BigTV English

Beautiful Trekking Places: ఇండియాలో బెస్ట్ ట్రెక్కింగ్ ప్రదేశాలు ఇవే!

Beautiful Trekking Places: ఇండియాలో బెస్ట్ ట్రెక్కింగ్ ప్రదేశాలు ఇవే!

Beautiful Trekking Places: మన దేశంలోని కొన్ని అందమైన ప్రాంతాలకు ట్రెక్కింగ్ ద్వారానే చేరుకోవాలి. అక్కడికి వెళ్లడానికి నడకదారి తప్ప మరో అవకాశం ఉండదు. అలాంటి ప్రదేశాలేవో తెలుసుకుందాం.


అనేక భిన్నరకాల భూభాగాలతో భారతదేశం ప్రతి ఒక్కర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అద్భుతమైన హిమాలయాలు నుండి అందమైన ఎడారి వరకు, గొప్ప పర్యాటక బీచ్‌ల నుండి ప్రకృతి పచ్చని ప్రదేశాల వరకు ఎన్నో రకాల అందాలు పర్యాటకుల్ని మైమరపిస్తాయి. దీంతో కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చూడదగ్గ ప్రదేశాలకు కొదవే లేదు. ఈ ప్రదేశాలన్నీ సుందరమైన అందాలకు ప్రసిద్ధి చెందినవి. అయితే, కొన్ని ప్రదేశాలు చాలా మారుమూల ప్రాంతాల్లో ఉండటంతో అక్కడికి వెళ్లడం అంత తేలిక కాదు. మరోమాటలో చెప్పాలంటే అక్కడికి వెళ్లడానికి రోడ్లు కూడా ఉండవు. కేవలం ట్రెక్కింగ్ చేస్తేనే అక్కడికి చేరుకోగలం. అవి తప్పక చూడాల్సిన ప్రదేశాలు కావడంతో వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ప్లవర్ వ్యాలీ
ఇది భారతదేశంలోని అత్యంత అందమైన ప్రదేశాల్లో కచ్చితంగా ఒకటని చెప్పొచ్చు. ఇక్కడికి పర్యాటకులు ఎవరైనా ట్రెక్కింగ్ ద్వారానే చేరుకోగలరు. 1980లో భారత ప్రభుత్వం దీన్ని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్‌‌గా గుర్తించింది. 2002లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగానూ గుర్తించింది. దీంతో ఇదెంత ప్రత్యేకమైన ప్రాంతమో మీరే అర్థం చేసుకోవచ్చు. అయితే, ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కు వెళ్లడం అంత తేలిక కాదు. అందుకు తగ్గ సన్నద్ధత చేసుకొని మంచి ప్రణాళికతో ముందుకెళ్లాలి.


మలానా, హిమాచల్ ప్రదేశ్..
ఇది హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక అందమైన గిరిజన గ్రామం. సముద్ర మట్టానికి సుమారు 9,937 అడుగుల ఎత్తులో ఉండు ఈ గ్రామం అద్భుతమైన వీక్షణలను కలిగి ఉంది. అలాగే ఇక్కడి గిరిజన ప్రజలు అనుసరించే విశిష్ట ప్రజాస్వామ్య పాలనా విధానం, వారు అనుసరించే సంస్కృతి,సంప్రదాయాలు, విశిష్టమైన భాష ఈ గ్రామాన్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. స్థానికులు దీన్ని రిపబ్లిక్ ఆఫ్ మలానా అని కూడా పిలుస్తారు. అయితే, ఇక్కడికి వెళ్లాలంటే ట్రెక్కింగ్ చేయడమే ప్రధానం. అది పెద్ద కష్టతరం కాకపోయినా కొంచెం సవాలు విసురుతుంది. చుట్టూ పచ్చని అడవులు, గడ్డి భూముల గుండా సాగే ఈ ప్రయాణం జీవితంలో గొప్ప ట్రెక్కింగ్‌లలో ఒకటిగా మిగిలిపోతుంది.

హేమకుండ్ సాహిబ్, ఉత్తరాఖండ్..
ఉత్తరాఖండ్‌లోని హిమాలయ మధ్య ఉండే శ్రీ హేమకుండ్ సాహిబ్ అనే గురుద్వారా అందమైన, ఆధ్యాత్మిక ప్రదేశం. ఇక్కడికి చేరుకోవడానికి వేరే మార్గం లేకపోవడంతో కచ్చితంగా ట్రెక్కింగ్ చేయాల్సిన పరిస్థితే ఉంటుంది. ఈ గొప్ప ప్రదేశాన్ని ఏటా వేలాది మంది భక్తులు సందర్శిస్తుంటారు.హేమ్‌కుండ్ సాహిబ్ చేరుకోవడానికి ఎవరైనా 18 కి.మీ దూరం ట్రెకింగ్ చేయాల్సిందే. గోవింద్‌ఘాట్ నుండి ప్రారంభమై ఘంగారియాను దాటుకొని ఈ హేమ్‌కుండ్ చేరుకోవాల్సిందే. ఇది కొంచెం కష్టతరమైన ట్రెక్కింగ్ మార్గమనే చెప్పాలి.

