Cleaning Tips: ప్రతి ఒక్కరూ తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు. కానీ మీరు ఇంటిని ఎంత శుభ్రం చేసినా కూడా ఇంట్లో తాజాదనం, మంచి వాసన లేకపోతే చేసిందంతా వ్యర్థంగా అనిపిస్తుంది. ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇంట్లోని మురికిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.
ఇదిలా ఉంటే మీరు ఇంట్లోని గదులను శుభ్రపరచడంతో పాటు సువాసన వెదజల్లేలా మార్చాలనుకుంటే.. నేలను తుడిచేటప్పుడు నీటిలో కొన్ని పదార్థాలను కలపడం ముఖ్యం. ఇలా చేయడం ద్వారా మాత్రమే ఇంటిని శుభ్రంగా, సువాసన వచ్చేలా మార్చుకోవచ్చు. మీ ఇల్లు శుభ్రంగా ఉండటమే కాకుండా రోజంతా తాజాగా ఉండటానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పువ్వులు, ఆకులు:
కొన్ని రకాల మూలికలు, ఎండిన పువ్వులు మీ ఇంటిని సహజంగా శుభ్రపరచడంలో సహాయపడతాయి. అంతే కాకండా ఇవి గదికి తాజా సువాసనను కూడా ఇస్తాయి. దీని కోసం మీరు లావెండర్, గులాబీ , పుదీనా ఆకులను ఉపయోగించవచ్చు. ఇల్లు శుభ్రం చేయడానికి 4-5 గంటల ముందు మీరు కొన్ని లావెండర్, గులాబీ పూలు, పుదీనా ఆకులను తీసుకొని 1 కప్పు వేడి నీటిలో నానబెట్టాలి. కొంత సమయం తర్వాత.. దానిని వడకట్టి.. ఇల్లు తుడుచుకునే నీటితో కలపండి. దీంతో మీరు ఇల్లు శుభ్రం చేయండి.
ఫాబ్రిక్ సాఫ్ట్‌నర్ :
మీ ఇంటికి తాజా, సువాసనగల వాసనను ఇవ్వడానికి ఫాబ్రిక్ సాఫ్ట్‌నర్ వాడటం మంచిది. దీని కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. 1 బకెట్ నీటిలో 1/2 కప్పు ఫాబ్రిక్ సాఫ్ట్‌నర్ కలిపి.. దానితో నేలను పూర్తిగా తుడవండి. ఆరిన తర్వాత ఇది మంచి సువాసనను అందిస్తుంది.
వంట సోడా:
బేకింగ్ సోడా దుర్వాసనలను తొలగించడానికి, మురికిని లోతుల నుండి శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. మీరు ఇల్లు తుడిచినప్పుడల్లా.. నీటిలో ఒక గుప్పెడు బేకింగ్ సోడా కలపండి. ఈ సులభమైన పరిష్కారం మీ నేలను శుభ్రపరచడమే కాకుండా తాజాగా అనిపించేలా చేస్తుంది.
మాపింగ్ చిట్కాలు:
కొన్ని రకాల నూనెలు మీ ఇంటిని మంచి వాసనతో నింపడమే కాకుండా.. యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ లక్షణాలను కూడా తొలగిస్తాయి. అంతే కాకుండా నేలను శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. మీకు మార్కెట్లో లావెండర్, నిమ్మకాయ, పిప్పరమెంటు , టీ ట్రీ ఆయిల్‌ను సులభంగా అందుబాటులో ఉంటాయి. వీటిని మాపింగ్ వాటర్ ఉన్న బకెట్‌లో 10-15 చుక్కలు కలిపి ఇల్లు శుభ్రం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
నిమ్మరసం:
గది సువాసనగా ఉండటానికి ఇల్లు తుడిచే.. నీటిలో కొద్దిగా నిమ్మరసం కలపండి. నిమ్మకాయ సహజ క్లీనర్‌గా పనిచేస్తుంది, ఇది నేలపై మురికిని తొలగిస్తుంది. అంతే కాకుండా ఇది ఈగలు, క్రిములను తరిమి వేస్తుంది. నేలను తుడిచే నీటిలో 1/2 కప్పు నిమ్మరసం కలిపి దానితో శుభ్రం చేయండి. మీ ఇల్లు సువాసన భరితంగా మారుతుంది.
వెనిగర్ వాడండి :
వెనిగర్ ఒక గొప్ప క్రిమిసంహారక మందు. ఇది నేలలను శుభ్రపరచడంతో పాటు మంచి వాసనను వెదజల్లుతుంది. నేలను తుడిచే నీటిలో కొద్దిగా వెనిగర్ కలపండి, ఇది నేలను ప్రకాశవంతంగా మారుస్తుంది. అంతే కాకుండా తాజా వాసన వెదజల్లేలా చేస్తుంది.
Also Read: పుదీనా జ్యూస్ తాగితే.. ఎన్ని లాభాలో తెలుసా ?
నీటిలో దాల్చిన చెక్క :
ముందుగా మీరు దాల్చిన చెక్క , కాస్త నీటిని మరిగించి, ఆ తర్వాత వీటిని ఇల్లు శుభ్రం చేసే నీటిలో కలపాలి. దీంతో మీ ఇంటి మొత్తాన్ని క్లీన్ చేయండి. నేలపై ఉన్న మురికిని గోరు వెచ్చని నీటితో తుడవడం ద్వారా కూడా శుభ్రం చేయవచ్చు.