Mint Juice: వేసవిలో శరీరాన్ని చల్లగా, తాజాగా ఉంచడానికి పుదీనా రసం చాలా బాగా ఉపయోగపడుతుంది. పుదీనా దాని శీతలీకరణ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. పుదీనా రసం తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే మెంథాల్ వేడి నుండి ఉపశమనం కలిగించడంలో , కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో పాటు.. పుదీనా రసం రోగనిరోధక శక్తిని పెంచడంలో, డీహైడ్రేషన్‌ను కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఈ జ్యూస్ ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా రుచి కూడా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. వేసవిలో దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరం అయినంత శక్తి అందుతుంది. అంతే కాకుండా అలసట కూడా తగ్గుతుంది. ఇది సహజ యాంటీఆక్సిడెంట్లు, పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. అంతే కాకుండా పుదీనా జ్యూస్ తాగడం ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.
పుదీనా రసం తాగడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు:
శరీరాన్ని చల్లబరుస్తుంది:
వేసవి కాలంలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ వంటి సమస్యలను కలిగిస్తుంది. పుదీనా దాని సహజ శీతలీకరణ లక్షణాల కారణంగా శరీరాన్ని లోపలి నుండి చల్లగా ఉంచుతుంది. ఇందులో ఉండే మెంథాల్ వేడి వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలోని నీటి లోపాన్ని భర్తీ చేసి, మిమ్మల్ని తాజాగా ఉంచుతుంది.
జీర్ణవ్యవస్థ పనితీరు:
అజీర్ణం, ఆమ్లత్వం, కడుపులో బరువుగా అనిపించడం వంటి జీర్ణ సమస్యలు వేసవిలో తరచుగా వస్తుంటాయి. పుదీనా రసంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా కడుపులో గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. దీంతో పాటు ఇది కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా ఇది ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తి:
వేసవిలో బాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు పెరుగుతాయి. పుదీనా రసంలో యాంటీ బాక్టీరియల్ , యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరానికి వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని అందిస్తాయి. అంతే కాకువడా ఇందులో ఉండే విటమిన్ సి , యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి.
చర్మాన్ని మెరిసేలా చేస్తుంది:
వేసవిలో అధిక చెమట, దుమ్ము కారణంగా చర్మంపై దద్దుర్లు, చికాకు, మొటిమలు వస్తాయి. పుదీనా రసం చర్మాన్ని డీటాక్స్ చేసి శరీరం నుండి హానికరమైన టాక్సిన్స్ ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. అందుకే పుదీనా జ్యూస్ తాగడం వల్ల చర్మ సమస్యలను తగ్గుతాయి. అంతే కాకుండా చర్మం సహజంగా ప్రకాశవంతంగా మారుతుంది.
Also Read: ప్రతీ 5 గురు మహిళల్లో ముగ్గురికి ఈ సమస్య.. మీలో కూడా ఈ లక్షణాలున్నాయా ?
శక్తి, మానసిక స్థితిని పెంచుతుంది:
సమ్మర్‌లో శరీరం నీరసంగా, అలసిపోయేలా చేస్తుంది. అంతే కాకుండా ఇది శరీర సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పుదీనా జ్యూస్ లో ఉండే మెంథాల్ మనసును రిఫ్రెష్ చేసి శక్తిని పెంచుతుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతే కాకుండా మానసిక స్థితిని రిఫ్రెష్ చేస్తుంది. తద్వారా రోజంతా ఉండే అలసటను తొలగించి పని చేసే సామర్థ్యాన్ని పెంచుతుంది.