BigTV English

Turmeric For Glowing Skin: పసుపుతో ఈ ఫేస్ ప్యాక్‌లు ట్రై చేశారంటే.. మీ అందం చూసి మీరే మురిసిపోతారు.

Turmeric For Glowing Skin: పసుపుతో ఈ ఫేస్ ప్యాక్‌లు ట్రై చేశారంటే.. మీ అందం చూసి మీరే మురిసిపోతారు.

Turmeric For Glowing Skin: అందమైన ముఖం, మచ్చలు, మొటిమలు లేకుండా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మంది చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తినడం వల్ల, బయట దుమ్మూ, ధూళి, కంటి నిండ నిద్ర లేకపోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం పార్లర్‌కు వెళ్లి.. వేలకు వేలు ఖర్చు చేసి రకరకాల ఫేసియల్స్ చేపిస్తుంటారు.


ఇవి కెమికల్స్‌తో తయారు చేసినవి గనుక వీటి వల్ల చర్మం డామేజ్ కావడం.. ఫేస్ బ్లాక్‌గా అయిపోవడం, ముఖంపై మచ్చలు మొటిమలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు నిత్యం యవ్వనంగా కనిపించాలంటే.. మన ఇంట్లోనే దొరికే పసుపుతో కొన్ని రకాల పదార్ధాలను కలిపి ఫేస్ ప్యాక్ ట్రై చేయండి. పసుపులో ముఖ కాంతిని పెంచే అనేక పోషకాలు ఉన్నాయి. పసుపును పూర్వం రోజుల నుంచి చర్మ సౌందర్యానికి ఉపయోగిస్తున్నారు. దీనిని వాడటం వల్ల ఎలాంటి చర్మ సమస్యలు ఉన్నా ఇట్టే తొలగిపోతాయి. కాబట్టి మీరు కూడా పసుపుతో ఇలా ట్రై చెయ్యండి. మంచి ఫలితం ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్దాలు..
పసుపు
అలోవెరా జెల్
విటమిన్ ఇ క్యాప్సూల్స్
రైస్ వాటర్
గ్లిజరిన్


తయారు చేసుకునే విధానం..
పార్లర్‌కి వెళ్లకుండా గోల్డెన్ ఫేసియల్స్‌లాగా మీ ఫేస్ ఎప్పుడూ బ్రైట్‌గా ఉండాలంటే.. ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి. ఇందుకోసం చిన్న బౌల్‌లో రెండు టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ తీసుకుని.. అందులో రైస్ వాటర్ ఒక స్పూన్, టీస్పూన్ గ్లిజరిన్, రెండు టేబుల్ స్పూన్ పసుపు, రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్ కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు ఫేస్‌కి అప్లై చేసి.. మరుసటి రోజు గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా ప్రతిరోజు చేస్తే.. చర్మంపై మచ్చలు, మొటిమలు తొలగిపోవడంతో పాటు.. ముఖం కాంతివంతంగా, యవ్వనంగా కనిపిస్తుంది. తయారు చేసుకున్న ఫేసియల్ క్రీము.. కొద్ది రోజులపాటు ఫ్రిజ్‌లో పెట్టి నిల్వ ఉంచుకోవచ్చు.

ముఖం కాంతివంతంగా ఉండటం కోసం మరొక చిట్కా.. ఇందుకోసం
కావాల్సిన పదార్ధాలు
వాజ్‌లైన్
బాదం ఆయిల్
నిమ్మరసం
పసుపు

తయారు చేసుకునే విధానం..
ముఖం కాంతివంతంగా, నిత్యం మెరిసిపోవాలంటే ఈ ఫేస్ ప్యాక్ చక్కగా పనిచేస్తుంది. ఇందుకోసం ముందుగా చిన్న బౌల్ తీసుకుని.. అందులో వాజ్‌లైన్ టీస్పూన్, బాదం ఆయిల్ టీస్పూన్, రెండు టేబుల్ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి గంట తర్వాత.. గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా ప్రతిరోజు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ టిప్స్ రెగ్యులర్‌గా ఫాలో అయితే మీ అందం చూసి మీరే మురిసిపోతారు.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

 

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×