Genelia : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిరూపించుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఎంతోమంది హీరోయిన్లు సరైన సక్సెస్ కుట్టి కూడా నేడు కనిపించకుండా పోయారు. అయితే డిజాస్టర్ సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన కూడా ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో పని చేసే అవకాశం దక్కించుకున్న హీరోయిన్లు కూడా ఉన్నారు. వాళ్ళు ముఖ్యంగా శ్రీలీలా పేరు చెప్పుకోవచ్చు. వాస్తవానికి తన మొదటి నటించిన పెళ్లి సందడి సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ అవకాశాలు మాత్రం ఆమెకు విపరీతంగా వచ్చాయి. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న పూజ హెగ్డే కు ఇప్పుడు తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. పాత హీరోయిన్ల ప్రస్తావని తీసుకొస్తే జెనీలియాకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తను చేసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి.
సౌత్ సినిమాల్లో సరైన రోల్స్ ఉండవు
ఇక ప్రస్తుతం జెనీలియా మరోసారి సి తారే జమీన్ పర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరగా ఉన్న తరుణంలో పలు రకాల ఇంటర్వ్యూస్ ఇస్తూ సినిమాను ప్రమోట్ చేస్తుంది. ఇంటర్వ్యూలో భాగంగా ఒక యాంకర్ సౌత్ సినిమా ఇండస్ట్రీలో సరైన రోల్స్ ఉండవు అని అనగానే, వెంటనే తను నోరు మూసేలా ఆన్సర్ ఇచ్చింది. నేను ఆ విషయానికి ఒప్పుకోను నాకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చాలా మంచి అవకాశాలు ఇచ్చింది. మీరు ఆ సినిమాలు చూస్తే అత్యుత్తమ పాత్రలు నాకు దక్కాయని మీకు అర్థమవుతుంది. నేను అక్కడ చాలా నేర్చుకున్నాను. నేను అక్కడ చేసిన పనికి ఎప్పటికీ రుణపడి ఉంటాను అని జెనీలియా ఆన్సర్ ఇచ్చింది.
ఎప్పటికీ గుర్తుండే హాసిని
ఇక జెనీలియా తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా కూడా బొమ్మరిల్లు సినిమాలోని హాసిని పాత్రను ఎవరు మర్చిపోలేరు. అసలు ఆ పాత్ర కోసం జెనీలియా ను తీసుకున్నప్పుడే బొమ్మరిల్లు భాస్కర్ సక్సెస్ అయ్యాడు. అయితే ఒక తరుణంలో ఆ సినిమాను చేయలేను అని జెనీలియా కూడా అనుకున్నారు. మళ్లీ అల్లు అర్జున్ చెప్పడం వలన జెనీలియా ఆ పాత్రను చేశారు. ఇక ఇప్పటికీ చాలామంది హాసిని అనే పాత్రకు విపరీతంగా కనెక్ట్ అవుతారు. ప్రొడ్యూసర్ సితార నాగవంశీ ఒక సందర్భంలో మాట్లాడుతూ తమ సిస్టర్ కు బొమ్మరిల్లు సినిమా చూసిన తర్వాతే హాసిని అనే పేరు పెట్టినట్లు కూడా తెలిపారు. అలానే ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోస్ తో జెనీలియా పనిచేశారు.
Also Read : OG Ceeded Rights : వీరమల్లు కాలేదు… ఓజీకి ఫుల్ డిమాండ్.. సీడెడ్ రైట్స్ సోల్డ్ అవుట్