ప్రతి అమ్మాయికి పొడవాటి జడ కావాలని అనిపిస్తుంది. అలాగే ఆ జుట్టు ఒత్తుగా ఉండాలని కూడా కోరుకుంటారు. అయితే ఈ ఆధునిక కాలంలో జుట్టు ఊడిపోతున్న సమస్యతో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. జుట్టు పెరుగుదల అనేది చాలా తక్కువ మందిలోనే ఉంటుంది. కాబట్టి హానికరమైన రసాయనాలు ఉత్తమ ఇంటి చిట్కాల ద్వారా జుట్టును పొడవుగా పెంచుకునేందుకు ప్రయత్నించాలి. అందులో కలబంద, కర్పూరం రెండు శక్తివంతంగా పనిచేస్తాయి.
ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి కలబంద, కర్పూరం కలిసి ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. కలబందలో విటమిన్లు, ఖనిజాలు, ఎంజైములు అధికంగా ఉంటాయి. ఇవి మన నెత్తికి పోషణను అందిస్తాయి. ఇక ఇందులో ఉండే కర్పూరం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు కుదుళ్లను ప్రేరేపించడం ద్వారా జుట్టు పెరిగేలా చేస్తుంది. అలాగే జుట్టును తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్న వారు కలబంద, కర్పూరం కలిపి ఎలా వాడాలో తెలుసుకోండి.
కలబంద కర్పూరం హెయిర్ మాస్క్
కలబంద, కర్పూరం కలిపిన హెయిర్ మాస్క్ మీ నెత్తికి లోతుగా పోషణనిచ్చి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇందుకోసం మీరు రెండు టేబుల్ స్పూన్ల తాజా కలబంద జెల్ ను ఒక గిన్నెలో వేయండి. అందులోనే ఒక స్పూను కర్పూరం పొడిని వేసి బాగా కలపండి. అలాగే ఒక స్పూన్ కొబ్బరి నూనె కూడా వేసుకోండి. ఈ మొత్తం మిశ్రమాన్ని తలకు పట్టించండి. జుట్టు మూలాలకు తగిలేలా దీన్ని అప్లై చేయాలి. ఒక అరగంట పాటు అలా వదిలేయాలి. వీలైతే రాత్రంతా అలా నిద్రపోండి. ఉదయం లేచాక తేలికపాటి షాంపూతో తలకు స్నానం చేయండి. వారానికి ఇలా రెండుసార్లు చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. జుట్టు కుదుళ్లు బలంగా మారుతాయి. చుండ్రు కూడా చాలా వరకు తగ్గుతుంది. జుట్టు పెరగడం ప్రారంభం అవుతుంది.
హెయిర్ మసాజ్‌కు
మసాజ్ చేసేందుకు కలబంద కర్పూరంతో నూనెను కూడా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో మీరు మూడు టేబుల్ స్పూన్ల తాజా కలబంద జెల్ ను వేయండి. అందులోనే ఒక స్పూను కర్పూరం పొడిని, రెండు స్పూన్ల ఆలివ్ నూనెను వేసి బాగా కలపండి. ఈ మొత్తాన్ని తలకు బాగా పట్టించి మసాజ్ చేయండి. రాత్రంతా కనీసం ఒక గంట పాటు మసాజ్ చేయండి. తర్వాత తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోండి. వారానికి రెండుసార్లు ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల జుట్టు మూలాల నుంచి బలంగా పెరగడం మొదలవుతుంది.
జుట్టుకు పట్టిన మురికిని వదిలించుకోవడానికి కూడా కలబంద కర్పూరం ఎంతో ఉపయోగపడతాయి. ఒక కప్పు నీటిలో రెండు టేబుల్ స్పూన్ల కలబంద జెల్, ఒక స్పూన్ కర్పూరం పొడి వేసి బాగా కలపండి. దాన్ని ఒక స్ప్రే బాటిల్ లో వేసుకోండి. మీరు తలకు స్నానం చేసి షాంపూ పెట్టుకున్నాక జుట్టును కడిగేసుకోండి. తరువాత ఈ స్ప్రే బాటిల్ తో జుట్టుకు ఈ మిశ్రమాన్ని చల్లండి. పావుగంటసేపు సున్నితంగా మసాజ్ చేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు పట్టుకుచ్చులా, మృదువుగా మారి మెరుస్తూ ఉంటాయి.
చుండ్రు నియంత్రించేందుకు
కలబంద, కర్పూరం కలిసి చుండ్రులను కూడా తొలగిస్తాయి. జుట్టు మూలాలను బలంగా మారుస్తాయి. చుండ్రును సమర్ధవంతంగా వదిలించుకోవడానికి రెండు టేబుల్ స్పూన్ల కలబంద జెల్ ను తీసుకోండి. అందులో ఒక స్పూను కర్పూరం పొడి, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపండి. మీకు చుండ్రు ఎక్కడ నెత్తిమీద ఇబ్బంది పెడుతుందో అక్కడ ఈ మొత్తం మిశ్రమం మిశ్రమాన్ని రాయండి. తర్వాత ఒక అరగంట పాటు అలా వదిలేయండి. ఇప్పుడు తేలికపాటి షాంపూతో తల స్నానం చేయండి. కలబంద, కర్పూరం జుట్టు పెరుగుదలకు శక్తివంతమైన సహజ నివారణలుగా పనిచేస్తాయి. ఇవి హైడ్రేషన్ ను అందిస్తాయి. నెత్తికి పోషణను అందించి చుండ్రును నియంత ఇస్తాయి జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు ఉపయోగపడతాయి.
ఇవి కూడా చదవండి