Watermelon Types: వేసవి మొదలయ్యింది. ఎండలు మండుతున్నాయి. సూర్యుడి భగభగల నుంచి తట్టుకోవాలంటే ఒంటికి చలువ చేసే పండ్లు, కూరగాయాలు తీసుకోవాలంటారు నిపుణులు. కూరగాయల మాట ఎలా ఉన్నా, పండ్లు అనగానే పుచ్చకాయలు ఠక్కున గుర్తొస్తాయి. వేసవిలో ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి. రైతులు పండించిన పుచ్చకాయలను నేరుగా తీసుకొచ్చి రహదారల పక్కనే పెట్టి అమ్ముతుంటారు. ఎండాకాలంలో ఇవి మంచి ధర పలుకుతాయి. కొంత మంది పుచ్చకాయలు రంగు వచ్చేలా రసాయనాలు అందిస్తారు. కల్తీ అని తెలియక కొనుగోలు చేసి చాలా మంది అనారోగ్యం పాలవుతుంటారు. సహజమైన రంగు, రుచి ఉంచే పుచ్చకాయలను సింపుల్ టిప్స్ తో తెలుసుకోవచ్చు. ఇంతకీ, ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
⦿ చుడ్డానికి ఎలా ఉండాలి?
సాధారణంగా పుచ్చకాయలు పొడవైనవి కాకుండా, గుండ్రటి వాటిని తీసుకునేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే, గుండ్రని పుచ్చకాయలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. పొడవైన వాటిలో ఎక్కువగా నీరు ఉంటుంది. గుండ్రటి పుచ్చకాయలు చక్కెరలను సమానంగా పంపిణీ చేస్తాయి. పొడవైన కాయలు అన్ని చోట్లకు సమానంగా చక్కెరను పంపిణీ చేయలేవు. సో, ఇకపై మీరు పుచ్చకాయలు కొనే సమయంలో గుండ్రగా ఉండేవాటిని కొనుగోలు చేయండి.
⦿ ఎలాంటి మచ్చలు ఉండాలి?
పుచ్చకాయల మీద ఉన్న మచ్చలను ఆధారంగానూ వాటి రంగు, రుచిని తెలుసుకునే అవకాశం ఉంటుంది. తెల్లటి ప్యాచ్ కాకుండా పసుపు ఫీల్డ్ ప్యాచ్ ఉన్న పుచ్చకాయలను ఎంచుకోవడం మంచిది. పుచ్చకాయలు నేలపై ఉన్న చోట పసుపు మచ్చ ఏర్పడుతుంది. అది పండితే మచ్చ ముదురు రంగులోకి మారుతుంది. అందువల్ల, పసుపు ప్యాచ్ ఉంచే ఆ కాయలో చక్కెర ఎక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ తెల్లటి ప్యాచ్ ఉంటే, కాయ పండక ముందే కోసినట్లు గుర్తుంచుకోవాలి.
⦿ పుచ్చకాయ మీద ఎలాంటి గీతలు ఉండాలి?
పుచ్చకాయల మీద ఉన్న గీతలు కూడా రంగు, రుచికి సంబంధించిన సంకేతాలను అందిస్తుంది. వీలైనంత వరకు దగ్గరగా లైన్లు ఉన్న పుచ్చకాయలను ఎంచుకోవాలి. పుచ్చకాయపై ఉన్న లైన్లు పండు అభివృద్ధి ఎలా చెందింది అనే విషయాలను సూచిస్తుంది. దగ్గరగా ఉన్న లైన్లు పుచ్చకాయలు సమగ్రంగా అభివృద్ధి చెందినట్లు చూపిస్తాయి. మెరుగైన చక్కెర పంపిణీని కలిగి ఉంటుంది. సో, పుచ్చకాయల మీద ఉన్న గీతలు ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిదిగా గుర్తుంచుకోవాలి. అదే సమయంలో బరువుగా ఉందో? లేదో? చూడాలి. బరువుగా ఉన్న పుచ్చకాయ ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించాలి. రసాయనాలతో పండించిన పుచ్చకాయలు రసాయనాలతో పండించినట్లుగా గుర్తుంచుకోవాలి. వీలనైంత వరకు తేలికగా ఉన్న పండ్లను కొనకపోవడమే మంచిది.
వేసవిలో పుచ్చకాయలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. పుచ్చకాయ రుచితో పాటు పుష్కలంగా పోషకాలను కలిగి ఉంటాయి. గుండెజబ్బులు, మధుమేహం సహా కొన్ని రకాల క్యాన్సర్ లను దూరం చేస్తుంది. వాటర్ మిలాన్ లో అధికశాతం నీరు ఉండటం వల్ల ఈజీగా కడుపు నిండటంతో పాటు పైబర్ అధికంగా ఉంటుంది. వేసవిలో వడదెబ్బ లాంటి సమస్యల నుంచి రక్షణ కలిపిస్తాయి.
Read Also: గర్భిణీలకు ఏడో నెలలోనే ఎందుకు సీమంతం చేస్తారంటే.. ఇదీ అసలు విషయం!