BigTV English
Advertisement

Tulsi For Skin: తులసి ఆకులను ఇలా వాడితే.. మెరిసే చర్మం మీ సొంతం

Tulsi For Skin: తులసి ఆకులను ఇలా వాడితే.. మెరిసే చర్మం మీ సొంతం

Tulsi For Skin: అందమైన మచ్చలేని ముఖం కలిగి ఉండాలనేది ప్రతి ఒక్కరి కోరిక. దీని కోసం చాలా డబ్బులు ఖర్చుచేసి మార్కెట్‌లో వివిధ రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కొని వాడుతుంటారు. వీటిని వాడటం వల్ల పెద్దగా ఫలితం ఉండదు. అంతే కాకుండా డబ్బు కూడా ఖర్చు అవుతుంది. ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న కొన్ని పదార్థాలతో కూడా ముఖాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. తులసి ముఖ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. తులసి మొక్క మచ్చలేని మెరిసే చర్మాన్ని అందిస్తుంది.మరి గ్లోయింగ్ స్కిన్ కోసం తులసిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.


చర్మానికి తులసి ప్రయోజనాలు:

అందమైన మెరిసే చర్మాన్ని పొందడానికి తులసి ఆకులు చాలా బాగా సహాయపడతాయి.తులసిలో ఉండే యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ లక్షణాలు మొటిమలను తగ్గించడంలో చాలా సహాయపడతాయి. తులసిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. ఇదే కాకుండా, తులసిలో యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది ఫైన్ లైన్స్, ముడతలు వంటి అకాల వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది.


గ్లోయింగ్ స్కిన్ కోసం తులసి ఫేస్ ప్యాక్ :
కావలసినవి:
తులసి ఆకులు పొడి- 2 టీ స్పూన్లు
పసుపు- 1/2 టీ స్పూన్
పెరుగు- 1 టేబుల్ స్పూన్
రోజ్ వాటర్- 1 టేబుల్ స్పూన్
తేనె- 1 టీ స్పూన్

తయారీ విధానం: పైన చెప్పిన మోతాదుల్లో అన్ని పదార్థాలను తీసుకుని ఒక గిన్నెలో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15- 20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా వారానికి రెండుసార్లు అప్లై చేయడం వల్ల మీ చర్మం మునుపటి కంటే కాంతివంతంగా మారడం ప్రారంభమవుతుంది. ఇదే కాకుండా, పిగ్మెంటేషన్ , చిన్న చిన్న మచ్చలు వంటి సమస్యలలు కూడా దూరం అవుతాయి.

తులసితో టోనర్ తయారీ:

చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండాలంటే ముఖం కడుక్కున్న తర్వాత టోనర్ అప్లై చేయడం చాలా ముఖ్యం. మార్కెట్ నుంచి టోనర్ కొనుగోలు చేయడానికి బదులుగా తులసి ఆకులతో అద్భుతమైన టోనర్‌ను తాయరు చేసుకోవచ్చు.దీనిని తయారు చేయడానికి ఒక గ్లాసు నీటిలో 10 నుండి 12 తాజా తులసి ఆకులను వేసి మరిగించాలి. ఈ నీరు సగానికి తగ్గగానే స్ప్రే బాటిల్‌లో నింపి నిల్వ చేసుకోవాలి. దీనిని మీ ముఖం కడిగిన తర్వాత పూర్తిగా స్ప్రే చేయండి. మెరిసే చర్మం కోసం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

మొటిమల కోసం స్పాట్ రిడక్షన్ ప్యాచ్ :

మీ ముఖంపై ఎక్కడైనా మొటిమలు ఉంటే వాటిని వీలైనంత త్వరగా వదిలించుకోవాలనుకుంటే, మీరు తులసిని వాడవచ్చు. దీని కోసం, కొన్ని తాజా తులసి ఆకులను మెత్తగా పేస్ట్ చేయండి. ఇప్పుడు దానిలో చిటికెడు పసుపు వేసి మీకు మొటిమలు ఉన్న చోట అప్లై చేయండి. తరువాత 15 నిమిషాలు ఆగి వాష్ చేయండి. ఇలా తరుచుగా చేయడం వల్ల ముఖంపై మొటిమలు చాలా వరకు తగ్గిపోతాయి. అంతే కాకుండా ముఖం కాంతివంతగా మారుతుంది.

Also Read: ఇలా చేస్తే.. అమ్మాయిలే అసూయపడే అందం మీ సొంతం

తులసితో యాంటీ యాక్నే జెల్:
తులసి ఆకుల నుండి మీ కోసం యాంటీ-యాక్నే జెల్‌ను తయారు చేసుకోవచ్చు. దీని కోసం, తులసి ఆకుల పేస్ట్‌ను తయారు చేసి అందులోఒక చెంచా అలోవెరా జెల్‌ వేసి కలపండి. దీన్ని రాత్రిపూట మీ ముఖం కడుక్కున్న తర్వాత ఉపయోగించండి. ఇది మచ్చలేని మెరిసే చర్మాన్ని పొందడంలో మీకు చాలా సహాయపడుతుంది.

తులసి ఆకులతో తెల్లటి చర్మం:
ప్రతిరోజు ఉదయం మీ ముఖానికి తులసి ఆకులను రుద్దండి. ఇది సులభమైన, చాలా ప్రభావవంతమైన పద్ధతి. ఇలా రోజు చేయడం వల్ల క్లీన్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది. దీంతో పాటు, మీరు ప్రతిరోజు ఉదయం వాకింగ్ చేసేటప్పుడు కొన్ని తులసి ఆకులను కూడా నమలండి. ఇది మీ ఆరోగ్యం, చర్మం రెండింటికీ మేలు చేస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

White Bread: బ్రెడ్ తింటున్నారా ? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివే !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు.. క్యారెట్ తింటే జరిగేది ఇదే !

Idli Chaat: ఇడ్లీ మిగిలిపోయిందా? ఇలా ఇడ్లీ చాట్ చేసేయండి, క్రంచీగా అదిరిపోతుంది

Katte Pongali: నోటిలో పెడితే కరిగిపోయేలా కట్టె పొంగలి ఇలా చేసేయండి, ఇష్టంగా తింటారు

Kind India: కొత్త ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ తో కైండ్ ఇండియా.. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే?

Darkness Around The Lips: పెదాల చుట్టూ నలుపు తగ్గాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు !

Moringa Powder: బరువు తగ్గడానికి.. మునగాకు పొడిని ఎలా వాడాలో తెలుసా ?

Arthritis Pain: కీళ్ల నొప్పులా ? వీటితో క్షణాల్లోనే.. పెయిన్ రిలీఫ్

Big Stories

×