Posani Krishna Murali:ప్రముఖ సినీ నటుడు, రచయిత, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) తాజాగా రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు. అయితే సడన్ గా ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేంటి..? అంటూ ఆరా తీయగా.. ఆయనే స్పందించారు. ముఖ్యంగా సినిమాలు, రాజకీయాలు అంటూ ఫ్యామిలీకి, పిల్లలకు సమయం ఇవ్వలేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. అయితే పోసాని కృష్ణ మురళి నిర్ణయం పై యంగ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ (SKN) స్పందిస్తూ.. ఊహించని కామెంట్స్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర ట్వీట్ కూడా పంచుకున్నారు.
మిమ్మల్ని క్షమించకూడదు..
ఎస్కేఎన్ పోస్టులో ఏముంది అనే విషయానికి వస్తే..సార్, ఇప్పుడు అందరికీ అన్ని గుర్తుకొస్తాయి. రాజకీయాల నుంచి విరమించుకున్నాను అని నటించే ముందు.. మా అభిమాన నాయకుడి గురించి, ముఖ్యంగా వారి ఇంట్లోని పసిపిల్లల గురించి మాట్లాడిన నీచమైన సంస్కారం లేని వ్యాఖ్యలకు చింతిస్తున్నాను అనో .. లేదా క్షమించండి అనో అడిగి ఉంటే, మీ మాటలు నమ్మాలని అనిపించేది. ఏదో ఒకసారి పొరపాటుగా మాట్లాడిన వ్యక్తి కాదు కదా మీరు.. ఎన్నోసార్లు ఎంతో నీచంగా మాట్లాడిన మాటలు మాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అభిమానుల మనసు చాలా అంటే చాలా బాధపడింది. ఈ మాటలు వినలేక చెవులు మూసుకునేలా మమ్మల్ని చేశారు. మీ ఒక్కరికే కాదు సార్, అందరివి కుటుంబాలే కదా.. ఎవరి పిల్లలైనా సరే పిల్లలే.. రాజకీయాల్లో విమర్శలు అనేవి చాలా సహజం కానీ వ్యక్తిగతంగా దిగజారుడు పదాలు మాట్లాడడం, కుటుంబాల మీద కామెంట్స్ చేసిన వారిని క్షమించకూడదు” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎస్ కే ఎన్. ప్రస్తుతం ఈయన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.
అందుకే రాజకీయాలకు స్వస్తి..
ఇకపోతే రాజకీయాలకి స్వస్తి పలుకుతూ పోసాని కృష్ణమురళి ఈ విధంగా మాట్లాడారు.. ఇంటర్వ్యూలో భాగంగా ఆ ఇంటర్వ్యూయర్ ప్రశ్నిస్తూ.. “సార్ ఇంత సడన్ గా రాజకీయాల నుంచి తప్పుకోవడానికి గల కారణం ఏంటి?” అంటూ ప్రశ్నించగా.. పోసాని మాట్లాడుతూ..” ఇవాలే ప్రెస్ వాళ్ళతో చెప్పాను. అసలు కారణం ఏమిటి?ఎందుకు? రాజకీయాలకు రాజీనామా చేశాను అని.. అన్నీ మీకు తెలుసు. నేను మళ్ళీ చెప్పాల్సిన పనిలేదు. 100% నేను నా కుటుంబం, పిల్లలు, భార్య కోసమే రాజకీయాలకు రాజీనామా చేశాను. గత 15 సంవత్సరాల నుంచి నా బిడ్డలను పట్టించుకోలేదు. సినిమాలు చేయడం, తర్వాత రాజకీయాల గురించి మాట్లాడం. పిల్లలు చదువుకుంటున్నార్లే అనుకున్నాను. మా అబ్బాయిని ఒకసారి అడిగితే.. “నేను ఏం చేయగలను డాడీ, నాకు ఎప్పుడైనా మీరు సలహా ఇచ్చారా..? నేను ఏం చేస్తానంటే అదే చేయ్ పో అన్నారు. ఇక నేను బీటెక్ లో డిస్ కంటిన్యూ చేశాను. అప్పుడు కూడా.. మీరు నాకు ఇష్టం లేక వదిలేసాను అనుకున్నారు. కానీ ఇష్టం లేక కాదు ట్యూషన్ పెట్టుకుందామనుకున్నప్పుడు మీరు నాకు సహకరించలేదు. ఇక సబ్జెక్టులు మిగిలిపోవడంతో సినిమాల్లోకి వచ్చాను. అక్కడ కూడా దాదాపు ఒకటిన్నర కోటి వృధా అయ్యింది. డైరెక్టర్ కోర్స్ కూడా చదువుకున్నాను”. అంటూ నా కొడుకు చెప్పుకొని బాధపడుతుంటే.. తట్టుకోలేకపోయాను. అందుకే నా కుటుంబాన్ని దగ్గరుండి చూసుకోవాలని అనుకున్నాను. ఈ క్రమంలోనే రాజకీయాలకు స్వస్తి పలికాను” అంటూ తెలిపారు పోసాని కృష్ణమురళి.
సార్, ఇప్పుడు అందరికి అన్ని గుర్తొస్తాయి కానీ విరమిస్తున్నా అని నటించే ముందు కనీసం మీరు మా అభిమాన నాయకుడి గురించి ముఖ్యంగా ఇంట్లోని పసి పిల్లల గురించి మాట్లాడిన నీచమైన సంస్కారం లేని లేకి వాఖ్యలకి చింతిస్తున్న లేదా క్షమించండి అని అడిగి ఉంటె కనీసం ఈ మాటలు నమ్మాలనిపించేది , ఎదో… https://t.co/7WIyzdvGqM
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) November 22, 2024