Alibaba electric kettle and mixer grinder: ఉరుకులు పరుగుల జీవితంలో.. ప్రతి ఒక్కరూ సమయాన్ని ఆదా చేసుకోవడానికి చూస్తున్నారు. ముఖ్యంగా కిచెన్ పనులు త్వరగా పూర్తయితే ఎంతో ఉపశమనం లభిస్తుంది. దీని కోసం మార్కెట్లోకి రక రకాల ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ వస్తున్నాయి. అయితే.. వాటన్నింటినీ విడివిడిగా కొనడం కంటే.. ఒకే సారి బెస్ట్ కాంబో సెట్ తీసుకోవడం చాలా బెస్ట్ . అలాంటి’అలీబాబా కిచెన్ & హోమ్ అప్లయన్సెస్ కాంబో’ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయాన్నే లేవ గానే వేడి వేడి టీ లేదా కాఫీ కావాలంటే.. గ్యాస్ వెలిగించే పని లేకుండా.. నిమిషాల్లో నీళ్లు మరిగించుకోవడానికి ఈ 2 లీటర్ల ఎలక్ట్రిక్ కెటిల్ చాలా గొప్పగా పని చేస్తుంది. సిల్వర్ ఫినిషింగ్‌తో.. ఆకర్షణీయంగా ఉండే ఈ కెటిల్ తక్కువ సమయంలో.. నీటిని వేడి చేస్తుంది.దీనిలో ఆటో షట్-ఆఫ్ ఫీచర్ ఉండటం వల్ల నీరు మరగగానే ఇది దానంతట అదే ఆగిపోతుంది. కాబట్టి ఇది చాలా సేఫ్.
కిచెన్‌లో మసాలాలు రుబ్బడం, చట్నీలు చేయడం లేదా జ్యూస్‌లు తయారు చేయడం వంటి పనులకు మిక్సర్ గ్రైండర్ అవసరం. ఈ కాంబోలో. లభించే మిక్సర్ గ్రైండర్ పవర్ ఫుల్ మోటార్‌తో వస్తుంది. దీంతో.. పాటు వచ్చే 4 డిఫరెంట్ జార్లు వివిధ రకాల అవసరాలకు ఉపయోగ పడతాయి. వీటి ద్వారా పిండి రుబ్బడం నుంచి పొడి చేసుకోవడం వరకు అన్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు.
బట్టలను నీట్‌గా ఇస్త్రీ చేసు కోవడానికి ఈ కాంబోలో ..అదనంగా.. మ్యాజిక్ డ్రై ఐరన్ బాక్స్‌ను అందించారు. వైట్, సీ గ్రీన్ కాంబినేషన్‌లో చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండే ఈ ఐరన్ బాక్స్, బట్టలపై మడతలను ఇట్టే తొలగిస్తుంది. తక్కువ పవర్‌తో.. పని చేసే ఇది బట్టలు పాడు కాకుండా బెటర్‌గా ఇస్త్రీ చేస్తుంది.
ఈ అప్లయన్సెస్ అన్నీ కూడా బెస్ట్ క్వాలిటీ గల మెటీరియల్‌తో తయారు చేసారు. మీ కిచెన్ , ఇంటికి ఒక మోడ్రన్ లుక్‌ను తెచ్చిపెట్టేలా.. వీటి రంగులు , డిజైన్ ఉన్నాయి. తక్కువ స్థలంలో సర్దు బాటు అయ్యేలా వీటిని కాంపాక్ట్‌గా డిజైన్ చేయడం మరో స్పెషాలిటీ అని చెప్పొచ్చు.
Also Read: రూ.1,999కే రియల్‌మీ 20000mAh పవర్ బ్యాంక్..ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్ అదిరిపోయాయి!
విడివిడిగా ఎలక్ట్రానిక్ వస్తువులను కొంటే.. ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ ఇలాంటి కాంబో ప్యాక్‌లను తీసుకోవడం ద్వారా డబ్బు ఆదా కావడంతో పాటు, ఇంటికి అవసరమైన ప్రొడక్ట్స్ ఒకే సారి లభిస్తాయి.
కొత్తగా ఇల్లు మారుతున్నప్పుడు.. కిచెన్ అప్‌గ్రేడ్ చేసు కోవాలనుకునే వారికి ‘అలీబాబా ఎలక్ట్రిక్ కెటిల్ & మిక్సర్ గ్రైండర్ కాంబో’ ఒక ఆప్షన్ అని చెప్పొచ్చు. క్వాలిటీ, స్టైల్, బడ్జెట్ మూడూ.. సరి పోయే ఈ ప్రొడక్ట్స్ మీ ఇంటికి చాలా బాగా ఉపయోగ పడతాయి.