Foods that boost memory: చాలా మంది కొన్ని అంశాలను ఒకసారి చెబితే కొద్ది సమయంలోనే మర్చిపోతారు, అలాగే చిన్న పిల్లలు కూడా చదివిన అంశాన్ని కొద్ది సమయంలోనే మర్చిపోతారు. దీనికి కారణం మనం తినే ఆహారం పై కూడా ఆధారపడుతుంది. మెదడు ఆరోగ్యాన్ని, జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను మెరుగుపరిచే కొన్ని ఆహారాలు తినడం వల్ల మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
బ్లూబెర్రీస్(Blueberries)
బ్లూబెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్స్ విటమిన్ సి, కె, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడులోని ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి, న్యూరాన్‌ల మధ్య సమాచార బదిలీని పెంచుతాయి. రోజూ ఒక కప్పు తాజా బ్లూబెర్రీస్‌ను సలాడ్‌లో, స్మూతీలో లేదా నేరుగా తినవచ్చని తెలిపారు.
బాదం మరియు గింజలు(Nuts – Almonds, Walnuts)
బాదంలో విటమిన్ ఇ ఉంటుంది, ఇది మెదడు కణాలను రక్షిస్తుంది. అక్రోట్‌లలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, DHA ఉంటాయి, ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. రోజూ 10-15 బాదం లేదా 4-5 అక్రోట్‌లను తినవచ్చు. ఇవి స్నాక్‌గా లేదా సలాడ్‌లో వేసుకోవచ్చు. ఇలా తినడం వల్ల ఇవి మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.
ఫ్యాటీ ఫిష్ (Fatty Fish)
సాల్మన్, మాకెరెల్ వంటి చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి, ఇవి మెదడు కణాల నిర్మాణానికి, జ్ఞాపకశక్తి మెరుగుదలకు సహాయపడతాయి. అలాగే వారానికి 2-3 సార్లు గ్రిల్ చేసిన లేదా ఆవిరిలో ఉడికించిన చేపలను తినాలని వైద్య నిపుణులు తెలిపారు. అంతేకాకుండా ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అల్జీమర్స్ వ్యాధి రాకుండా నిరోధిస్తాయని జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో పేర్కొనబడింది.
ఆకుకూరలు (Leafy Greens)
స్పినాచ్, కాలే వంటి ఆకుకూరలలో విటమిన్ కె, ఫోలేట్, బీటా కెరోటిన్, లుటీన్ ఉంటాయి, ఇవి మెదడు ఆరోగ్యాన్ని పెంచుతాయి, జ్ఞాపకశక్తి క్షీణతను తగ్గిస్తాయి.
వీటిని రోజూ సలాడ్‌లో, స్మూతీలలో లేదా కూరలలో చేర్చుకోని తినవచ్చు.
అవకాడో (Avocado)
అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి, ఇవి మెదడుకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. విటమిన్ ఇ, ఫోలేట్ కూడా జ్ఞాపకశక్తిని పెంచుతాయని చెబుతున్నారు.
డార్క్ చాక్లెట్ (Dark Chocolate)
డార్క్ చాక్లెట్‌లో ఫ్లేవనాయిడ్స్, కెఫీన్, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి, ఇవి మెదడు ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా 70% లేదా అంతకంటే ఎక్కువ కోకో ఉన్న డార్క్ చాక్లెట్‌ను రోజూ 20-30 గ్రాములు తినవచ్చు. ఇందులో ఉన్న ఫ్లేవనాయిడ్స్ మెదడులో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయని సైంటిఫిక్ స్టడీస్ సూచిస్తున్నాయి.
గుడ్డు (Eggs)
గుడ్డులో విటమిన్ B6, B12, ఫోలేట్, కోలిన్ ఉంటాయి. కోలిన్ మెదడులో న్యూరోట్రాన్స్‌మిటర్ అయిన అసిటైల్‌కోలిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది, ఇది జ్ఞాపకశక్తికి కీలకం. అలాగే రోజూ 1-2 ఉడికించిన గుడ్లు తినడం చాలా మంచిదంటున్నారు.
తృణధాన్యాలు (Whole Grains)
తృణధాన్యాలలో విటమిన్ ఇ, బి విటమిన్లు, ఫైబర్ ఉంటాయి, ఇవి మెదడుకు స్థిరమైన శక్తిని అందిస్తాయి ఏకాగ్రతను పెంచుతాయాని తెలిపారు. అయితే వీటిని ఉదయం ఓట్స్, బ్రౌన్ రైస్ లేదా క్వినోవాతో తయారైన వంటకాలను తీసుకోవచ్చని చెబుతున్నారు.
ప్రతి రోజూ తృణధాన్యాలు తీసుకోవడం వల్ల మెదడుకు గ్లూకోస్ సరఫరాను మెరుగుపరుస్తాయని కొన్ని పరిశోధనలు తెలిపాయి.
నీరు (Water)
శరీరం, మెదడు డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రత తగ్గుతాయి. కావున తగినంత నీరు తాగడం వల్ల మెదడు పనితీరును సాధారణంగా ఉంచుతుంది. అనేక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది. ప్రతిరోజూ 4 నుంచి 5 లీటర్ల నీరు తాగాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నీరు తక్కువగా తాగితే శరీరం డీహైడ్రేషన్ అయ్యి కాగ్నిటివ్ ఫంక్షన్‌ను దెబ్బతీస్తుందని జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో తెలిపారు.
Also Read: ఇండియాలో బెస్ట్ ట్రెక్కింగ్ ప్రదేశాలు ఇవే!
అదనపు చిట్కాలు:
సమతుల ఆహారం: జ్ఞాపకశక్తిని పెంచడానికి ఒకే ఆహారంపై ఆధారపడకుండా, పైన పేర్కొన్న ఆహారాలను సమతులంగా తీసుకోవాలి.
వ్యాయామం: రోజూ 30 నిమిషాల నడక, యోగా, లేదా ధ్యానం జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.
నిద్ర: రోజూ 7-8 గంటల నిద్ర మెదడు ఆరోగ్యానికి చాలా ముఖ్యం.
పరిమితి: అధిక చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తాయి, కాబట్టి వీటిని తగ్గించండి.