BigTV English

Social Rules Everyone: సోషల్ రూల్స్ పాటిద్దాం..!

Social Rules Everyone: సోషల్ రూల్స్ పాటిద్దాం..!

 


Unspoken Social Rules Everyone Should Know
 

Unspoken Social Rules Everyone Should Know: మనిషి తోటి వారితో మెరుగైన మానవ సంబంధాలను ఏర్పరచుకోవటంలో మన వ్యవహార శైలి చాలా కీలకం. అది స్నేహితుడైనా, బంధువైనా పొరుగింటి మనిషైనా, ఆఫీసులో పనిచేసే తోటి ఉద్యోగి అయినా.. వారితో మనం వ్యవహరించే తీరును బట్టి వారితో మన సంబంధాలు ఆధారపడి ఉంటాయి. ఈ విషయంలో అందరూ గుర్తుంచుకోదగిన కొన్ని సోషల్ రూల్స్ గురించి తెలుసుకుందాం.

ఎవరికైనా సరే.. రెండుసార్లకు మించి అదేపనిగా కాల్ చేయొద్దు. మీ కాల్‌కు జవాబివ్వలేదంటే.. అవతలి మనిషి.. మరో ముఖ్యమైన పనిలో ఉన్నారని అర్థం. మీరు తీసుకున్న అప్పు ఎంత చిన్న మొత్తమైనా.. అవతలి వారు అడగక ముందే.. తిరిగివ్వాలి. అది మీ వ్యక్తిత్వానికి విలువను పెంచే పని. ఎవరైనా మీకోసం పార్టీ ఇస్తుంటే.. మెనూను డిసైడ్ చేయమని మిమ్మల్ని కోరితే.. అందులోని ఖరీదైన వంటకాలను ఎప్పుడూ ఆర్డర్ చేయవద్దు. వీలుంటే ఆ పనిని అవతలివారినే చేయమని కోరండి.


read more: సమ్మర్.. బైక్ రైడర్స్ ఈ జాగ్రత్తలు పాటించండి!

‘మీకింకా వివాహం కాలేదా? ఎందరు పిల్లలు? ఇంకా సొంతిల్లు కొనలేదా?’ వంటి ప్రశ్నలను ఎదుటివారిని అడగొద్దు. అవి వారి సమస్యలు. మీవి కావు! మీ ఇంటికి ఎవరైనా వస్తే.. వారు చిన్నవారైనా, పెద్దలైనా మీరే స్వయంగా తలుపు తీసి ఆహ్వానించండి. ఒకరి పట్ల మీరు చూపే సౌజన్యం వల్ల మీ హోదా తగ్గదు. మీరు స్నేహితులను జోక్ చేస్తే.. వారు దానికి ఇబ్బందిగా ఫీలయితే.. దానిని వెంటనే ఆపేయండి. ఎంత బెస్ట్‌ఫ్రెండ్ అయినా.. మళ్లీ ఆ పనిచేయొద్దు. ఎవరి గురించి అయినా నాలుగు మంచి మాటలు చెప్పాల్సి వస్తే.. అందరిముందూ చెప్పండి.

విమర్శించాల్సి వస్తే.. ఏకాంతంగా ఉన్నప్పడు మాత్రమే చెప్పండి. ఎదుటివారి శరీరం రంగు, బరువు గురించి మాట్లాడొద్దు. వీలుంటే.. ‘మీరు చాలా బాగున్నారు’ అని ప్రశంసించండి. ఎవరైనా వారి ఫోన్‌లో మీకు ఫోటో చూపించినప్పుడు.. అది మాత్రమే చూసి ఊరుకోవాలి తప్ప స్వైప్ చేయవద్దు. ఎందుకంటే ఆ తర్వాత ఏ ఫోటో వస్తుందో మీకు తెలియదు! మనం పనిని గౌరవించాలి. గౌరవం విషయంలో ఓ సీఈవో ఎంతో.. ఓ క్లీనర్‌ కూడా అంతే. మిమ్మల్ని అడిగే వరకు ఎప్పుడూ ఎవరికీ ఎలాంటి సలహా ఇవ్వొద్దు. ఫ్రెండ్ / కొలీగ్ మీకు ఆహారాన్ని ఆఫర్ చేస్తే.. మర్యాదగా ‘నో’ చెప్పండి. కానీ, రుచి లేదా వాసన చూశాక.. ‘నో’ చెప్పొద్దు. అలాచేస్తే మీరు వారిని అవమానించినట్లే!

Tags

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×