BigTV English
Advertisement

COVID-19: మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా వైరస్! వారం రోజుల్లో 350 మంది మృతి..

COVID-19: మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా వైరస్! వారం రోజుల్లో 350 మంది మృతి..

COVID-19: మరోసారి కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం వెయ్యికి పైగా కరోనా కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. గత వారంలో 752 కొత్త కేసులు నమోదైనట్లు పేర్కొంది. గతవారం అత్యధికంగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధిక సంఖ్యలో కొత్త ఇన్ఫెక్షన్లు నమోదైనట్లు వెల్లడించింది.


కేరళలో కొత్తగా 430 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం యాక్టివ్ కేసులు 430కి చేరుకున్నాయి. మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం, మహారాష్ట్రలో 209 యాక్టివ్ కేసులు ఉండగా..153 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ఆ తర్వాత గుజరాత్ లో 83, కర్ణాటకలో 47, ఉత్తరప్రదేశ్ లో 15 కేసులు, పశ్చిమ బెంగాల్ లో 12 కేసులు నమోదయ్యయాయి.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు.. వరుసగా పెరుగుతున్నాయి. అయితే తాజాగా నోయిడాలో 9 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గణాంకాలే కాదు, కరోనా మరణాలు కూడా మరోసారి భయాన్ని పెంచాయి. అమెరికాలో కోవిడ్ 19 విజృంభిస్తోంది. వందల్లో మరణాలు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా మరింత హానికరంగా మారిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ఇప్పటివరకు సగటున.. వారానికి 350 వరకు కరోనా డెత్ కేసులు నమోదైనట్టు సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) గణాంకాలు చెప్తున్నాయి.


ఇప్పటి వరకు దేశంలో కరోనాతో ఏడుగురు చనిపోయారు. మహారాష్ట్రలో నలుగురు, కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు కోవిడ్ వైరస్ ఎటాక్ అయ్యి చనిపోయారు. అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, బీహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లించింది. గతంలో దేశ వ్యాప్తంగా కరోనా టీకాలు వేయటం వల్లనే ఇప్పుడు కేసుల సంఖ్య తక్కువగా ఉందని.. అనారోగ్యంతో ఉన్న వాళ్లకే ఇప్పుడు కరోనా ఎటాక్ అవుతుందని.. పెద్దగా ప్రభావం చూపించటం లేదని.. జనం భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని వైద్య శాఖ స్పష్టం చేస్తోంది.

ఇటీవల ఆసియా దేశాలు మరీ ముఖ్యంగా హాంకాంగ్‌, సింగపూర్‌, థాయ్‌లాండ్‌తో పాటు చైనాలోనూ కొవిడ్‌-19 వ్యాప్తి విపరీతంగా ఉంది. వారానికి వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. వైరస్‌ వ్యాప్తికి జేఎన్‌.1 వేరియంట్‌, దాని ఉపరకాలే కారణంగా అధికారులు చెబుతున్నారు. జేఎన్‌.1 ఉపరకాలైన ఎల్‌ఎఫ్‌.7, ఎన్‌బీ.1.8 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని ఇటీవల సింగపూర్‌ ఆరోగ్యశాఖ తెలిపింది.

Also Read: ఆ బ్లడ్ గ్రూప్ వారికి కోవిడ్ ఇట్టే సోకుతుందా? అప్రమత్తం కాకుంటే అనర్థాలే!

ప్రస్తుతానికైతే.. కరోనా వైరస్ బారిన పడినవారిలో వ్యాధి తీవ్రత చాలా తక్కువగా ఉంది. కేవలం తక్కువ మందికి మాత్రమే.. హాస్పిటల్‌లో చేరాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఎవరికైనా దజ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు కనపిస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Related News

White Bread: బ్రెడ్ తింటున్నారా ? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివే !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు.. క్యారెట్ తింటే జరిగేది ఇదే !

Idli Chaat: ఇడ్లీ మిగిలిపోయిందా? ఇలా ఇడ్లీ చాట్ చేసేయండి, క్రంచీగా అదిరిపోతుంది

Katte Pongali: నోటిలో పెడితే కరిగిపోయేలా కట్టె పొంగలి ఇలా చేసేయండి, ఇష్టంగా తింటారు

Kind India: కొత్త ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ తో కైండ్ ఇండియా.. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే?

Darkness Around The Lips: పెదాల చుట్టూ నలుపు తగ్గాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు !

Moringa Powder: బరువు తగ్గడానికి.. మునగాకు పొడిని ఎలా వాడాలో తెలుసా ?

Arthritis Pain: కీళ్ల నొప్పులా ? వీటితో క్షణాల్లోనే.. పెయిన్ రిలీఫ్

Big Stories

×