BigTV English

Techie Suicide Work Pressure: పని ఒత్తిడి వల్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. పోలీసులు ఏం చెబుతున్నారంటే?..

Techie Suicide Work Pressure: పని ఒత్తిడి వల్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. పోలీసులు ఏం చెబుతున్నారంటే?..

Techie Suicide Work Pressure| చెన్నైకి చెందిన ఒక సాఫ్టేవేర్ ఉద్యోగి పని ఒత్తిడి కారణంగా డిప్రెషన్ కు లోనై ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతను కరెంటు వైరు తన శరీరానికి చుట్టుకొని తనకు తాను కరెంట్ షాక్ ఇచ్చుకున్నాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు.


వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రంలోని తెని జిల్లాకు చెందిన కార్తికేయన్ అనే 38 ఏళ్ల్ యువకుడు గత 15 ఏళ్లుగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి వివాహమైంది. చెన్నైలోనే ఇల్లు తీసుకొని నివసం ఉంటున్నాడు. ఇంట్లో అతని భార్య, ఇద్దరు పిల్లలు (10, 8) ఉంటారు. అయితే సెప్టెంబర్ 16, 2024 సోమవారం కార్తికేయన్ భార్య జయరాణి పిల్లలతో కలిసి తిరునల్లూర్ గుడికి వెళ్లింది. ఆ దేవాలయం చెన్నై నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడికి జయరాణి తల్లిదండ్రులు కూడా వెళ్లారు. కానీ కార్తికేయన్ మాత్రం తనకు ఆఫీసు పనిఉందని ఇంట్లోనే ఉండిపోయాడు.

జయరాణి తన పిల్లలను తీసుకొని దేవాలయానికి వెళ్లాక అక్కడి నుంచి తన పుట్టింటి వెళ్లింది. నాలుగు రోజులు అక్కడే ఉండి, తిరిగి వచ్చింది. కానీ పిల్లలు ఇంకా తమ అమ్మమ్మ ఇంట్లోనే ఉన్నారు. అయితే జయరాణి గురువారం సెప్టెంబర్ 19, 2024న ఇంటికి తిరిగి వచ్చినప్పుడు.. ఎంత సేపు డోర్ బెల్ కొట్టినా ఎవరూ తీయలేదు. డోర్ లోపలి నుంచి లాక్ చేసి ఉంది. ఆటోమెటిక్ లాక్ కావడంతో జయరాణి వద్ద ఒక స్పేర్ కీ ఉంది. దాంతో జయరాణి లాక్ ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్లింది. ఇంట్లో ఏదో దుర్వాసన వస్తోంది.


Also Read: 5 ఏళ్ల పాప ప్రైవేట్ భాగాలు, నోటిపై వాతలు పెట్టిన మహిళ.. ఆ పాప ఏం చేసిందంటే?..

ఏంటని? చూడగా… తన భర్త కార్తికేయన్ గదిలో నుంచి ఆ దుర్వాసన వస్తోంది. కార్తికేయన్ గదిలో కిందపడిపోయి ఉన్నాడు. అతని శరీరమంతా నల్లబడిపోయింది. గదిలో అంతా కాలిపోయిన వాసన. కార్తికేయన్ శరీరానికి కరెంటు వైర్లు చుట్టుకొని ఉన్నాయి. ఇదంతా చూసి జయరాణి షాక్ కు గురైంది. వెంటనే తన తల్లిదండ్రులకు ఫోన్ చేయగా.. వారు పోలీసులకు, ఆంబులెన్స్ కు ఫోన్ చేయాలని సూచించారు.

జయరాణి పోలీసులకు ఫోన్ చేయగా.. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ప్రాథమిక విచారణ చేసిన తరువాత పోలీసులు.. కార్తికేయన్ మరణం సహజం కాదని తేల్చారు. అతను పని ఒత్తిడి కారణంగా డిప్రెషన్ లో ఉండేవాడని.. ఆఫీసులో అతని స్నేహితులు ద్వారా తెలిసిందని చెప్పారు. కార్తికేయన్ మరణం కేసులో పోలీసులు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఇటీవలే ఒక 26 ఏళ్ల యువతి పని ఒత్తిడి కారణంగా చనిపోయింది. ఆమె సిఏ ఉద్యోగం చేసేది. ప్రముఖ ఆడిటింగ్ అండ్ చార్టర్డ్ అకౌటింగ్ కంపెనీ అయిన ‘అర్ నెస్ట్ అండ్ యంగ్ ‘ లో ఆమె తొలి ఉద్యోగంలో చేరగా.. టార్గెట్స్ పూర్తి చేసే ఒత్తిడిలో ఆమె రోజుకు 20 గంటలకు పైగా పనిచేసేదని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. ఆమె మృతిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. కేంద్ర ఏజన్సీలు ఆమె కేసులో విచారణ చేపట్టారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×