BigTV English
Advertisement

Healthy Hair Tips: వీటితో.. జుట్టు ఒత్తుగా పెరగడం ఖాయం

Healthy Hair Tips: వీటితో.. జుట్టు ఒత్తుగా పెరగడం ఖాయం

Healthy Hair Tips: జుట్టు పొడవుగా అలాగే ఒత్తుగా ఉంటే అందంగా కనిపిస్తుంది. సాధారణంగా మహిళలు తమ జుట్టు పొడవుగా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం మార్కెట్‌లో దొరికే చాలా రకాల షాంపూలు, హెయిర్ ఆయిల్స్ వాడుతుంటారు. వీటితో లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం అవసరం. ఈ హోం రెమెడీస్ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతే కాకుండా జుట్టు పెరిగేలా చేస్తాయి.


హోం రెమెడీస్: 
కావలసినవి:
ఆలివ్ ఆయిల్ – 4 టేబుల్ స్పూన్
తేనె- 1 టేబుల్ స్పూన్

అప్లై చేసే విధానం: పైన చెప్పిన మోతాదుల్లో ఆలివ్ ఆయిల్స్‌తో పాటు తేనెను కలిపి మిక్స్ చేసుకోవాలి. దీనిని హెయిర్‌కు అప్లై చేసి 30 నిమిషాల తర్వాత షాంపూతో వాష్ చేయాలి. వారానికి కనీసం రెండుసార్లు ఈ రెమెడీని ఉపయోగించండి. కొంతకాలం తర్వాత మీరు తేడాను స్పష్టంగా చూస్తారు.


ఈ హెయిర్ మాస్క్ యొక్క ప్రయోజనాలు:
మీ జుట్టు పొడిగా ఉంటే తేనెతో జుట్టు పొడిబారడం తగ్గుతుంది. ఆలివ్ ఆయిల్ అప్లై చేయడం వల్ల జుట్టుకు డీప్ కండిషనింగ్ లభిస్తుంది. మీ జుట్టు పొడిగా ఉంటే తేనెను ఉపయోగించడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి జుట్టుపై బ్యాక్టీరియా పెరగకుండా నిరోధిస్తాయి. దీని వల్ల జుట్టు పెరగడం మొదలవుతుంది.

జుట్టును శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. స్కాల్ప్ మురికి వల్ల జుట్టు పెరగదు.  దీంతో జుట్టు ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. ఇటువంటి పరిస్థితిలో.. మీరు మీ జుట్టుకు తేనెను ఉపయోగిస్తే, తలపై ఉన్న చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

జుట్టు చిట్లడం సమస్యను తగ్గించడంలో ఆలివ్ ఆయిల్ చాలా మేలు చేస్తుంది. జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఆలివ్ నూనెను ఉపయోగించవచ్చు. జుట్టును హైడ్రేట్ చేయడానికి, పోషణకు ఆలివ్ ఆయిల్ కూడా మంచి ఎంపిక.

2. ఆలివ్ నూనె ఎగ్ హెయిర్ మాస్క్:

కావలసినవి :

ఆలివ్ నూనె- ఒక చెంచా
తెల్లసొన- 1
నిమ్మరసం- 1 టేబుల్ స్పూన్

Also Read: ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్‌తో.. జుట్టు పెరగడం గ్యారంటీ

ఎలా తయారు చేయాలి ?

తయారీ విధానం: పైన చెప్పిన మోతాదులో ఎగ్ వైట్, నిమ్మరసం, ఆలివ్ నూనె తీసుకుని ఒక బౌల్‌లో వేసి మిక్స్ చేయాలి. తర్వాత దీనిని హెయిర్‌కు అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత జుట్టును షాంపూతో వాష్ చేయాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతే కాకుండా జుట్టులో ఉన్న విటమిన్స్ జుట్టుకు పోషణను అందిస్తాయి. అంతే కాకుండా జుట్టును మృదువుగా చేస్తాయి. ఆలివ్ ఆయిల్ జుట్టు పెరిగేందుకు ఉపయోగపడుతుంది. చుండ్రును కూడా తగ్గిస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Chicken Sweet Corn Soup: రెస్టారెంట్ స్టైల్ చికెన్ స్వీట్ కార్న్ సూప్.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Dosakaya Pachadi: దోసకాయ కాల్చి ఇలా రోటి పచ్చడి చేశారంటే అదిరిపోతుంది

Most Dangerous Foods: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆహారాలు.. సరిగ్గా వండకపోతే ప్రాణాలకే ప్రమాదం !

Omelette Vs Boiled Egg: ఎగ్స్ Vs ఆమ్లెట్.. బరువు తగ్గడానికి ఏది తింటే బెటర్ ?

Saliva Test: ఏంటి నిజమా? లాలాజలంతో గుండె పనితీరు గుర్తించొచ్చా..! అదెలా ?

Tips For Hair: జుట్టు త్వరగా పెరగాలా ? అయితే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Banana: ఖాళీ కడుపుతో అరటిపండు తింటే.. జరిగేది ఇదే ?

Heart Health:గుండె జబ్బులు ఉన్నాయని తెలిపే.. సంకేతాలు ఇవేనట !

Big Stories

×