BigTV English

Dark Circles: కళ్ల కింద డార్క్ సర్కిల్స్ కి బై బై చెప్పండిలా !

Dark Circles: కళ్ల కింద డార్క్ సర్కిల్స్ కి  బై బై చెప్పండిలా !

Home Remedies For Dark Circles: మాటలతో చెప్పలేని ఎన్నో విషయాలు కళ్లు చెబుతాయి అంటారు. కళ్లకు అంత పవర్ ఉంటుంది మరి. కళ్ల చుట్టూ వలయాలు ఉంటే ఈ సమస్య కూడా చాలా విషయాలనే చెబుతుంది. ఆరోగ్యం సరిగా లేకపోయినా కళ్ల క్రింద డార్క్ సర్కిల్స్ వస్తాయి. కళ్ల కింద నల్లని వలయాలు అందాన్ని పాడు చేస్తాయి. దీంతో కళ్లు కూడా అనుకున్నంత అందంగా కనిపించవు.


డార్క్ సర్కిల్స్ కారణంగా కళ్ల కింద చర్మం నల్లగా మారుతుంది. రక్తహీనత వల్ల కూడా డార్క్ సర్కిల్స్ రావచ్చని డాక్టర్లు చెబుతున్నారు. మరి ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాల్సిందే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బంగాళదుంప:ఒక బంగాళదుంప, కాఫీ పౌడర్ ఒక స్పూన్, విటమిన్ ఇ క్యాప్సూల్స్ తీసుకోవాలి. మొదట బంగాళదుంపను తురుముకోవాలి. ఒక గిన్నెలో దీని రసాన్ని తీసుకుని అందులో కాఫీ పౌడర్, విటమిన్ ఇ క్యాప్సూల్స్ వేసి బాగా కలపాలి. దీనిని రెండు కళ్లపై అప్లై చేసి మసాజ్ చేయాలి. 15 నిమిషాల పాటు అలానే ఉంచి తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. బంగాళదుంప రసంలో బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. దీనిని రాయడం వల్ల మచ్చలు, నల్లటి వలయాలు తగ్గుతాయి. దీంతో చర్మం కూడా మెరుస్తుంది.


విటమిన్ ఇ క్యాప్సూల్స్: యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్న విటమిన్ ఇ క్యాప్సూల్స్ చర్మాన్ని కాపాడతాయి. అంతే కాకుండా ముడతల్ని తగ్గిస్తాయి. అయితే వారానికి రెండు లేదా మూడు సార్లు వీటిని వాడవచ్చు. ఈ క్యాప్సూల్స్ కాస్త నూనెతో కలిపి వాడాలి.

కాఫీ పౌడర్: కాఫీ పౌడర్‌లో కెఫిన్ ఉంటుంది. ఇది రక్త ప్రసరణను, కళ్ల కింద వాపుని తగ్గిస్తుంది. కాఫీ పౌడర్‌ను కాస్త నీటిలో వేసి కలిపి డార్క్ సర్కిల్స్ ఉన్న చోట రాయడం వల్ల డార్క్ సర్కిల్స్ క్రమంగా తగ్గి కళ్లు అందంగా కనిపిస్తాయి.

కేవలం ఇంటి చిట్కాలతోనే సమస్య మొత్తాన్ని దూరం చేయవచ్చు. వీటిని వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. ఏవైనా అలర్జీలు ఉంటే ముందు డాక్టర్‌ని కలిసి మాట్లాడండి.

Also Read: త్వరగా నిద్ర పట్టడం లేదా ? ఈ చిట్కాలు మీ కోసమే..

ముఖ్యంగా నల్లటి వలయాలను తగ్గించేందుకు తగినంత నిద్రపోవాలి. దీని వల్ల శరీరంతో పాటు మనసుకు చాలా మంచిది. నిద్రపోవడం తగ్గిస్తే చర్మం పలుచబడుతుంది. ఆల్కహాల్ వినియోగం, పడుకునే ముందు స్క్రీన్ చూడడం వల్ల కూడా ఈ సమస్య పెరుగుతుంది. తగినంత నిద్రపోవడం కూడా డార్క్ సర్కిల్స్ ను తగ్గించడానికి ఉపయోగపడుతుందని గమనించాలి.

(Disclaimer : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్ ద్వారా సేకరించబడినది. bigtvlive.com దీన్ని ధృవీకరించడం లేదు.)

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×