Nayanthara: నయనతార (Nayanthara)..సౌత్ ఇండస్ట్రీలోనే లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. పిల్లలు పుట్టాక కూడా చేతినిండా అవకాశాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం నయనతార.. చిరంజీవి , అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్లో రాబోతున్న ‘మెగా 157’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించి అధికారికంగా నయనతారను హీరోయిన్ గా పెట్టుకుంటున్నట్టు అనిల్ రావిపూడి కన్ఫామ్ చేశారు . ఇక చిరంజీవి (Chiranjeevi).. అనిల్ రావిపూడి సినిమా కోసం మొదటిసారి తన రూల్స్ బ్రేక్ చేసింది. అదేంటంటే.. ఎంత పెద్ద హీరో సినిమాలో నటించిన కూడా ప్రమోషన్స్ లో పాల్గొనదు. ప్రమోషన్స్ చేయదు. కానీ మొట్టమొదటిసారి చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా కోసం ఆమె సినిమా షూటింగ్లో పాల్గొనడానికంటే ముందే ప్రమోషన్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
నమ్మించి మోసం చేశారు – నయనతార
ఇక ఈ విషయం పక్కన పెడితే.. నయనతార వాళ్ళు నన్ను అసహ్యంగా చూపించి వాడుకున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి ఇంతకీ లేడీ సూపర్ స్టార్ ని మాయ చేసి మోసం చేసింది ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. నయనతార ఇప్పటివరకు ఎంతోమంది హీరోలతో జతకట్టింది. లేడి ఓరియంటెడ్ మూవీలలోనే కాకుండా స్టార్ హీరోలకు పర్ఫెక్ట్ జోడి అనిపించుకుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ సూర్య (Suriya) నటించిన ‘గజిని’ మూవీ లో సెకండ్ హీరోయిన్ గా చేసిన సంగతి మనకు తెలిసిందే.
చెప్పిందొకటి.. చూపించింది ఇంకోటి – నయనతార
మురగదాస్ (Muragadas) డైరెక్షన్లో వచ్చిన గజిని మూవీలో అసిన్ (Asin), నయనతారలు హీరోయిన్స్ గా నటించారు.ఇందులో నయనతారని సెకండ్ హీరోయిన్ గా చూపించారు. అయితే మొదట ఈ సినిమా స్టోరీ చెప్పినప్పుడు నయనతారకి వేరేలా చెప్పారట. చూపించేటప్పుడు మరోలా చూపించారట. అంతేకాదు ఈ సినిమాలో తన లుక్స్ ని చాలా అసహ్యంగా చూపించారని,అసలు తన పాత్రకి ప్రాధాన్యత కూడా లేదని, తక్కువ సమయం చూపించారు అంటూ ఈ సినిమా విడుదలయ్యాక ఓ ఇంటర్వ్యూలో నయనతార ఈ విషయం గురించి చెప్పుకొని బాధపడింది.
ఆ సినిమాలో చేసి తప్పు చేశాను – నయనతార
అంతేకాదు ముందు చెప్పింది ఒకటి తర్వాత చేసింది ఒకటి సినిమా విషయంలో నన్ను చాలా మోసం చేశారు.
ఇది నా కెరియర్ లోనే చెత్త సినిమా.. చెత్త పాత్ర.. నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు ఏదైనా ఉంది అంటే అది గజిని సినిమా(Gajini Movie) లో నటించడమే అంటూ నయనతార చెప్పుకొచ్చింది. దీంతో అప్పట్లో నయనతార మాట్లాడిన ఈ మాటలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. అయితే నయనతార లాగే చాలామంది హీరోయిన్లు కొన్ని సినిమాల్లో చేసి ఆ సినిమా చేసి తప్పు చేసాం అని అనుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అలా నయనతార కూడా తన జీవితంలో గజినీ సినిమా చేసి పెద్ద తప్పు చేశాను అని చాలాసార్లు బాధపడిందట. ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం మెగా 157(Mega 157) సినిమాతో రాబోతుంది.
ALSO READ:HHVM Trailer: హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్.. పవర్ స్టార్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?