Bus Driver: బెంగళూరు నుంచి కదిరి వస్తున్న ఒక ప్రైవేటు బస్సు డ్రైవర్‌పై కొందరు యువకులు దౌర్జన్యానికి దిగారు. మద్దయ్యగారిపల్లి వద్ద తాము కోరిన చోట బస్సు ఆపలేదనే కోపంతో, కొక్కంటి క్రాస్ చేరుకోగానే యువకులు బస్సును అడ్డుకుని డ్రైవర్‌పై ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. ప్రయాణికులు చూస్తుండగానే దౌర్జన్యానికి దిగడంతో బస్సులోని వారంతా భయాందోళనకు గురయ్యారు.
ప్రయాణికుల డిమాండ్..
అనవసర గొడవలతో తోటి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగించిన ఆ యువకులు, స్థానికులు చొరవ తీసుకుని నిలదీయడంతో అక్కడి నుంచి పరారయ్యారు. ప్రయాణికుల భద్రతను పణంగా పెట్టి డ్రైవర్‌ను తీవ్రంగా గాయపరిచిన ఆకతాయిలపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, మార్గమధ్యంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసు గస్తీ పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
బస్సు ఆపలేదని డ్రైవర్‌పై దాడి చేసిన యువకులు
బెంగళూరు నుంచి కదిరి వస్తున్న బస్సును మద్దయ్యగారిపల్లి వద్ద ఆపలేదనే ఆగ్రహంతో కొక్కంటి క్రాస్ వద్ద కొందరు యువకులు డ్రైవర్‌పై దాడికి తెగబడ్డారు. #Kadiri #BusDriverAttack #KokkantiCross pic.twitter.com/X7Mf8mgUOT
— BIG TV Breaking News (@bigtvtelugu) October 28, 2026