BigTV English

Hair Growth Tips: ఒత్తైన జుట్టు కావాలా ? అయితే ఇవి వాడండి

Hair Growth Tips: ఒత్తైన జుట్టు కావాలా ? అయితే ఇవి వాడండి

Hair Growth Tips: మెంతి గింజలను వంటకాల తయారీలో ఉపయోగిస్తుంటారు. ఇది ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. అంతే కాకుండా శరీరానికి ఎంతగానో మేలు చేస్తుంది కూడా . ఇవి జుట్టును బలోపేతం చేస్తాయి. అంతే కాకుండా నల్లగా, దట్టంగా మారుస్తాయి. జుట్టు సమస్యలతో బాధపడేవారు మెంతి గింజల హెయిర్ మాస్క్‌ను తయారు చేసుకుని వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.


మెంతి గింజలు జుట్టుకు చాలా మేలు చేస్తాయి. అందులో కొన్ని పదార్థాలను మిక్స్ చేసి ద్వారా హెయిర్ మాస్క్‌ను తయారు చేసుకుని వాడటం వల్ల జుట్టుకు తగిన పోషణ లభిస్తుంది. అంతే కాకుండా తరుచుగా దీనిని వాడటం వల్ల జుట్టు రాలకుండా కూడా ఉంటుంది.

మెంతి గింజలతో హెయిర్ మాస్క్:
మెంతి గింజలలో కొన్ని పదార్థాలను మిక్స్ చేసి వాడటం ద్వారా హెయిర్ మాస్క్‌ తయారు చేసుకోవచ్చు. దీనిని వాడటం వల్ల జుట్టుకు చాలా ప్రయోజనాలు లభిస్తాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న మెంతి గింజలు, ఇతర పదార్థాల సహాయంతో హెయిర్ మాస్క్‌ను ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


మెంతి గింజలతో హెయిర్ మాస్క్ తయారీ:

మెంతి గింజలు, పెరుగు, తేనెతో హెయిర్ మాస్క్:
తయారుచేసే విధానం: మెంతి గింజల పేస్ట్, పెరుగు , తేనెను సమాన పరిమాణంలో తీసుకుని ఒక బౌల్ లో వేసి బాగా కలపండి. దీన్ని జుట్టుకు పట్టించి 30 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా చేయడం ద్వారా జుట్టు బాగా పెరుగుతుంది.

ప్రయోజనాలు: ఈ ప్యాక్ జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. అంతే కాకుండా బలంగా మారుస్తుంది. పెరుగు, తేనె జుట్టుకు పోషణనిస్తాయి.

మెంతి గింజలు, ఉసిరి, నిమ్మరసంతో మాస్క్ తయారీ:
తయారుచేసే విధానం:మెంతి గింజల పేస్ట్, ఉసిరి పొడి , నిమ్మరసం తగిన పరిమాణంలో తీసుకుని కలపండి. దీన్ని జుట్టుకు పట్టించి 30 నిమిషాల తర్వాత కడిగేయాలి.
ప్రయోజనాలు: ఉసిరి జుట్టును నల్లగా, బలంగా చేస్తుంది. అంతే కాకుండా నిమ్మరసం చుండ్రును తగ్గిస్తుంది.

మెంతి గింజలు, గుడ్డు , ఆలివ్ నూనెతో హెయిర్ మాస్క్:
తయారుచేసే విధానం: మెంతి గింజల పేస్ట్, ఒక గుడ్డు , ఆలివ్ నూనెలను తగిన మోతాదులో తీసుకుని ఒక బౌల్‌లో వేసి మిక్స్ చేయండి. దీన్ని జుట్టుకు పట్టించి 30 నిమిషాల తర్వాత కడిగేయాలి.
ప్రయోజనాలు: గుడ్డు జుట్టుకు పోషణను అందిస్తుంది. అంతే కాకుండా ఆలివ్ నూనె జుట్టును మృదువుగా చేస్తుంది.

Also Read: చలికాలంలో ఇలా చేస్తే.. జుట్టు సమస్యలు పరార్

మెంతి గింజలు, హెన్నాతో మాస్క్:
తయారుచేసే విధానం: మెంతి గింజల పేస్ట్ , హెన్నా పౌడర్ లో తగినంత నీరు తీసుకుని మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని జుట్టుకు పట్టించి కొన్ని గంటపాటు అలాగే ఉంచాలి. తర్వాత హెయిర్ వాష్ చేయాలి.
ప్రయోజనాలు: హెన్నా జుట్టుకు సహజ రంగును ఇస్తుంది. అంతే కాకుండా జుట్టును బలపరుస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Big Stories

×