గాయాలు, శస్త్ర చికిత్స వంటి వాటి నుంచి కోలుకునేందుకు ఎక్కువ మంది సున్నితమైన వ్యాయామాలు చేస్తారు. అలాంటి వాటిల్లో ఎంతోమంది ఇంట్లోనే ట్రెడ్ మిల్ పై నడుస్తూ ఉంటారు. ఇప్పుడు ట్రెడ్ మిల్‌లో మరొక కొత్త ట్రెండ్ వచ్చింది. నీటి అడుగున ట్రెడ్ మిల్‌పై వాకింగ్ చేయడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
శరీరాన్ని ఒత్తిడి నుంచి నొప్పుల వరకు నయం చేసే శక్తి అండర్ వాటర్ ట్రెడ్ మిల్ పై చేసే వ్యాయామానికి ఉంటుందని అంటున్నారు. అండర్ వాటర్ ట్రెడ్మిల్ తయారు చేసేందుకు నీటితో నిండిన స్విమ్మింగ్ పూలు లేదా ట్యాంకులో పెడతారు. దానిపై జాగింగ్, వాకింగ్ వంటివి చేయిస్తారు. ఆ నీరు సాధారణంగా వెచ్చగానే ఉంటుంది. శరీరానికి ఓదార్పునిచ్చేలా ఉంటుంది. ఇది మీ కండరాలని విశ్రాంతి తీసుకోవడానికి సహాయం చేస్తుంది. ట్రెడ్‌మిల్ వేగం, నీటి లోతును మీ అవసరాలకు తగ్గట్టు అనుగుణంగా మారుస్తూ ఉంటారు. అయితే ఇది సురక్షితమైన వ్యాయామంగానే అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తారు.
అండర్ వాటర్ ట్రెడ్మిల్ వల్ల లాభాలు
నీటి అడుగున ట్రెడ్మిల్ పై నడవడం వల్ల ఎన్నో ప్రభావవంతమైన ప్రయోజనాలు కలుగుతాయి. కీళ్లు కండరాలపై ఒత్తిడి తక్కువగా పడుతుంది. ఎందుకంటే నీరు మిమ్మల్ని తేలికగా మారుస్తుంది. చాతి వరకు నీటిలో మీరు ఉంటారు. అది మీ శరీర బరువుని 80 శాతం వరకు తట్టుకుంటుంది. దీనివల్ల మీకు వీపుపై ఒత్తిడి తక్కువ పడుతుంది. నొప్పి లేకుండానే మీరు కదలవచ్చు. కాబట్టి ఆర్థరైటిస్ కీళ్ల నొప్పులు, ఇతర గాయాలతో బాధపడుతున్న వారికి అండర్ వాటర్ ట్రెడ మిల్ ఎంతో ఉపయోగపడుతుంది.
నీటిలో నడవడం భూమిపై నడవడం కంటే కష్టం. ఎందుకంటే నీరు నిరోధకతను సృష్టిస్తుంది. ఈ నిరోధకత మీ కండరాలకు పని చెబుతుంది. ఇది మీ శరీరాన్ని బలోపేతం చేసే ఒక వ్యాయామం అని చెప్పుకోవాలి. నీటిలో మీరు పడిపోయే అవకాశం చాలా తక్కువ సమతుల్యతను కూడా మెరుగుపరచడంలో నీటిలోని చేసే ఈ వ్యాయామం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఏదైనా శస్త్ర చికిత్స నుండి కోలుకోవాలని ఉంటే, స్థిరంగా నిలబడాలి అనుకుంటే అండర్ వాటర్ ట్రెడ్మిల్ ఎంతో ఉపయోగపడుతుంది.
వెచ్చిన నీరు, దాని నుంచి వచ్చే సున్నితమైన ఒత్తిడి మీ కాలిలో, కీళ్ల వాపులను తగ్గిస్తుంది. కండరాల నొప్పిని కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. మీ కదలికలను సౌకర్యంతంగా మారుస్తుంది. ముఖ్యంగా మోకాలి శస్త్ర చికిత్స చేయించుకున్న వారికి, ఎముక విరిగినవారికి, చీలమండ బెణుకు అయిన వారికి నీటి అడుగున ట్రెడ్ మిల్ పై వాకింగ్ చేయడం అనేది ఎంతో మంచిది.
అండర్ వాటర్ వాడుతున్న వారి సంఖ్య ఇప్పటికి ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా అథ్లెట్లు అంటే క్రీడాకారులు దీన్ని అధికంగా వినియోగిస్తారు. వీరికి గాయాలు ఎక్కువగా తగులుతూ ఉంటాయి. వాటి నుండి కోలుకోవడానికి ఈ అండర్ వాటర్ ట్రెడ్ మిల్‌ను వాడుతున్నారు. వృద్ధులకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. వారు ఫిట్ గా ఉండేందుకు, శరీరం సమతుల్యంగా ఉండేందుకు ఈ అండర్ వాటర్ ట్రెడ్ మిల్ ఉపయోగపడుతుంది.
అండర్ వాటర్ ట్రెడ్ మిల్ పై వ్యాయామం చేయాలనుకునేవారు ముందుగా వైద్యులతో మాట్లాడి.. దాని గురించి తెలుసుకోవాలి. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు మీరు అండర్ వాటర్ ట్రెడ్మిల్ పై వాకింగ్ లేదా రన్నింగ్ చేయవచ్చో లేదో చెబుతారు. దీన్ని జల చికిత్స అనుకోవచ్చు. అలాగే చాలా ఫిజికల్ థెరపీ క్లినిక్ లలో ఇలాంటి అండర్ వాటర్ ట్రెడ్ మిల్ ఉంటాయి. అలాంటి వాటిని వెతికి మీరు అక్కడికి వెళ్లి వ్యాయామం చేయవచ్చు. వారానికి కొన్ని సెక్షన్లు మాత్రమే ఏర్పాటు చేస్తారు.
ఎంతసేపు చేయాలి?
అండర్ వాటర్ ట్రెడ్ మిల్ పై వాకింగ్ లేదా రన్నింగ్ చేసేందుకు మీరు సరైన దుస్తులు ధరించాలి. ఈత దుస్తులను కూడా వేసుకోవచ్చు. అలాగే మీ చాతి వరకు వచ్చేలాగా నీటి లోతును చూసుకోవాలి. మీ లక్ష్యం లేదా మీ ఫిట్నెస్ స్థాయిని బట్టి పావుగంట నుంచి అరగంట వరకు మాత్రమే దీనిని ఉపయోగించాలి. వెచ్చని నీటిలోనే ఈ సెషన్స్ నడుస్తాయి. కాబట్టి మీకు విశ్రాంతిగా అనిపిస్తుంది. భూమిపై చేసిన వ్యాయామంతో పోలిస్తే నీటిలో చేసిన వ్యాయామంలో అలసట తక్కువగా ఉంటుంది.