E-Paper
Advertisement

శ్రీచైతన్య కాలేజీలో దారుణం కొట్టుకున్న విద్యార్థులు.. ఒకరి పరిస్థితి విషమం!

శ్రీచైతన్య కాలేజీలో దారుణం కొట్టుకున్న విద్యార్థులు.. ఒకరి పరిస్థితి విషమం!
Advertisement

Boduppal Hostel: మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌లోని శ్రీచైతన్య జూనియర్‌ కళాశాల హాస్టల్‌లో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థి కందుల అనూప్‌ (17) తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం బోడుప్పల్‌లోని అభయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

శ్రీచైతన్య కళాశాలలో..

పెద్దపల్లి జిల్లా ఓదెడు గ్రామానికి చెందిన అనూప్‌ శ్రీచైతన్య కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. యశ్వంత్‌ సింగ్‌, రణధీర్‌తో పాటు మరో విద్యార్థి అతడిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. విద్యార్థుల మధ్య డబ్బుల విషయంలో తలెత్తిన వివాదమే ఘర్షణకు కారణమని సమాచారం. పండుగ సెలవుల అనంతరం కళాశాలకు తిరిగి వచ్చిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిసింది.

సిబ్బంది నిర్లక్ష్యం..

Advertisement

హాస్టల్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ తీవ్ర గాయాలకు దారితీయడం, ఘటనపై కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వలేదన్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. విద్యార్థుల పర్యవేక్షణ, హాస్టల్‌ భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఘటనకు గల కారణాలు, దాడిలో ఎవరెవరి ప్రమేయం ఉందన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. అనూప్‌ తల్లిదండ్రులు మానస, శ్రీనివాస్‌ దంపతులు కుమారుడి పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు.

Also read: ఫ్రైడే ఓటీటీలోకి ఏకంగా 12 సినిమాలు… అన్నీ తెలుగులోనే… మిస్ అవ్వకూడని సినిమాలు ఇవే

Tags

Related News

మియాపూర్ భూముల వ్యవహారం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు, లక్షా 50 వేల కోట్ల భూములు కాపాడాం

సెల్‌ఫోన్ ఆ యువతికి శాపమైంది.. కూతుర్ని చంపిన తల్లి, రంగారెడ్డి జిల్లాలో ఘోరం

అతివేగం కొంప ముంచింది.. పల్టీలు కొట్టిన టయోటా ఇన్నోవా, రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి సంచలనం.. ఏమన్నారంటే?

మూసీ సుందరీకరణ కాదు.. రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి స్కెచ్.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ధ్వజం!

ఆంధ్రప్రదేశ్‌కు అండగా.. తెలంగాణ విద్యుత్‌ సహాయక బృందాలు!

హుజురాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల పథకం వివాదం.. కోర్టు ఉత్తర్వులున్న భూమిలో నిర్మాణం!

జగిత్యాల జిల్లాలో ఓ రైతు అద్భుత ఆలోచన.. సన్నవడ్ల కొనుగోలులో సంచలనం!

Big Stories

Advertisement
×