లివింగ్ రూట్ బ్రిడ్జ్, మేఘాలయ..
పర్యాటకులు ఎవరైనా మేఘాలయకు వెళ్లినప్పుడు అరుదైన లివింగ్ రూట్ బ్రిడ్జ్‌లను చూడటంలో ఆశ్చర్యం లేదు. మర్రిచెట్టు ఊడలను గాల్లో ఒకదానికొకటి పేర్చి బ్రిడ్జి‌లుగా నిర్మించారు అక్కడి ఖాసీ ప్రజలు. ఈ బ్రిడ్జిలను చిన్న కుంటల వద్ద, నీటి ప్రవాహాల మీదుగా పేర్చారు. వీటిపై ఒకేసారి అనేక మంది నడుచుకుంటూ వెళ్లొచ్చు. అయితే, ఇక్కడికి చేరుకోవాలంటే అడవుల గుండా ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దాదాపు 4 గంటల సమయం పడుతుంది.

ఫుక్తాల్ (ఫుగ్తాల్) మొనాస్టరీ, లద్ధాఖ్..
లద్ధాఖ్‌లోని ట్రాన్స్-హిమాలయన్ ప్రాంతంలో ఉన్న ఫుక్తాల్ బౌద్ధ మఠానికి కాలినడకన మాత్రమే వెళ్లగలరు. కలప, బురదతో నిర్మించిన ఈ మఠం ఒక కొండపై అందంగా ఉంటుంది. దీన్ని దూరం నుండి చూస్తే అచ్చం తేనెగూడులా కనిపిస్తుంది. పర్యాటకులు ఎవరైనా ఇక్కడికి వెళ్లాలంటే ముందుగా రారుకి కాలినడకన వెళ్లాలి. అక్కడి నుండి లుంగ్నాక్ నది గుండా ప్రయాణిస్తూ చటాంగ్ గ్రామానికి చేరుకోవాలి. అక్కడి నుండి నేరుగా ఈ మఠానికి వెళ్లవచ్చు. ఈ మార్గంలో పచ్చిక బయళ్లతో పాటు గంభీరమైన పర్వతాలను చూడొచ్చు.

Also Read: వోడ్కా ఫేస్‌‌ప్యాక్‌తో.. మెరిసే ముఖం మీ సొంతం

రూప్‌కుండ్ సరస్సు, ఉత్తరాఖండ్..
ఉత్తరాఖండ్‌లోని మిస్టరీ లేక్ లేదా స్కెలిటన్ లేక్ అని పిలిచే ఈ అందమైన సరస్సు సముద్ర మట్టానికి సుమారు 16,499 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీంతో ఇక్కడికి వెళ్లడం అంత తేలికైన విషయం కాదు. మరోవైపు ఈ సరస్సు గురించి ఒక విషయం చెప్పుకోవాలి. ఇందులో మంచు కరిగినప్పుడు అనేక మానవ అస్థిపంజరాలు కనిపిస్తాయి. ఇది హిమాలయ పర్వతాల్లో ఉండటంతో ట్రెక్కింగ్ ద్వారా మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అయితే, ఆ మార్గం చాలా సుందరమైన దృశ్యాలను కలిగి ఉంటుంది. దీంతో ఎవరు వెళ్లినా గొప్ప అనుభూతి పొందుతారు.

Related News

Air India Offer: బస్ టికెట్ ధరకే ఫ్లైట్ టికెట్, ఎయిర్ ఇండియా అదిరిపోయే ఆఫర్!

Lemon Crushing: కొత్త వెహికిల్ టైర్ల కింద నిమ్మకాయలు పెట్టే ఆచారం.. దీని వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

Coconut Price: భారత్ లో రూ. 50 కొబ్బరి బోండాం, అమెరికా, చైనాలో ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!

Bali vacation: బాలి వెకేషన్ కు వెళ్దాం వస్తావా మామా బ్రో.. ఖర్చు కూడా తక్కువే!

Male River: దేశంలో ప్రవహించే ఏకైక మగ నది ఇదే, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణికులా?

Big Stories

×