E-Paper
Advertisement

ఎల్ నినో ఎఫెక్ట్.. ఆ ఉచిత పథకంపై తెలంగాణ సర్కార్ నీలినీడలు!

ఎల్ నినో ఎఫెక్ట్.. ఆ ఉచిత పథకంపై తెలంగాణ సర్కార్ నీలినీడలు!
Advertisement

Fish Seed: చేప పిల్లల పంపిణీ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. మత్స్య సంపదను పెంచి, మత్స్యకారులకు జీవనోపాధి కల్పించాలన్న లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమం ఈ ఏడాది గాడి తప్పింది. ప్రభుత్వం రూ.116 కోట్లు కేటాయించినా.. సకాలంలో అధికారులు టెండర్లు నిర్వహించకపోవడం, ముందస్తు ప్రణాళిక కొరవడటం, జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడం వంటి కారణాలతో పంపిణీ ప్రక్రియపై అనిశ్చితి నెలకొంది. దాదాపు రూ.90 కోట్ల విలువైన చేప పిల్లల పంపిణీ నిలిచిపోయింది. మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం వెనుకంజ వేసింది. జిల్లాల నుంచి అందిన నివేదికల ఆధారంగానే పంపిణీపై నిర్ణయం తీసుకోవడం, క్షేత్రస్థాయి పరిస్థితులను ముందుగానే అంచనా వేయకపోవడం అధికారుల పనితీరుపై విమర్శలకు తావిస్తోంది.

ముందస్తు ప్రణాళిక ఏదీ?

చేప పిల్లల పంపిణీకి వర్షాకాలమే కీలకం. వర్షాలు కురిసి చెరువులు, కుంటలు, జలాశయాలు నీటితో నిండిన సమయంలో చేప పిల్లలను వదిలితే అవి పెరిగి పెద్దయ్యేందుకు తగిన వ్యవధి ఉంటుంది. ఇందుకోసం వర్షాకాలానికి ముందే జూలై, ఆగస్టులోనే టెండర్లు పిలిచి జలవనరుల వివరాలు సేకరించి, చేప పిల్లల అవసరాన్ని అంచనా వేసి, టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. సరఫరాదారులను ముందుగానే ఖరారు చేసి పంపిణీకి ఏర్పాట్లు చేయాలి. అయితే ఈసారి ఆ దిశగా సకాలంలో చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండర్ల నిర్వహణలో జాప్యం, జిల్లాల నుంచి వివరాల సేకరణలో ఆలస్యం, పంపిణీపై స్పష్టమైన కార్యాచరణ లేకపోవడంతో కీలక సమయం చేజారిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరి నిమిషంలో పరిస్థితిని సమీక్షించడం వల్ల ఆశించిన లక్ష్యాన్ని సాధించడం కష్టమవుతోందని పేర్కొంటున్నారు.

రూ.116 కోట్లు.. ఫలితం ఎంత?

Advertisement

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, చేపల ఉత్పత్తి పెంపు లక్ష్యంగా చేప పిల్లల పంపిణీ పథకానికి ప్రభుత్వం ఈ ఏడాది రూ.116 కోట్లు కేటాయించినట్లు సమాచారం. అయితే నిధులు కేటాయించినా వాటిని సద్వినియోగం చేయడంలో జాప్యం జరిగితే పథకం లక్ష్యం దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దాదాపు రూ.90 కోట్ల విలువైన చేప పిల్లల పంపిణీ నిలిచిపోయింది. సెప్టెంబర్ 28న వనపర్తిలో మంత్రి వాకిటిశ్రీహరి ఉచితచేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో చేపపిల్లల పంపిణీ చేపడతామని అధికారుల నివేదిక ప్రకారం తెలిపారు. అయితే అక్టోబర్ మాసం సైతం ముగుస్తుంది. అయినా చేపపిల్లల పంపిణీ ముందుకు సాగలేదు. అయితే ఎంత మేరకు పంపిణీ నిలిచిపోయింది? కేటాయించిన నిధుల్లో ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారు? మిగిలిన నిధుల వినియోగంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది? అన్న ప్రశ్నలకు అధికారులే స్పష్టం చేయాల్సి ఉంది. ఈ వివరాలను ప్రభుత్వం వెల్లడిస్తేనే పథకం అమలుపై వాస్తవ పరిస్థితి వెలుగులోకి వస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also read: సూపర్ ఎల్ నినో ఎఫెక్ట్.. మార్చి నాటికి భారత్‌లో 55 వేల మరణాలు.. కలవరపెడుతున్న గణాంకాలు!

ఎల్‌నినో ప్రభావంతో వెనుకడుగు?

