవాలి.

మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

దుస్తుల గురించి అనవసరంగా భయపడకుండా.. రొమ్ము ఆరోగ్యంపై క్రమం తప్పకుండా శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. రొమ్ములో కొత్తగా ఏవైనా గడ్డలు కనిపించినా, చర్మంలో మార్పులు వచ్చినా, ద్రవాలు కారడం లేదా నొప్పులు ఉన్నా వెంటనే డాక్టర్‌ను కలవాలి. ఇలాంటి లక్షణాలను దుస్తుల ఇబ్బందిగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు. సరైన సమయంలో పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడమే మనల్ని క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది.

Also Read: ఇంట్లో ఈ దిశను ఖాళీగా ఉంచితేనే లక్ష్మీదేవి కొలువుంటుందా? వాస్తు ఏం చెబుతోంది?

Tags

Related News

నెల చివరికి జేబు ఖాళీ.. జీతం సరిపోవడం లేదా? ఈ స్మార్ట్ ఫైనాన్సియల్ టిప్స్ మీ కోసమే

పచ్చి పాలు తాగడం వల్ల యువకుడికి గుండె సమస్య.. హెచ్చరిస్తున్న డాక్టర్లు

ప్రేమ అంటే రక్తంతో లవ్ లెటర్స్ రాయడం కాదు.. ఒక్కడే కొండను చీల్చిన ప్రేమికుడు

పిల్లల ప్రవర్తనలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే తల్లిదండ్రులు తప్పు చేస్తున్నట్లే..

స్టేజ్‌పై మాట్లాడేటప్పుడు చేతులు, కాళ్లు వణుకుతున్నాయా? మీ కాన్ఫిడెన్స్ పెంచేందుకు ఈజీ టిప్స్

పనికి రాని పెయింటింగ్‌ను రూ.2,800కి కొన్నాడు.. కట్ చేస్తే కోటీశ్వరుడయ్యాడు, అదెలా?

58 ఏళ్ల నా భర్తతో పెళ్లికి 16 ఏళ్ల కన్నె పిల్ల కావాలి.. వింత కండిషన్లతో భార్య పత్రికా ప్రకటన

Big Stories

Advertisement
×