BigTV English

Vitamin K : విటమిన్ కె పొందాలంటే ఈ ఫుడ్స్ తీసుకోండి..!

Vitamin K : విటమిన్ కె పొందాలంటే ఈ ఫుడ్స్ తీసుకోండి..!

Vitamin K


Vitamin K Health Benefits : విటమిన్ కె అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే విటమిన్. ఇది ఎముకలు, గుండె ,మెదడు పనితీరులోను, కాలేయ సమస్యలు, లివర్ సిర్రోసిస్‌తో బాధపడేవారికి ఉపయోగపడే విటమిన్. శరీరంలో విటమిన్ కె లోపిస్తే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆ లోపాన్ని భర్తీ చేయడానికి ఎటువంటి ఆహారాలు తీసుకోవాలో చూద్దాం..

విటమిన్ కె లోపాన్ని ఈ ఆహారాలతో భర్తీ చేస్తాయి.


  • ఆకు కూరలు
  • ఆవాలు, పాలకూర
  • గోధుమ బార్లీ
  • ముల్లంగి, బీట్‌రూట్
  • అరటిపండు
  • మొలకెత్తిన ధాన్యాలు
  • గుడ్లు
  • మాంసం

అవకాడో

అవకాడోలో విటమిన్ కె ఉంటుంది. ఇది ఎముకలకు చాలా మేలు చేస్తుంది. ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఇందులో ఉంటాయి.ఇవి గుండెకు మేలు చేస్తాయి. అంతేకాకుండా శరీరా బరువు ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది.

Read More : కొబ్బరి నీళ్లు తాగితే బోలెడు ప్రయోజనాలు

ఎర్ర ముల్లంగి

ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలో విటమిన్ కెతో పాటు పొటాషియం కూడా పుష్కలంగా లభిస్తుంది. ఎముకలు, గుండె, కళ్ళు ,అధిక రక్తపోటు నుంచి రక్షించడంలో ఇది చాలా సహాయకారిగా ఉంటుంది. ఇందులోఉండే ఫైబర్ బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

పాలకూర

ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండే ఆకు కూరల్లో పాలకూర ఒకటి. ఇందులో విటమిన్-కె, విటమిన్-ఎ, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. పాలకూరు కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. ఎముకలను దృఢంగా చేస్తుంది, ఫ్రీ రాడికల్స్ నష్టాన్ని, రక్తహీనత ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గాయాలను త్వరగా నయం చేయడంలో కూడా సహాయపడుతుంది.

బ్రోకలీ

విటమిన్ కె తోపాటు అనేక ఇతర విటమిన్లు, ఖనిజాలు, యాంటీ-ఆక్సిడెంట్లు బ్రోకలీలో ఉంటాయి. దీన్ని మీ ఆహారంలో తీసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. దీన్ని తరచూ తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను పెంచుతాయి.

Read More : స్టెరాయిడ్స్ ఇంజెక్ట్ చేసుకోవడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

కడుపులో మంట, క్యాన్సర్, గుండె జబ్బుల నుంచి రక్షించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది, ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడడమేకాకుండా మలబద్ధకం నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

కాలే

కాలేలో విటమిన్ కె పెద్ద పరిమాణంలో లభిస్తుంది. వీటితో పాటు విటమిన్ ఇ, విటిమిన్ సి కూడా ఉంటాయి. దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. అంతేకాకుండా క్యాన్సర్‌, గుండె జబ్బులు రాకుండా సహాయపడుతుంది. కాలేలో ఎముకలు, దంతాలకు అవసరమైన క్యాల్షియం కూడా లభిస్తుంది.

Disclaimer : ఈ సమాచారాన్ని మెడికల్ జర్నల్స్ ఆధారంగా అందిస్తున్నాం. దీనని అవగాహనగా భావించండి.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×