Advertisement

వాతావరణ పరిస్థితులు చేప పిల్లల పంపిణీకి ప్రతిబంధకంగా మారుతున్నాయి. ఎల్‌నినో ప్రభావం వర్షపాతంపై చూపే ప్రభావంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జలవనరుల్లో నీటి నిల్వల పరిస్థితిని అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నీరు సరిపడా లేని చెరువుల్లో చేప పిల్లలను వదిలితే అవి చనిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా ప్రభుత్వ నిధులు వృథా కావడంతోపాటు మత్స్యకారులకు ఆశించిన ఆదాయం లభించదు.ఈ నేపథ్యంలో నీటి నిల్వలు తక్కువగా ఉన్న జలవనరుల్లో పంపిణీని చేపట్టకూడదన్న నిర్ణయం సమంజసమే అయినా.. నీరు సమృద్ధిగా ఉన్న జలాశయాల్లోనూ పంపిణీ నిలిచిపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నీటి లభ్యత ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడైనా పంపిణీ చేపట్టేలా ప్రత్యామ్నాయ కార్యాచరణ ఎందుకు రూపొందించలేదని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు. రోజురోజుకు చెరువులు, కుంటలతో పాటు ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. మరో రెండునెలలు మాత్రమే ఈ నీరు ఉంటుంది అధికారుల నుంచి నివేదికలు అందినట్లు సమాచారం. చేప పిల్లల పంపిణీపై జిల్లాల నుంచి అందిన నివేదికల ఆధారంగానే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది.

కార్మికుల ఉపాధిపైనా ప్రభావం

చేప పిల్లల పంపిణీ నిలిచిపోవడం వల్ల మత్స్యకారులతోపాటు ఈ రంగంపై ఆధారపడిన ఇతర వర్గాల ఉపాధిపైనా ప్రభావం పడుతుంది. చేప పిల్లల ఉత్పత్తి, పెంపకం, రవాణా, జలాశయాల్లో విడుదల వంటి పనుల్లో పాల్గొనే కార్మికులకు పనిదినాలు తగ్గనుంది. చేప పిల్లల పెంపక కేంద్రాలు, సరఫరాదారులు, రవాణా సిబ్బంది కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం నిధులు కేటాయించినా వాటి ప్రయోజనాలు క్షేత్రస్థాయిలో అందకపోవడంపై మత్స్యకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ఎప్పుడు వస్తుందో, చేప పిల్లల పంపిణీకి ఎలాంటి ఏర్పాట్లు చేయాలో ముందుగానే తెలిసినా అధికారులు ఎందుకు అప్రమత్తం కాలేదని ప్రశ్నిస్తున్నారు. టెండర్ల ప్రక్రియను సకాలంలో పూర్తి చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని పేర్కొంటున్నారు.నీరు లేని జలవనరుల్లో పంపిణీ చేపట్టకపోవడాన్ని తప్పుపట్టడం లేదని, అయితే అనువైన ప్రాంతాల్లోనూ కార్యక్రమాన్ని నిలిపివేయడాన్ని ప్రశ్నిస్తున్నామన్నారు.

ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి..

పంపిణీకి అనువైన జలవనరులను గుర్తించి, నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తూ సాధ్యమైన ప్రాంతాల్లో చేప పిల్లలను వదిలేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. టెండర్ల ప్రక్రియలో జాప్యానికి కారణాలను సమీక్షించి, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ముందస్తు కార్యాచరణ రూపొందించాల్సి ఉంది. మత్స్యకారుల సంక్షేమం కోసం ఉద్దేశించిన పథకం అధికారుల సమన్వయలోపంతో నీరుగారకుండా చూడాలనివాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం ఒక కారణమైతే, ముందస్తు ప్రణాళికలో లోపాలు మరో కారణంగా మారకూడదని,ఇప్పటికైనా సమగ్ర సమీక్ష నిర్వహించి వచ్చే ఏడాదిఅయినా ముందస్తు చర్యలు చేపట్టిపంపిణీ చేపడితే మత్స్యకారులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఆదిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందా? లేదా? అనేదిచూడాలి.

Also read: పంట పొలాల్లో మొసలి నానాహంగామా.. రైతులు ఎలా పట్టేశారు? మెదక్ జిల్లాలో ఘటన

Tags

Related News

నాగ్‌పూర్‌లో బీజేపీకి ఘోర పరాజయం.. మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు!

ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లపై.. తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ!

మేడ్చల్లో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా.. జీరో ఫెటాలిటీ డిస్ట్రిక్ట్ పథకం!

శ్రీచైతన్య కాలేజీలో దారుణం కొట్టుకున్న విద్యార్థులు.. ఒకరి పరిస్థితి విషమం!

పంట పొలాల్లో మొసలి నానాహంగామా.. రైతులు ఎలా పట్టేశారు? మెదక్ జిల్లాలో ఘటన

రూటు మార్చిన కొండా సురేఖ.. కేటీఆర్‌కు క్షమాపణలు, జగన్ సలహాతోనే! జాయినింగ్ ఎప్పుడు?

నిరుద్యోగులకు పండగ.. ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC, శుక్రవారం నుంచే..

Big Stories

Advertisement
×