BigTV English

Pushpa 2 – Thaman : నేను పుష్ప2 కి పని చేయడం లేదు… రిలీజ్ ముందు బాంబ్ పేల్చిన తమన్..

Pushpa 2 – Thaman : నేను పుష్ప2 కి పని చేయడం లేదు… రిలీజ్ ముందు బాంబ్ పేల్చిన తమన్..

 Pushpa 2 – Thaman :ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తాజాగా నటిస్తున్న చిత్రం పుష్ప -2(Pushpa 2). భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోవైపు రూ.1000 కోట్ల టార్గెట్ తో బరిలో దిగబోతున్నారు అల్లు అర్జున్. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పుడు కలెక్షన్స్ తో పక్కా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంటుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇక అందులో భాగంగానే సినిమా నుండి ఒక్కొక్క అప్డేట్ ను ఒక్కొక్కరు బయటకు వదులుతూ సినిమాపై హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.


జాతర సీక్వెన్స్ హైలెట్..

ఇకపోతే ఇటీవలే ప్రముఖ నటుడు క్రాంతి ఈ సినిమాలో.. ఒక్క జాతర సీక్వెన్స్ కోసమే ఏకంగా రూ.60 కోట్లకు పైగా ఖర్చుపెట్టినట్లు, రిహార్సల్స్ కోసం అదనంగా మరో రూ.14 కోట్లు ఖర్చుపెట్టినట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఒక్క జాతర సీక్వెన్స్ కోసమే ఈ రేంజ్ లో ఖర్చుపెట్టారు అంటే సినిమా కోసం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదని అర్థమవుతోంది. అంతేకాదు క్లైమాక్స్ కోసం కూడా భారీగా ఖర్చుపెట్టినట్లు క్రాంతి వెల్లడించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ని వదిలారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్.తమన్(S.S.Thaman).


చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేస్తున్నారు..

తాజాగా ఒక ఈవెంట్ లో పాల్గొన్న తమన్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నేను కూడా ఒక పార్ట్. అందులో చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేస్తున్నారు. అవుట్ పుట్ అయితే అదిరిపోయింది. సినిమా మామూలుగా లేదు. ఎడిటింగ్ రూమ్లో చూశాను. ఒక సినిమాలో నేను ఇంత హైప్ ఇచ్చింది ఒక పుష్ప – 2లో మాత్రమే. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఇక నా వరకు నేను చేయాల్సింది చేశాను” అంటూ తెలిపారు. ఏది ఏమైనా పుష్ప 2 మూవీ బాగా వస్తుంది అంటూ తమన్ తన మనసులో మాటగా చెప్పుకొచ్చారు.

పుష్ప -2 సినిమా విశేషాలు..

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని , వై. రవిశంకర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రష్మిక మందన్న (Rashmika Mandanna)హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఫహాద్ ఫాజిల్ , సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం ఎంతోమంది హీరోయిన్స్ ని పరిశీలించగా చివరికి యంగ్ బ్యూటీ, కన్నడ ముద్దుగుమ్మ శ్రీ లీల (Sree Leela) ఎంపికయింది. డాన్సింగ్ క్వీన్ గా పేరు దక్కించుకున్న ఈమె, ఈ సినిమా లో ఐటమ్ సాంగ్ కోసం రూ .2కోట్లు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తూ ఉండగా.. తమన్ తో పాటు ఇక చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు ఈ సినిమా కోసం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రూ.500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఈ సినిమా లాభాల్లో బన్నీ 28% వాటాగా తీసుకోబోతున్నట్లు సమాచారం.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×