E-Paper
Advertisement

పిల్లలు పుట్టరని తెలిసి షాకింగ్ డెసిషన్… దత్తత తీసుకోవాలనుకుంటే ఇదెక్కడి దారుణం ?

పిల్లలు పుట్టరని తెలిసి షాకింగ్ డెసిషన్… దత్తత తీసుకోవాలనుకుంటే ఇదెక్కడి దారుణం ?
Advertisement

Romantic Drama OTT: జీవితంలో భాగస్వామితో హ్యాపీగా ఉండాలని కోరుకునే ప్రతి జంటకు కుటుంబం, పిల్లలు ఎంతో ముఖ్యం. అయితే పిల్లలను కనాలనే విషయంలో ఇద్దరి ఆలోచనలు ఒకేలా లేకపోతే… అసలు పిల్లలే పుట్టరు అనే పిడుగులాంటి వార్త తెలిస్తే… బయటకు ఎంత సంతోషంగా కనిపించినా, లోలోపల కుంగిపోతారు. సరిగ్గా ఇలాంటి సున్నితమైన అంశాన్ని స్పృశిస్తూ వచ్చిన ఇటాలియన్ సినిమా ‘యూ, మీ, అస్’ (You, Me, Us). ఓ బిడ్డను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్న జంట జీవితంలో ఎదురయ్యే మార్పులు, వారి మధ్య బయటపడే విభేదాలు ఈ కథలో కీలకం. మరి ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనేది తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

సిమోనే, లూసియా ఇద్దరూ ప్రేమికులు. అయితే ఇద్దరి వ్యక్తిత్వాలు, జీవితాన్ని చూసే విధానం పూర్తిగా భిన్నంగా ఉంటాయి. సిమోనే పద్ధతిగా జీవించడానికి ఇష్టపడతాడు. కుటుంబ సంప్రదాయాలు, నియమాలు అతడికి ముఖ్యం. లూసియా మాత్రం స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటుంది. ఇతరులు చెప్పిన పద్ధతుల్లోనే జీవించాలనే ఆలోచన ఆమెకు నచ్చదు. ముఖ్యంగా తల్లి కావడం అంటే స్వేచ్ఛను కోల్పోవడం అనే ఆలోచనలోనే ఉంటుంది ఆమె.

Advertisement

ఇద్దరి మధ్య ఇలాంటి తేడాలు ఉన్నప్పటికీ వారి ప్రేమ మాత్రం బలంగానే ఉంటుంది. చిన్న చిన్న గొడవలు వచ్చినా, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతుంటారు. అయితే ఒకానొక సమయంలో ఈ జంటకు పిల్లలు పుట్టరన్న విషయం బయటపడుతుంది. అందుకే ఓ బిడ్డని దత్తత తీసుకోవాలి అనుకుంటారు. తల్లిదండ్రులుగా మారే ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత తమలో దాగి ఉన్న భయాలు, కోరికలు, విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఇప్పటివరకు ప్రేమతో సర్దుకుపోయిన విషయాలే ఇప్పుడు గొడవగా మారతాయి.

అలాగే దత్తత ప్రక్రియలో ఎదురయ్యే ఛాలెంజెస్ ఈ జంటను తెగ ఇబ్బంది పెడతాయి. ఎందుకంటే అక్కడ దత్తత తీసుకోవడంపై కఠినమైన రూల్స్ ఉంటాయి. మరి వాటన్నింటినీ దాటుకుని ఈ జంట తల్లిదండ్రులు అయ్యారా ? అనుకున్నట్టే బిడ్డను దత్తత తీసుకున్నారా ? చివరికి ఏమైంది ? అన్నది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

ఓటీటీలో ఎక్కడ చూడాలి ?

Advertisement

‘యూ, మీ, అస్’ సినిమా అక్టోబర్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇది ఇటాలియన్ భాషలో రూపొందిన సినిమా. తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. ఈ చిత్రానికి డానియెలే లుకెట్టి (Daniele Luchetti) దర్శకత్వం వహించారు. సిమోనే పాత్రలో ఎలియో జర్మానో (Elio Germano), లూసియా పాత్రలో మారియా కియారా జన్నెట్టా (Maria Chiara Giannetta) నటించారు. అన్నా బొనాయుటో (Anna Bonaiuto), ఇలారియా స్పాడా (Ilaria Spada), కాటెరీనా గుజ్జాంటి (Caterina Guzzanti), దజానా రోంచియోనే (Dajana Roncione), ఫిలిప్పో నిగ్రో (Filippo Nigro) తదితరులు ఇతర పాత్రల్లో కనిపిస్తారు.

Read Also: రేసింగ్ స్టార్‌తో మెకానిక్ ఫేక్ ఎంగేజ్‌మెంట్‌… ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్ తెలుగులో

Tags

Related News

ఫ్రైడే ఓటీటీలోకి ఏకంగా 12 సినిమాలు… అన్నీ తెలుగులోనే… మిస్ అవ్వకూడని సినిమాలు ఇవే

ప్రేయసిని వదిలి పారిపోయిన డాక్టర్ కు పరేషాన్ చేసే ట్విస్ట్… కొరియన్ మెడికల్ మాస్టర్ పీస్ స్పై థ్రిల్లర్

డాక్టర్లకే అంతుచిక్కని మెడికల్ మిస్టరీ… ఓటీటీలో తెలుగులో వచ్చేసిన మైండ్ బ్లాక్ మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్

శివుడిని భర్తగా పొందాలనే పార్వతీ దేవి పట్టుదల… శివపత్ని ఉగ్రరూపం ఇప్పుడు ఓటీటీలో

రేసింగ్ స్టార్‌తో మెకానిక్ ఫేక్ ఎంగేజ్‌మెంట్‌… ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్ తెలుగులో

లాటరీ తెచ్చే తిప్పలు… మనసారా నవ్వుకునే క్లీన్ వెబ్ సిరీస్… నాన్‌స్టాప్ కామెడీ హంగామా

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న రాజమౌళి కొడుకు మూవీ!

Big Stories

Advertisement
×