E-Paper
Advertisement

‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!

‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!
Advertisement

Ponnam Prabhakar: స్వేచ్చ బ్యూరో: రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ త్వరలో జిల్లాల పర్యటనలకు వెళ్లనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో శాఖల పనితీరును పరిశీలించడంతో పాటు.. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును స్వయంగా సమీక్షించేలా పర్యటనలకు రూపకల్పన చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి జిల్లాల వారీగా పర్యటన షెడ్యూల్‌ను సిద్ధం చేసే ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం.

ఆ అంశాలపై స్పెషల్ ఫోకస్..

మంత్రి పర్యటనల్లో ప్రధానంగా ఆర్టీసీ, రోడ్డు భద్రత, బీసీ సంక్షేమం తదితర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి.. ఆయా శాఖల్లో అమలవుతున్న కార్యక్రమాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు సమాచారం. అదే విధంగా జిల్లాల పర్యటనల్లో ఆర్టీసీకి సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. డిపోల పరిస్థితి, బస్సుల నిర్వహణ, గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యం, ప్రయాణికులకు అందుతున్న సేవలు, సిబ్బంది సమస్యలు తదితర అంశాలను మంత్రి పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఆదాయ వ్యయాలు తదితర అంశాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. విద్యార్థులు, ఉద్యోగులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యాలపై కూడా స్థానికంగా వివరాలు తెలుసుకోనున్నట్లు సమాచారం.

రోడ్డు భద్రతపైనా సమీక్ష..

Advertisement

జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు, ప్రమాదకర ప్రాంతాలు, బ్లాక్‌స్పాట్లు, రహదారుల పరిస్థితి తదితర అంశాలపైనా అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. రవాణా, పోలీసు, రోడ్లు-భవనాలు తదితర శాఖల మధ్య సమన్వయంతో ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీయనున్నట్లు సమాచారం.

నేతలతో ‘బ్రేక్‌ఫాస్ట్‌’ భేటీలు

ప్రభుత్వ కార్యక్రమాల సమీక్షలతో పాటు ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలు, స్థానిక నాయకులతో మంత్రి ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఉదయం వేళల్లో ‘బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్స్‌’ నిర్వహించి స్థానిక సమస్యలను తెలుసుకోనున్నట్లు సమాచారం. జిల్లాల్లోని రాజకీయ పరిస్థితులు,పార్టీ–ప్రభుత్వ సమన్వయం,ప్రజల నుంచి వస్తున్న వినతులు, ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై అభిప్రాయాలను తెలుసుకునేలా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Also Read: కియా కార్లపై అదిరిపోయే పండుగ ఆఫర్లు.. ఏకంగా రూ.1.70 లక్షల వరకు తగ్గింపు!

హాస్టళ్లపై ఆకస్మిక తనిఖీలు?

బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని వసతిగృహాల పరిస్థితిపై మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. జిల్లాల పర్యటన సందర్భంగా ముందస్తు సమాచారం లేకుండా సంక్షేమ హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసే అవకాశమున్నట్లు సమాచారం. హాస్టళ్లలో విద్యార్థులకు అందుతున్న భోజనం, తాగునీరు, పారిశుద్ధ్యం, వసతి, విద్యా సదుపాయాలు, సిబ్బంది పనితీరు తదితర అంశాలను స్వయంగా పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. హాస్టళ్లపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.

విద్యార్థులతో మమేకం..హాస్టల్‌లోనే బస?

హాస్టళ్ల తనిఖీల సమయంలో విద్యార్థులతో మంత్రి నేరుగా మాట్లాడేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు సమాచారం. విద్యార్థుల సమస్యలు, చదువుకు సంబంధించిన ఇబ్బందులు, హాస్టల్‌లోని సౌకర్యాలపై వారి నుంచే వివరాలు తెలుసుకోనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా విద్యార్థులతో కలిసి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేలా పర్యటనలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా క్షేత్రస్థాయి పరిస్థితులను మరింత లోతుగా తెలుసుకునేందుకు అవసరమైన చోట మంత్రి హాస్టల్‌లోనే రాత్రి బస చేసే అంశంపైనా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అధికారులు ముందుగా సిద్ధం చేసిన నివేదికలకే పరిమితం కాకుండా.. విద్యార్థులు, సిబ్బందితో నేరుగా మాట్లాడి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ తరహా కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు సమాచారం.

క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదిక

శాఖల కార్యాలయాల్లో జరిగే సాధారణ సమీక్షలకు భిన్నంగా క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడమే ఈ పర్యటనల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. అధికారులు ఇచ్చే నివేదికలతో పాటు ప్రజలు, విద్యార్థులు, సిబ్బంది నుంచి నేరుగా సమాచారం తీసుకుని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార మార్గాలను సూచించేలా పర్యటనలను నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రజల ఇబ్బందులు, పార్టీ పరిస్థితులు, నేతల మధ్య సఖ్యత, ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయంను సైతం నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేయనున్నట్లు సమాచారం.

త్వరలో షెడ్యూల్‌..

మొత్తంగా జిల్లాల పర్యటనల్లో అధికారిక సమీక్షలు, క్షేత్రస్థాయి పరిశీలనలు, ప్రజలు–విద్యార్థులతో నేరుగా మమేకం కావడంపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. తొలుత కొన్ని జిల్లాలను ఎంపిక చేసి పర్యటనలు చేపట్టి.. అనంతరం మిగిలిన జిల్లాల్లోనూ పర్యటనలు కొనసాగే అవకాశం ఉంది. పర్యటన తేదీలు, జిల్లాల వారీగా కార్యక్రమాలపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అన్ని జిల్లాల్లో పర్యాటన కొనసాగబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ‘పల్లెపల్లెకు పొన్నం’ అన్న కార్యక్రమం సక్సెస్ కావడంతోనే సీఎం ఆదేశాలతో జిల్లాల పర్యటనకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.

Also read: దేశంలో తొలిసారి ఏపీలో 3 డీ హౌసింగ్ ప్రాజెక్ట్.. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శంకుస్థాపన, జగన్‌పై విసుర్లు!

Tags

Related News

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

విద్వేషపూరిత పాలన, ప్రసంగాలు వద్దు.. కక్షపూరిత వైఖరి విడనాడాలని సూచన..! అదును చూసి కేసీఆర్ హితోపదేశం..!

అమెరికా వీసా మీ చేతిలో ఉందా.. అయితే పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి!

Big Stories

Advertisement
×